Viswam Movie Review: విశ్వం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: గోపిచంద్, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, వీటీ గణేష్, అనీషా అంబ్రోస్ తదితరులు
దర్వకత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: దోనెపూడి చక్రపాణి
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోణెపూడి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
సినిమాటోగ్రఫి: కేవీ గుహన్
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్స్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్: రవివర్మ, దినేష్, సుబ్బరాయన్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-10-11

విశ్వం (గోపిచంద్)కు తండ్రి అంటే పంచ ప్రాణం. తన తండ్రిపై పడిన మచ్చను రూపుమాపేందుకు ఇటలీ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. సినిమా హీరో, హీరోయిన్లకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసే సమీరా (కావ్య థాపర్)తో ప్రేమలో పడుతాడు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు చెందిన ఐసీసీ గ్రూప్‌కు చెందిన ఖురేషి (జిషుసేన్ గుప్తా) హిందువు ముసుగులో భారత్‌లో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తాడు. ఇండస్ట్రీలియస్ట్ బాచిరాజు (సునీల్)తో చేతులు కలిపి పేలుళ్లు ప్లాన్ చేస్తాడు. హైదరాబాద్‌లో అమలు చేయాలనుకొన్న ఈ ప్లాన్‌ తన సోదరుడు, మినిస్టర్ (సుమన్)కు తెలియడంతో ఖురేషితో కలిసి బాచిరాజు హత్య చేస్తాడు. ఆ విషయాన్ని దర్శని అనే పాప చూస్తుంది. దాంతో పాపను చంపేందుకు ఖురేషి ప్లాన్ చేస్తే.. అనుకోకుండా విశ్వం అడ్డుకొంటాడు. ఓ దశలో దర్శనను ఖురేషి మనుషులు కాల్చివేస్తారు.

Viswam Movie Review in Telugu  Sreenu Vaitla  Gopichand s mark movie

కేంద్ర మంత్రి అయిన తన సోదరుడిని ఖురేషితో బాచిరాజు ఎందుకు చంపాడు? దర్శనను ఏ పరిస్థితుల్లో విశ్వం అడ్డుకొన్నాడు? అసలు విశ్వం హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడు? ఖురేషి ప్లాన్‌ను ఎలా ఎదురించాడు? బాచిరాజు ప్లాన్ వర్కువుట్ అయిందా? అసలు విశ్వం ఎవరు? విశ్వం ఎలాంటి మిషన్‌తో హైదరాబాద్ వచ్చాడు? తన మిషన్‌ను విశ్వం ఎలా పూర్తి చేశాడు? సమీరాతో లవ్ ట్రాక్ ఎలా సాగింది? దర్శనను రక్షించాడా? ఖురేషి దుర్మార్గాలకు ఎలా అంతం పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వం సినిమా కథ.

దర్శకుడు శ్రీనువైట్ల అంటే కామెడీతో ఎమోషనల్ కథను చెప్పే డైరెక్టర్‌గా పలు సక్సెస్ అందుకొన్నారు. కామెడీ, టైమింగ్, కమెడియన్లు వాడుకోవడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. అలాంటి డైరెక్టర్ తన మార్కును వదులుకోకుండా ప్రస్తుతం విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఉగ్రవాదం పాయింట్‌కు చైల్డ్ సెంటిమెంట్ జోడించి అదే కామెడీతో రాసుకొన్న కథ బాగుంది. ఫస్టాఫ్‌లో జాలి రెడ్డి (పృథ్వీ), మ్యాంగో శ్యామ్ (నరేష్) కామెడీ ట్రాక్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. లవ్ ట్రాక్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో రెగ్యులర్‌గా సినిమా సాగిపోయిందనిపిస్తుంది.

సెకండాఫ్ విషయానికి వస్తే.. పూర్తిగా ఫ్లేవర్, ఎన్విరాన్‌మెంట్‌ను పూర్తిగా మార్చేశాడు. టీటీఈ (వీటీ గణేష్), వెన్నెల కిషోర్ మరో కామెడీ ట్రాక్‌తో ఫుల్లుగా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కథను వదిలేశాడా? రెగ్యులర్ కథనే నమ్ముకొని ప్రయోగం చేశాడా? అనే సందేహం కలుగుతుంది. ఎప్పటిలానే యాక్షన్, కామెడీ, లవ్ ట్రాక్, ఎమోషన్స్ దట్టించే తనకు బలంగా మారిన కథనే మళ్లీ చెప్పాడనిస్తుంది. అయితే ఇది పూర్తిగా కామెడీ ఫ్లేవర్‌తో చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనే ఫిలింగ్‌ను కల్పించాడనిపిస్తుంది.

ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గోపిచంద్ చేసిన విశ్వం క్యారెక్టర్‌కు ఆయనకు కొత్తేమీ కాదు. ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయి.. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్‌ను తనదైన శైలిలో పండించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కొత్తగా కనిపించాడు. కావ్య థాపర్ గ్లామర్‌ మాత్రమే కాకుండా ఫన్‌ ఎలిమెంట్స్‌తో ఉన్న పాత్రలో మెరిసింది. గోపిచంద్‌తో కలిసి కెమిస్ట్రీని పండించింది. కిక్ శ్యామ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తాడు.

Viswam Movie Review in Telugu  Sreenu Vaitla  Gopichand s mark movie

ఇక ఈ సినిమా ఫుల్లుగా కామెడీకి పెద్ద పీట వేయడంతో ప్రతీ సీన్‌లో బోలెడంత మంది కమెడియన్లు కనిపిస్తారు. పృథ్వీ, వీకే నరేష్, వెన్నెల కిషోర్, వీటీ గణేష్ ముఖ్యంగా హాస్యాన్ని పండించే బాధ్యతను మోశారు. ట్రైన్ ఎపిసోడ్‌లోను, అలాగే హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కామెడీ వర్కవుట్ అయిందనే చెప్పాలి. ముఖేష్ రుషి, సునీల్, జిషు సేన్ గుప్తా తమ పాత్రలకు న్యాయం చేశారు. రాహుల్ రామకృష్ణ డిఫరెంట్‌గా ఫన్ క్రియేట్ చేశారు.మిగితా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

ఈ సినిమాకు గుహన్ అందించిన సినిమాటోగ్రఫి బలంగా నిలిచింది. ఇటలీ, ఓ ద్వీపంలో షూట్ చేసిన విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు మాస్ బీట్‌తో సాగాయి. గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ రాసిన మాటలు, కామెడీ సన్నివేశాలు బాగా పేలాయి. అమర్ రెడ్డి ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఇంకా కొన్ని కట్స్ పడాల్సిందనిపిస్తుంది. కొన్ని సీన్లు లెంగ్తీగా అనిపించాయి. రవివర్మ, దినేష్, సుబ్బరాయన్ కంపోజ్ చేసిన ఫైట్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. పీపుల్ మీడియా బ్యానర్ స్టాండర్డ్స్‌కు తగినట్టుగా మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సినిమాలోని సన్నివేశాలు చాలా రిచ్‌గా క్వాలిటీగా ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ అభిరుచికి తగినట్టుగా మూవీ ఉందని చెప్పవచ్చు.

Viswam Movie Review in Telugu  Sreenu Vaitla  Gopichand s mark movie

విశ్వం సినిమా విషయానికి వస్తే.. శ్రీను వైట్ల తాను అనుసరించే సక్సెస్‌పుల్ ఫార్మాలాతో ఎలాంటి రిస్క్ లేకుండా చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. తనకు స్ట్రెంగ్త్‌గా నిలిచిన కామెడీ, యాక్షన్ నమ్ముకొని చేసిన ఈ సినిమాలో కొత్తదనం వెతికినా కనిపించదు. తెలుగు ప్రేక్షకులు ఆశించే కామెడీని మాత్రం కొత్తగా చూపించే ప్రయత్నం ఆకట్టుకొంటుంది. పండుగ సమయంలో సరదాగా రెండు గంటలపాటు నవ్వుకొని వద్దామని అనుకొనే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. డిఫరెంట్ సినిమాను చూద్దామని అనుకొనే వాళ్లకి నిరాశే. ఫన్, కామెడీ అంశాలు వర్కవుట్ అయితే మంచి విజయం అందుకొనే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: gopichand kavya thapar viswam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X