Vishwak movie review.. భావోద్వేగానికి గురిచేసే కథ.. ఆకట్టుకొనేలా నటీనటుల పెర్ఫార్మెన్స్

Rating: 2.75/5

నటీనటులు: అజయ్ కుమార్ కథుర్వార్, డింపుల్ హయతి
దర్శకుడు: వేణు ముల్కల
నిర్మాత: తాటికొండ ఆనందమ్ బాలకృష్ణన్
మ్యూజిక్ డైరెక్టర్: సత్య సాగర్ పొలమ్
సినిమాటోగ్రాఫర్: ప్రదీప్ దేవ్
ఎడిటర్: విశ్వనాథ్
కొరియోగ్రఫి: రామ్ ఇసుకపాటి
బ్యానర్: గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2022-02-18

Vishwak movie review and Rating

దేశమంటే భక్తితోపాటు ఉన్నత భావాలు ఉన్న యువకుడు విశ్వక్ (అజయ్ కథుర్వార్). ప్రస్తుత కాలంలో యువకులందరి మాదిరిగానే తన కొడుకు కూడా విదేశాలకు వెళ్లాలని విశ్వక్ తండ్రి (అప్పాజీ అంబరీష్) భావిస్తాడు. కానీ తండ్రి కోరికను తిరస్కరించి స్వదేశంలోనే ఉండి తనకు ఉండే వినూత్న ఆలోచనలతో బిజినెస్ చేయాలనుకొంటాడు. తన మాదిరిగానే విజన్, ఆలోచనలు ఉన్న అమ్మాయి (డింపుల్)తో ప్రేమలో పడుతాడు. తండ్రి ఇచ్చిన డబ్బుతో వ్యాపారం ప్రారంభించి తీవ్రంగా నష్టపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమించిన అమ్మాయి కూడా దూరమవుతుంది.

విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకొనే అందరి యువకులకు భిన్నంగా విశ్వక్ ఎందుకు ఉన్నాడు? ప్రవాస భారతీయులంటే విశ్వక్‌కు ఎందుకంత అయిష్టం? బిజినెస్‌లో భారీ నష్టాలు ఎదుర్కొన్న తర్వాత విశ్వక్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? తనకు ఎదురైన సమస్యల నుంచి విశ్వక్ భయటపడ్డాడా? తనకు దూరమైన ప్రేయసితో విశ్వక్ మళ్లీ కలిశాడా? ఎన్నారైలకు విశ్వక్ పాత్ర ద్వారా దర్శకుడు వేణు విసిరిన సవాల్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వక్ సినిమా కథ.

దర్శకుడు వేణు ఎంచుకొన్న పాయింట్ యువతలోను, ప్రజల్లోను సరికొత్త ఆలోచనలు కలిగిస్తాయి. కథ, కథనాల పరంగా ప్రేక్షకులను మెప్పించే విషయంలో కత్తి మీద సాము, ఛాలెంజింగ్‌గా ఉండే పాయింట్‌ను ఎంచుకోవడాన్ని అభినందించాలి. కానీ కొంత మేరకు బలమైన సన్నివేశాలు రాసుకొన్న వేణు టేకింగ్‌లో కొన్నిసార్లు తడబాటు కనిపిస్తుంది. విశ్వక్ ఆవేదనను, రైతు కథను జోడించిన విధానం వావ్ అనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్రతీ సన్నివేశాన్ని ఆసక్తికరంగా మలచడమే కాకుండా కథను నడిపించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు, సైనికాధికారికి, విశ్వక్‌కు మధ్య సీన్లు, ప్రియురాలితో బ్రేకప్ లాంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయి.

ఇక విశ్వక్ పాత్రలో అజయ్ కథుర్వార్ ఒదిగిపోయాడు. దేశభక్తి, ఆవేశం కలిగిన యువకుడి పాత్రకు ప్రతిబింబంగా కనిపించాడు. గ్రామాల్లో ఉండే యూత్ ఆలోచనలను చెప్పే పాత్రలో చక్కగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తన టాలెంట్‌ను అద్భుతంగా చూపించాడు. డైలాగ్స్ డెలివరీ, ఇతర అంశాలలో పరిణితి, అనుభవం ఉన్న ఉన్న నటుడిగా తెరపైన కనిపించాడు. మంచి కథ పడితే అజయ్ కథుర్వార్ యువ హీరోగా రాణిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

Vishwak movie review and Rating

సాంకేతిక నిఫుణుల విషయానికి వస్తే.. సత్య సాగర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌కు తీసుకెళ్ళిందనేన భావన కలుగుతుంది. ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ విశ్వనాథ్‌ పనితనం బాగుంది. కానీ ఇంకా కొంత పని మిగిలి ఉందనిపిస్తుంది. కోరియోగ్రాఫర్ రామ్ పనితనం తెర మీద కనిపిస్తుంది.

ఇక విశ్వక్ సినిమాకు సంబంధించి తెర వెనుక హీరో నిర్ామత తాటికొండ ఆనందమ్ బాలకృష్ణన్ అని చెప్పవచ్చు. ఇలాంటి సబ్జెక్ట్‌ను సినిమా తెరకెక్కించాలంటే చాలా గట్స్ ఉండాలి. దర్శకుడు వేణు విజన్‌ను నమ్మి సినిమా తీసేందుకు ముందుకొచ్చిన బాలకృష్ణన్‌ను అభినందించాలి. ఇలాంటి సినిమాను తీయడం అందరికి సాధ్యపడని విషయాన్ని బాలకృష్ణన్ సుసాధ్యం చేశారని చెప్పవచ్చు.

ప్రేక్షకుడిని ఆలోచింపజేసే కథ, ఇండియాలో విద్యనభ్యసించి విదేశాలకు సేవ చేసే ఎన్నారైలను ప్రశ్నించే ఓ విభిన్నమైన కథ విశ్వక్. దేశంలోని పరిస్థితులపై సరికొత్త ఆలోచనలు రేకెత్తించే చిత్రం. కానీ పబ్లిసిటీ లేని కారణంగా ప్రేక్షకులకు కాస్త దూరమైందనిపిస్తుంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్, చక్కటి నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణల పనితనం ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చిందని చెప్పవచ్చు. ప్రతీ ఒక్క విద్యార్థి, సగటు ప్రేక్షకుడు చూడాల్సిన చిత్రమని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ సినిమా ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా మార్చేస్తుందని గ్యారెంటీగా చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X