Viswam Twitter Review: విశ్వం ట్విట్టర్ రివ్యూ.. శ్రీను వైట్ల,గోపిచంద్ హిట్టు కొట్టారా?
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు.
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

విశ్వం మూవీ చూశాను. ట్రైన్ ఎపిసోడ్ వర్కవుట్ అయింది. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. వెన్నెల కిషోర్ మరోసారి ఎక్సలెంట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీటీ గణేష్ కామెడీ కూడా డీసెంట్‌గా ఉంది. టిపికల్ శ్రీను వైట్ల స్టోరీలా ఉంది. కామెడీ ప్రధానంగా కథ సాగింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
విశ్వం మూవీ డీసెంట్ ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్ గుడ్. పాత సినిమాల మాదిరిగా రెగ్యులర్ ఫార్మూలా సినిమా. ఇలాంటి ఫార్మాట్ తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా తెలుసు. అదే ఫార్మూలాను మరోసారి కొత్తగా శ్రీనువైట్ల చూపించాడు. చాలాసన్నివేశాలను కామెడీతో నడిపించాడు. ఫస్టాఫ్‌లో కామెడీ సీన్లు బాగా పేలాయి. సెకండాఫ్‌లో కథ సీరియస్ నోట్‌లో ఉంటుంది. క్లైమాక్స్ నిడివి ఎక్కువగా ఉంది. శ్రీనువైట్ల కామెడీ సీన్ల బాగా తీశారు. డైలాగ్స్ బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
విశ్వం సినిమా ఫస్టాఫ్ బాగుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేశారు. ఇంటర్వెల్ సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. గోపిచంద్, ఇతర యాక్లర్లు బాగా చేశారు. ఈ సినిమాకు 30 years ఫృథ్వీ హైలెట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
విశ్వం సినిమాలో హీరో, హీరోయిన్ల ట్రాక్ బాగుంది. ఇటలీ సాగే ఎపిసోడ్ ఫన్‌తో సాగింది. కామెడీ వర్కవుట్ అయింది. టిపికల్ వైట్ల టైమింగ్‌తో సాగింది. విజువల్స్ చాలా బాగున్నాయి అని ఓ నెటిజన్ అన్నాడు.
విశ్వం గ్రేట్ మూవీ. గుడ్ కామెడీ. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. మస్ట్ వాచ్ సినిమా. ఫ్యామిలీ, కిడ్స్ బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. విశ్వం సినిమాలో కామెడీ బాగుంది. చివరి 30 నిమిషాలు ఇంకా బాగా హ్యాండిల్ చేయాల్సింది అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
దర్శకుడు శ్రీనువైట్ల గారితో వర్క్ చేయడం ఎక్సైటింగ్ అనిపించింది. 24 అవర్స్ ఆయన సినిమా తప్పితే వేరేది ఆలోచించరు. ఆయనకి సహజంగా కోపం రాదు. ఒక ఆర్టిస్ట్ కి కంఫర్ట్ జోన్ ఇచ్చి కావాల్సిన పర్ఫార్మెన్స్ ని రాబట్టుకోవడంలో ఆయన మాస్టర్. ఆఫ్టర్ లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి అని గోపిచంద్ తెలిపారు.
కొన్నేళ్ల క్రితం గోపిచంద్ తండ్రి టీ కృష్ణ దర్శకత్వం వహించిన ప్రతిఘటన చిత్రం అక్టోబర్ 11వ తేదీనే రిలీజైంది. తెలుగు సినిమా రంగంలో సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. అదే తేదీన విశ్వం సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఆయన తండ్రి గారి ఆశీస్సులతో ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది అని ఓ నెటిజన్ పోస్టు చేశారు.
డార్లింగ్ ప్రభాస్‌కు క్లోజ్ ప్రెండ్ గోపిచంద్ నటించిన విశ్వం సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మా శుభాకాంక్షలు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని అభిమానులం కోరుకొంటున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరికీ గుడ్ లక్. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికి మంచి విజయం సాధించాలి అని ప్రబాస్ ఫ్యాన్స్ కోరుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











