twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశ్వరూపం2 మూవీ రివ్యూ

    By Rajababu
    |

    Recommended Video

    Vishwaroopam 2 Movie Review విశ్వరూపం2 సినిమా రివ్యూ

    Rating:
    2.0/5
    Star Cast: కమల్ హాసన్, రాహుల్ బోస్, శేఖర్ కపూర్, పూజా కుమార్, అండ్రియా జెర్మియా
    Director: కమల్ హాసన్

    విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో నటించి రూపొందిన చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విశ్వరూపం మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా అని తెలుసుకోవాలంటే విశ్వరూపం కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

    విశ్వరూపం2 కథ

    విశ్వరూపం2 కథ

    న్యూయార్క్ నగరంపై భయకంకరమైన ఉగ్రదాడిని చేయడంలో విఫలమైన ఓమర్ ఖురేషి (రాహుల్ బోస్), సలీం (జైదీప్ అహ్లావత్) మరో దారుణమైన ఎటాక్‌కు ప్లాన్ చేస్తారు. ఓమర్ ఉగ్రదాడిని చిత్తు చేసేందుకు భారత జవాను, గూఢచారి మేజర్ విసామ్ ఆహ్మద్ కశ్మీరి (కమల్ హాసన్), న్యూక్లియర్ ఆంకాలజిస్టు, భార్య నిరుపమ (పూజా కుమార్), సహచర ఉద్యోగి అస్మిత సుబ్రమణ్యం (అండ్రియా జెర్మియా), కల్నల్ జగన్నాథ్ (శేఖర్ కపూర్) ఓ మిషన్‌కు సిద్దమవుతారు. ఈ మిషన్‌లో అస్మిత ప్రాణ త్యాగం చేస్తుంది.

    విశ్వరూపం2లో ట్విస్టులు

    విశ్వరూపం2లో ట్విస్టులు

    ఓమర్, సలీం ఉగ్రదాడి వ్యూహరచనను విసామ్ ఎలా చిత్తు చేశారు? ఈ మిషన్‌లో విసామ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? దేశం కోసం ఏ పరిస్థితుల్లో అస్మిత ప్రాణ త్యాగం చేసింది? ఓమర్ ఖురేషి భార్య, పిల్లల కోసం విసామ్ ఏం చేశాడు? చివరకు ఓమర్‌, సలీంను ఎలా మట్టుపెట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వరూపం2 కథ.

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    2013లో విడుదలైన విశ్వరూపం చిత్రం ఎక్కడైతే ముగిసిందో విశ్వరూపం2 కథ అక్కడ నుంచి మొదలవుతుంది. ఓమర్ బంకులపై సంకీర్ణ దళాల దాడులను చేయడం తొలిభాగంలో ప్రధాన అంశంగా కనపడుతుంది. తొలిభాగంలో వ్యూహ రచన సాగదీయడంతో ప్రేక్షకులకు సహనాన్ని పరీక్షించినట్టు ఉంటుంది. అద్బుతమైన థ్రిల్లింగ్ ఉంటుందనే ఆశించిన ప్రేక్షకులకు తొలిభాగం నిరాశనే కలిగిస్తుంది. తొలిభాగంలో గొప్పగా చెప్పుకొనే సన్నివేశాలు కానీ, కథ గానీ లేకపోవడం పెద్ద మైనస్.

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్

    ప్రధానంగా కథలో కొత్తగా మలుపు లేకపోవడంతో సెకండాఫ్‌ కూడా చాలా ఫ్లాట్‌గా సాగిపోతుంది. సెంటిమెంట్ కోసం విసామ్ తల్లి ఎపిసోడ్‌ కూడా పెద్దగా పండలేకపోయింది. క్లైమాక్స్‌కు ముందు అస్మిత మర్డర్ నుంచి కథ కాస్త ఆసక్తిని రేపుతుంది. కానీ క్లైమాక్స్ కూడా గొప్పగా అనిపించదు. ఓమర్, సలీంను అంతం చేయడంతో కథకు ముగింపు కార్డు పడుతుంది. విశ్వరూపం1ను పోల్చితే ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు.

    డైరెక్టర్‌గా కమల్ హాసన్ పనితీరు

    డైరెక్టర్‌గా కమల్ హాసన్ పనితీరు

    కమల్ హాసన్ దర్శకుడిగా కథను ఆసక్తిగా ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. తొలిభాగంలో సుదీర్ఘంగా సాగే సీన్లు కథ గమనానికి అడ్డం పడ్డాయనే చెప్పవచ్చు. కాకపోతే కొన్ని సీన్లలో టేకింగ్ అదిరిపోయింది. విమాన దాడుల చిత్రీకరణ, సముద్రం లోపల యాక్షన్ సీన్లు కొంత ఆసక్తిగా చిత్రీకరించాడు.

    కమల్ హాసన్ నటన

    కమల్ హాసన్ నటన

    విసామ్‌గా కమల్ నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశాడు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించాడు. పేలవమైన సీన్ల కారణంగా కమల్ నటన బయటకు కనిపించలేకపోయింది. తల్లి, భార్య, తన సహచర ఉద్యోగి మధ్య ఉన్న బంధాల మధ్య ఎమోషన్‌ను పండించడానికి ప్రయత్నం చేశాడు.

    అండ్రియా, పూజాకుమార్ యాక్టింగ్

    అండ్రియా, పూజాకుమార్ యాక్టింగ్

    విసామ్ భార్య నిరుపమగా పూజా కుమార్ నటించారు. సముద్రంలో చోటుచేసుకొనే ఆటుపోట్లపై అధ్యయనం చేసే పరిశోధకురాలిగా కనిపించారు. ఒకట్రెండు సీన్లలో మాత్రమే ఆకట్టుకునే విధంగా ఆమె నటన ఉంది. విసామ్ సహచర ఉద్యోగిగా ఆండ్రియా నటించింది. దేశం కోసం అమరులయ్యే పాత్రలో కనిపించింది. పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ఓమర్ పాత్రలో రాహుల్ బోస్, ఆయన నమ్మిన బంటుగా సలీం మిలటరీ అధికారిగా జైదీప్ అహ్లావత్ నటించారు. కథలో దమ్ము లేకపోవడంతో ఈ చిత్రంలో వీరి నటన ఆకట్టుకోలేకపోయింది. సైనిక ఉన్నతాధికారి, విసామ్ గురువుగా శేఖర్ కపూర్ నటించాడు. శేఖర్ కపూర్ పాత్రలో వైవిధ్యం లేకపోవడంతో అలరించలేకపోయారు.

    జిబ్రాన్ సంగీతం

    జిబ్రాన్ సంగీతం

    విశ్వరూపం2 సినిమాకు అతిపెద్ద మైనస్ జిబ్రాన్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ చాలా వీక్. కథలో స్కోప్ లేకపోవడం వల్ల వినసొంపైన పాటలు కూడా అందించలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది.

    సినిమాటోగ్రఫి

    సినిమాటోగ్రఫి

    యాక్షన్ సీన్లను రెగ్యులర్ ఫార్మాట్‌లోనే చిత్రీకరించడంతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించదు. సముద్ర గర్భంలో తీసిన సీన్లు కొత్తగా ఉన్నాయి. కొన్ని సీన్లలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా నాసిరకంగా కనిపిస్తాయి. అద్భుతమైన స్పై థ్రిల్లర్ చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించేంతగా కెమెరా వర్క్ కనిపించలేకపోయింది.

    ఎడిటింగ్, ఇతర విభాగాలు

    ఎడిటింగ్, ఇతర విభాగాలు

    ఎడిటింగ్ వర్క్ కూడా నిరాశజనకంగానే కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, సబ్ ప్లాట్స్ గందరగోళంగా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో సీన్లలో నిడివిని తగ్గిస్తే కాస్త మూవీ షార్ప్‌గా ఉండేదేమో. ఎడిటింగ్ విషయంలో మరికాస్తా జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తుంది.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    భారీ యాక్షన్ సీన్లు, హెలికాప్టర్ల వినియోగం కోసం భారీగా ఖర్చు చేశారు. సినిమాను రిచ్‌గా చూపించేందుకు లోకేషన్లను ఎంపిక చేసుకొన్న తీరు సినిమా మేకింగ్‌పై రాజ్ కమల్ బ్యానర్‌కు ఉన్న అభిరుచి తెలుస్తుంది. సాంకేతిక అంశాలపై కాకుండా కథ, కథనాలపై కాస్త దృష్టిపెట్టి ఉంటే విశ్వరూపం లాంటి రిజల్ట్ రావడానికి కాస్త అవకాశం ఉండేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    అద్భుతమైన విజువల్స్, స్క్రీన్ ప్లే, కమల్ నటనతో విశ్వరూపం చిత్రం ఓ మ్యాజిక్ క్రియేట్ చేసింది. కానీ విశ్వరూపం2 అలాంటి ప్రత్యేకలు ఏమీ కనిపించవు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    కమల్ హాసన్.. కమల్ హాసన్.. కమల్ హాసన్
    సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయంట్స్
    కథ, కథనం
    మ్యూజిక్
    పసలేని రొటీన్ సీన్లు

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: కమల్ హాసన్, రాహుల్ బోస్, శేఖర్ కపూర్, పూజా కుమార్, అండ్రియా జెర్మియా
    దర్శకత్వం: కమల్ హాసన్
    నిర్మాత: చంద్ర హాసన్, కమల్ హాసన్
    కొరియోగ్రఫీ: కమల్ హాసన్, బిర్జూ మహారాజ్
    మ్యూజిక్: జిబ్రాన్ మహ్మద్
    సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుదీన్, శాను జాన్, వర్గీస్
    ఎడిటింగ్: మహేష్ నారాయణ్, విజయ్ శంకర్
    బ్యానర్: రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌
    రిలీజ్ డేట్: 2018-08-10

    English summary
    Vishwaroopam II is an upcoming Indian bilingual spy thriller film simultaneously made in Tamil and Hindi and dubbed in Telugu. Written and directed by Kamal Haasan, it is a circumquel (happens partly before and after the former film's end) to Vishwaroopam (2013) and features himself alongside Rahul Bose, Pooja Kumar and Andrea Jeremiah, reprising their roles. While the first film was set in the United States, Vishwaroopam II is set to take place in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X