twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్‌కి అదుర్స్..... కామన్ ఆడియన్స్ బెదుర్స్ (‘వివేకం’ మూవీ రివ్యూ)

    తమిళ స్టార్ అజిత్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘వివేకం' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనకు గతంలో వేదాళం, వీరమ్ లాంటి హిట్ సినిమాలు అందించిన సిరుతై శివ దర్శకత్వంలో ఈ సారి భారీ యాక్షన్ .

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    Star Cast: అజిత్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్
    Director: శివ

    తమిళ స్టార్ అజిత్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత 'వివేకం' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనకు గతంలో వేదాళం, వీరమ్ లాంటి హిట్ సినిమాలు అందించిన సిరుతై శివ దర్శకత్వంలో ఈ సారి భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్‌తో బాక్సాఫీసు బరిలో దూకాడు,

    గతంలో అజిత్ హీరోగా పలు సూపర్ హిట్ యాక్షన్ మూవీస్ వచ్చాయి. ఈ సారి అంతకు మించిన సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో లోకల్ స్టోరీస్ కాకుండా, ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్‌తో సాగే కథాంశాన్ని ఎంచుకున్నాడు. మరి అజిత్ నిటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టెనర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

    ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ

    ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ

    అజయ్ కుమార్(అజిత్) ఇంటర్నేషనల్ స్పై ఏంజెంట్. ఎలాంటి ప్రమాదకరమైన టాస్క్ అయినా విజయవంతంగా పూర్తి చేయగల వీరుడు. అదే ఏజెన్సీలో పని చేసే ఆర్యన్(వివేక్ ఒబెరాయ్) మరికొందరు అజయ్‍‌కి ప్రాణ స్నేహితులు. అంతా కలిసి ప్రపంచానికి ముప్పుగా మారిన క్రిమినల్స్‌ను అంతమొందిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేసిన ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ అత్యంత ప్రమాదకరమైన ఫ్లూటోనియం వెపన్స్ దొంగిలిస్తుంది. వాటి ద్వారా కృత్రిమంగా భూకంపాలు సృష్టించి ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనేది వారి ప్లాన్.

    Recommended Video

    Ajith Latest Movie "Vivekam" Public Review
    నమ్మకద్రోహం, రివేంజ్

    నమ్మకద్రోహం, రివేంజ్

    ఆ క్రిమినల్స్ ఆటకట్టించేందుకు అజయ్ రంగంలోకి దిగి వాటిని పేల్చడానికి ఉపయోగించే సీక్రెట్ కోడ్ ఉన్న డివైజ్ స్వాధీనం చేసుకుంటారు. ఇంతలోనే అజయ్‍‌కి ఊహించని షాక్ ఎదురవుతుంది. తను ప్రాణ స్నేహితులుగా నమ్మిన ఆర్యన్, మరో ఇద్దరు స్నేహితులు క్రమినల్ గ్యాంగ్‌తో చేతులు కలిపి తనను వెన్నుపోటు పొడిచి తన వద్ద నుండి ఆ కోడ్ ఉన్న డివైజ్ ఎత్తుకెళతారు. తనను ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా చిత్రీకరిస్తాడు. ఇండియాలో బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు. మరి అజయ్ వారి ఆట ఎలా కట్టించాడు, వారిపై తన రివేంజ్ స్టోరీ ఎలా సాగింది అనేది తర్వాతి కథ.

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    అజిత్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. లుక్ పరంగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. అజిత్ భార్య పాత్రలో కాజల్ పరిమితమైన పాత్రలో కనిపించింది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. విలన్ పాత్రలో వివేక్ ఓబెరాయ్ బాగా సూటయ్యాడు. ఓ చిన్న పాత్రలో అక్షర హాసన్, ఆరవ్ చౌదరి, కరుణాకరన్ తదితరులు వారి వారి పాత్రల మేరకు ఓకే అనిపించారు.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    వెట్రి సినిమాటోగ్రఫీ బావుంది. అనిరుధ్ అందించిన సంగీతం గొప్పగా ఏమీ లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. డైలాగ్స్ బావున్నాయి.

    అదే మిస్సయింది

    అదే మిస్సయింది

    అజిత్ లాంటి పెద్ద హీరో, అందుకు తగిన విధంగా భారీ సెటప్, హాలీవుడ్ స్థాయిలో సినిమాను ప్రజెంట్ చేయగల టెక్నీషియన్స్, అదిరిపోయే యాక్షన్ సన్నిశాలు ఇలా దర్శకుడు అన్నీ భారీగానే సెట్ చేసుకున్నాడు కానీ..... అత్యంత ముఖ్యమైన కథ, కథనాన్ని సరిగా సెట్ చేసుకోలేక పోయాడు. రొటీన్ యాక్షన్, రివేంజ్ డ్రామాలా సినిమా నడిపించాడు.

    శృతిమించిన యాక్షన్

    శృతిమించిన యాక్షన్

    సినిమా మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా ప్రతి సీన్లోనూ యాక్షన్, తుపాకుల మోతతో థియేటర్ దద్దరిల్లిపోయింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు సైతం భరించలేనంత యాక్షన్ ఓవర్ డోస్ ఉండటం పెద్ద మైనస్.

    భావోద్వేగాలను కమ్మేసింది

    భావోద్వేగాలను కమ్మేసింది

    సినిమాలో యాక్షన్ పార్టు ఎక్కువగా ఉండటంతో ఇతర భావోద్వేగాలను కమ్మేసింది. అజిత్, కాజల్ మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంత ఎఫెక్టివ్‌గా చూపించలేక పోయారు. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఏమీ లేవు. ఇది ప్రేక్షకులను నిరాశ పరిచే అంశమే.

    ఆకట్టుకోని స్క్రీన్ ప్లే

    ఆకట్టుకోని స్క్రీన్ ప్లే

    హాలీవుడ్ స్థాయి స్పై థ్రిల్లర్ అని ఫిక్స్ అయిన దర్శకుడు హాలీవుడ్ స్థాయిలో అత్యాధునిక సెటప్, గన్స్ సమకూర్చుకోవడంలో ఫోకస్ పెట్టాడు కానీ....... అందుకు తగిన విధంగా రసవత్తరంగా స్క్రీన్ ప్లే రన్ చేయలేక పోయాడు.

    క్రియేటివిటీ లేదు

    క్రియేటివిటీ లేదు

    ఈ మధ్యకాలంలో హాలీవుడ్లో వచ్చిన యాక్షన్ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు దర్శకుడు శివ బాగా ఫాలోయినట్లు ఈ సినిమా చూస్తే స్పష్టం అవుతోంది. ఎక్కడా కూడా శివ క్రియేటివిటీ మచ్చుకైనా కనిపించలేదు.

    ఫైనల్ కామెంట్

    ఫైనల్ కామెంట్

    అజిత్ వీరాభిమానులకు వివేకం చిత్రం అదుర్స్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ మితిమీరిన యాక్షన్‌‌కు సగటు తెలుగు ప్రేక్షకుడు ఏ మేరకు భరించగలడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బీ, సీ సెంటర్లలో లభించే ఆదరణను బట్టే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

    English summary
    Vivekam, the much anticipated film of the year, has made a big release today (August 23, 2017). Thala Ajith, as Ajith Kumar is fondly called, is back in action after a gap of close to 20 months and Vivekam is expected to set the cash registers ringing at the box office, in the coming days. Directed by Siva, Vivegam is tagged as a film of international standards. Has the film lived up to the big expetations bestowed on it? Keep reading Vivegam review to know more about this..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X