Boo Review: ఎక్కిళ్లతో జాగ్రత్త.. విశ్వక్ సేన్ రకుల్ ప్రీత్ హారర్ మూవీ భయపెట్టిందా? 'బూ' రివ్యూ

రేటింగ్: 2.5/5

టైటిల్: బూ
నటీనటులు: విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబెకా మోనికా జాన్, విద్యుల్లేఖ రామన్, పృథ్వీ రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సందీప్ విజయ్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: రామాంజనేయులు, రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం: ఎఎల్ విజయ్
ఓటీటీ విడుదల తేది: మే 27, 2023
ఓటీటీ వేదిక: జియో సినిమా

ప్రేక్షకులను ఆకట్టుకునే జోనర్లలో హారర్ ఒకటి. ప్రేక్షకులను భయపెట్టేందుకు తరచుగా ఈ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన మసూద, విరూపాక్ష మినహా ఏ హారర్ మూవీస్ అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ జోనర్ లో వచ్చిన చిత్రమే 'బూ' (Boo Movie 2023). ఇందులో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. పబ్లిసిటీ కూడా అంతగా చేయలేదు. అలాంటిది ఇటీవల ఒక ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేసి నేరుగా ఓటీటీలోకి దించారు. మరి ఈ సినిమా భయపెట్టిందో లేదో నేటి రివ్యూలో (Boo Telugu Review) తెలుసుకుందాం.

కథ: కైరా (రకుల్ ప్రీత్ సింగ్) ఒక ఫన్నీ అమ్మాయి. తన ఇంట్లో రాత్రి ముగ్గురు ఫ్రెండ్సుతో కలిసి హాలోవీన్ పార్టీ అరేంజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే హాలోవీన్ స్టోరీస్ పేరుతో ఉన్న దెయ్యాల కథలను చదువుతారు. ఆ కథల్లో ఎలా ఉంటే రియల్ లైఫ్ లో కూడా వీరికి అలాగే జరుగుతుంది. అయితే ఆ భయంకర సంఘటనల నుంచి బయటపడాలంటే బుక్ మొత్తం చదవాలి. అలా పుస్తకం పూర్తయ్యే సరికి వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? కైరా స్నేహితులకు ఏం జరిగింది? కథలో ఉన్న అవినాష్ (విశ్వక్ సేన్) ఎవరు? అతను ఏం కోల్పోయాడు? కైరాకు చివరకు ఎలాంటి అనుభవం ఎదురైంది? అనే థ్రిల్లింగ్ అంశాలు తెలియాలంటే 'బూ' చూడాల్సిందే.

Boo Movie Review

విశ్లేషణ: కథలో ఓ అమ్మాయి తన ఫ్రెండ్సుతో కలిసి హాలోవీన్ పార్టీ జరుపుకోవడంతో ఏర్పడిన పరిస్థితుల కథాంశంగా సినిమా ఉంది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో వేసవి చివర్లో వచ్చే పంటలను దుష్టశక్తుల నుంచి కాపాడుకునేందుకు అక్టోబర్ 31న ఈ హాలోవీన్ పండుగ జరుపుకుంటారు. కానీ ఈ సినిమాలో అది దెయ్యాల పండుగగా.. వాటిని పిలిచే వేడుకగా చూపించారు. అది పక్కన పెడితే పుస్తకంలో ఉన్న ఒక్కో దెయ్యం కథను చదవడం, కథలో జరిగే పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కోసం మరో స్టోరీ చదవడం వంటి విషయాలు పెద్దగా భయపెట్టవు కానీ, సస్పెన్సింగ్ గా, ఆసక్తిగా అనిపిస్తుంది.

గంట తర్వాత: ఫస్ట్ ఎక్కిళ్ల స్టోరీ ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత వచ్చే స్టోరీలు కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. అయితే 2003లో వచ్చిన హిందీ మూవీ డర్నా మనా కాన్సెప్టుతో బూ సినిమా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. స్టోరీలో జరిగే సన్నివేశాలు నిజ జీవితంలో జరగడం, ఆ కథలన్నింటికి ఒక లింక్ ఉండటం మాత్రం సరికొత్త అంశం. మూవీలో గంట తర్వాత వచ్చే విశ్వక్ సేన్ స్టోరీ నుంచి ఇంకాస్తా బాగుంటుంది. ట్విస్టులు ఓకే. క్లైమాక్స్ లో వచ్చే ఓ ట్విస్ట్ కాస్తా భయపెడితే.. ఫైనల్ ట్విస్ట్ చాలా వరకు ఊహించవచ్చు. సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండటంతో స్క్రీన్ గ్లామర్ గా కనిపిస్తుంది.

Boo Movie Review

ఎవరెలా చేశారంటే?: అల్లరి అమ్మాయిగా రకుల్ ప్రీత్ చాలా బాగా ఆకట్టుకుంది. పారా నార్మల్ సైంటిస్టుగా విశ్వక్ సేన్ కనిపించింది కొంచెం సేపు అయిన సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. మేఘా ఆకాష్ ఓకే. నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, రెబెకా మోనికా పాత్రలకు న్యాయం చేశారు. విద్యుల్లేఖ కామెడీ బాగానే పండింది. ఆమెకు తోడుగా పృథ్వీరాజ్ అలరించారు. రవి ప్రకాష్ బీజీఎమ్ బాగుంది. ఉన్న ఒక్క పాట పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు అంతా బాగున్నాయి.

Boo Movie Review

ఫైనల్ గా చెప్పాలంటే?: 'బూ' వంటి హారర్ స్టోరీస్ ఇదివరకు చాలానే వచ్చాయి. ఈ మూవీ అంతలా భయపెట్టకపోయినా ఎంగేజ్ చేస్తుంది. రకుల్ ప్రీత్, విశ్వక్ సేన్ పాత్రలే ప్రధానంగా సాగిన బూ మూవీ నిడివి కేవలం గంటన్నర మాత్రమే. కాబట్టి తీరిక సమయంలో ఈజీగా చూసేయచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం జియో సినిమా (Jio Cinema)లో 'బూ' మూవీ ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X