twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ ‘విశ్వాసం’ తెలుగు రివ్యూ, రేటింగ్

    |

    Recommended Video

    Viswasam Movie Telugu Review And Rating | Filmibeat Telugu

    Rating:
    2.5/5

    అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'విశ్వాసం' చిత్రం పొంగల్ సందర్భంగా కోలీవుడ్లో రిలీజై ఘన విజయం సాధించింది. వాస్తవానికి తెలుగులో కూడా అప్పుడే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆ సమయంలో తెలుగునాట థియేటర్ల కొరత వల్ల విడుదల కాలేక పోయింది. అజిత్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'విశ్వాసం' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ముందు అజిత్‌తో వీరం, వేదాలం, వివేగం చిత్రాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

    కథ

    కథ

    తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన వీర్రాజు చెప్పిందే చుట్టు పక్కల గ్రామాలకు ప్రజలకు వేదం. తమ వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే వీర్రాజు అంటే అందరికీ భయం, భక్తి. పదేళ్లకోసారి గ్రామంలో జరిగే జాతరకు బయటి ఊర్లకు పని కోసం, చదువు కోసం వెళ్లిన వారంతా తిరిగి రావడంతో అంతా సంతోషంగా గడుపుతుంటారు. అయితే వీర్రాజు మొహంలో ఎప్పుడూ నవ్వు ఉంటుంది కానీ ఆ నవ్వు వెనక సంతోషం మాత్రం ఉండదు. అందుకు కారణం తన భార్య నిరంజన(నయనతార), కూతురు (శ్వేత) పదేళ్లుగా తనకు దూరంగా ఉండటమే.

    కథలో ట్విస్ట్

    కథలో ట్విస్ట్

    పెద్దలు, కుటుంబ సభ్యులు కోరిక మేరకు భార్యను, కూతురును జాతరకు తీసుకురావడానికి వీర్రాజు ముంబై వెళతాడు. అయితే అతడి మొహం కూడా చూడటానికి ఇష్టపడదు నిరంజన. వీర్రాజు నిరాశతో తిరిగి ఇంటికి వెళుతుండగా ఊహించని సంఘటన. తన కూతురును కొందరు వ్యక్తులు వెంటపడి చంపడానికి ప్రయత్నిస్తారు. విషయం తెలుసుకుని వీర్రాజు రంగంలోకి దిగుతాడు. కానీ తానే నీ తండ్రిని అని బిడ్డకు చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కుమిలిపోతాడు. ఇంతకీ వీర్రాజు-నిరంజన దూరం కావడానికి కారణం ఏమిటి? వీరి కూతురుని చంపాలనుకున్న వ్యక్తి ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    వీర్రాజు పాత్రలో అజిత్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము దులిపాడు. ఎమోషనల్ సీన్లలో భావోద్వేగాలు పండించిన తీరు అభిమానులను కట్టిపడేసింది. నయనతార అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్బ్ అనిపించింది. కూతురు పాత్రలో బేబీ అంకిత క్యూట్‌గా నటించింది. జగపతి బాబు పాత్ర అంత పవర్ ఫుల్‌గా డిజైన్ చేయక పోయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు నటించాడు.

    కథలో కొత్తదనం లేదు కానీ..

    కథలో కొత్తదనం లేదు కానీ..

    ‘విశ్వాసం' కథ విషయంలో కొత్తదనం ఏమీ లేదు. తెలుగు, తమిళంలో రోటీన్‌గా వచ్చే పల్లెటూరి నేపథ్యం, అక్కడ ఉండే గొడవలు లాంటి అంశాలతో స్క్రిప్టు తయారు చేశారు. దర్శకుడు ప్రేక్షకులకు కథ విషయంలో కొత్తదనం చూపించడం కన్నా... తాను ఎంచుకున్న రోటీన్ కథకే మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ యాడ్ చేసి సగటు ప్రేక్షకుడి హృదయాన్ని టచ్ చేసే భావోద్వేగాలను జోడించి ఎంటర్టెన్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు.

    టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాల పరంగా...

    వెట్రీ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. పల్లెటూరి పచ్చదాన్ని సూపర్భ్‌గా తన కెమెరాలో ఫోకస్ చేశాడు. డి ఇమ్మాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్లను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది. రుబెన్ ఎడిటింగ్ ఫర్వాలేదు. దర్శకుడి శివ అందించిన స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఇతర టెక్నికల్ విభాగాల పనీ తీరు ఫర్వాలేదు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    అజిత్ పెర్ఫార్మెన్స్
    నయనతార
    ఎమోషనల్ సీన్స్
    ఫ్యామిలీ ఎలిమెంట్స్

    మైనస్ పాయింట్స్

    కొత్తదనంలేని కథ
    రోటీన్‌గా సాగే కథనం

    ఫస్టాఫ్ ఎలా ఉంది

    ఫస్టాఫ్ ఎలా ఉంది

    సినిమా ఫస్టాఫ్ మొత్తం రావులపాలెం అనే పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ జోడించి విలేజ్ బ్యాక్ డ్రాపులో సినిమాను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. మాస్, యాక్షన్ సీన్లు అభిమానులను ఆకట్టుకుంటాయి.

    సెకండాఫ్

    సెకండాఫ్

    సెకండాఫ్ అంతా కూడా ముంబై నేపథ్యంలో కథను నడిపించారు. సెకండాఫ్‌లో మరింత ఉత్కంఠగా సాగాల్సిన కథనం నెమ్మదించినట్లు కనిపిస్తుంది. దీనికి తోడు ఆసక్తికర అంశాలు లేక పోవడం, ఏం జరుగబోతోందో ప్రేక్షకుడు ముందే ఊహించే విధంగా ఉండటం నిరాశ పరుస్తుంది. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకులను భావేద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి.

    తల్లిదండ్రులకు సందేశం

    తల్లిదండ్రులకు సందేశం

    చిన్న పిల్లలపై మన ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు రుద్దకుండా వారిని ఒత్తిడికి గురిచేయకుండా చిన్న పిల్లలను చిన్న పిల్లలుగానే పెరగనివ్వాలని.. ఈ తరం తల్లిదండ్రులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

    చివరగా...

    చివరగా...

    మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అజిత్ అభిమానులకు నచ్చుతాయి. మాస్ ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవుతారు. కథలో కొత్తదనం కోరుకునే మల్టీ ప్లెక్స్, క్లాస్ ఆడియన్స్‌కు సినిమాకు ఏమేరకు కనెక్ట్ అవుతుంది అనే దానిపై తెలుగునాట ‘విశ్వాసం' విజయం ఆధారపడి ఉంటుంది.

    విశ్వాసం

    విశ్వాసం

    అజిత్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, అనైక‌, వివేక్, రోబో శంక‌ర్‌, యోగిబాబు త‌దిత‌రులు న‌టించారు.
    ఎడిట‌ర్‌: రూబెన్‌
    సంగీతం: డి.ఇమాన్‌
    సినిమాటోగ్ర‌ఫీ: వెట్రి
    తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత‌: ఆర్.నాగేశ్వ‌ర‌రావు
    ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ
    తెలుగు రిలీజ్ తేదీ: మార్చి 1, 2019

    English summary
    Viswasam Movie Telugu Review and Rating. With its mass appeal and strong emotional connect, Viswasam makes for a good watch. The Thala army is bound to love it. Viswasam is a captivating film and it has plenty to offer the viewers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X