Unstoppable Review మెప్పించలేకపోయిన జబర్దస్త్ కామెడీ.. వీజే సన్నీ, సప్తగిరి ఎలా చేశారంటే?
Rating: 1.5/5
నటీనటులు: వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్, పోసాని కృష్ణ మురళీ, శివాజీ రాజా, షకలక శంకర్, బిత్తిరి సత్తి, ఆనంద చక్రపాణి తదితరులు
నిర్మాత: రజిత్ రావు
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
సినిమాటోగ్రఫి: వేణు మురళీధర్ వీ
ఎడిటర్: సీబీ ఉద్దవ్
కొరియోగ్రఫి: భాను
సాహిత్యం: కాసర్ల శ్యామ్
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
బ్యానర్: ఎ2 బి ఇండియా
రిలీజ్ డేట్: 2023-06-09
కోహినూర్ కల్యాణ్ (వీజే సన్నీ), జిలానీ రాందాస్ (సప్తగిరి) మంచి దోస్తులు. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలు చెబుతుంటారు. కాలక్షేపం కోసం అప్పులు చేసి ఐపీఎల్ బెట్టింగ్‌లు ఆడి 10 లక్షల రూపాయలు పొగొట్టుకొంటారు. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు స్నేహితుడు దుబాయ్‌లో ఉండే హానీ భాయ్ (షకలక శంకర్) నుంచి 20 లక్షలు ఇవ్వమని కోరుతారు. దాంతో తన స్నేహితులను ఆదుకొనేందుకు 20 లక్షలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే జ్ఞానవేల్ రాజా అకౌంట్‌లో పడుతాయి.

ఐపీఎల్ బెట్టింగుల కోసం జిలానీ, కల్యాణ్ ఎవరి వద్ద నుంచి 10 లక్షలు అప్పు తీసుకొన్నారు? అప్పు తీర్చడానికి హానీ భాయ్ ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు జ్ఞానవేల్ రాజా అకౌంట్లో పడిన తర్వాత ఏం జరిగింది? కల్యాణ్, జిలానీ, స్వాతి (నక్షత్ర)ను తిలకం గ్యాంగ్ ఎందుకు బంధించారు?
టైం టేబుల్ తులసి (అక్సా ఖాన్)ను తిలకం (రాజా రవీంద్ర) మనుషులు ఎందుకు కిడ్నాప్ చేశారు. జ్ఞానవేల్ రాజా అసలు ఎవరు? జ్ఞానవేల్ రాజా నుంచి 20 లక్షల రూపాయాలు తీసుకొన్నారా? జ్ఞానవేల్ రాజాతో కల్యాణ్ బ్యాచ్ ఆడిన నాటకం ఏంటి? ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే అన్‌స్టాపబుల్ సినిమా కథ.
యాక్సిడెంటల్‌గా ఒక అకౌంట్‌లోకి పడాల్సిన డబ్బులు.. మరో అకౌంట్‌కు చేరడం అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను కథగా అల్లుకొన్న తీరు, కథకు ట్రీట్‌మెంట్ చాలా నాసిరకంగా ఉండటంతో సరైన రీతిలో హాస్యం పండలేకపోయిందనిపిస్తుంది.

ఇక హాస్యానికి కావాల్సిన సరుకు సన్నివేశాల్లో లేకపోవడం మరో మైనస్‌గా చెప్పుకోవచ్చు. కథలో థర్డ్ క్లాస్ కామెడీ పెద్దగా ఆకట్టుకొలేకపోయింది. దాంతో ఈ సినిమా పేలవంగా తెర మీద కనిపించింది. సినిమాకు ముందు ఏర్పడిన అంచనాలను అందుకోవడంలోను, ప్రేక్షకులను సంతృప్తి పరచడంలోను నిరాశకు గురిచేసింది.
వీజే సన్నీ, సప్తగిరి కాంబినేషన్‌లో హిలేరియస్ కామెడీకి స్కోప్ అవకాశం ఉన్నప్పటికీ.. ఆ దిశగా కసరత్తు జరుగలేదనే విషయం సినిమా ఆరంభంలోనే కలిగింది. నాసిరకంగా, పేలవంగా ఉండే సీన్లు పెద్దగా ప్రేక్షకుడిని కనెక్ట్ చేయలేకపోయాయి. దాంతో రెగ్యులర్ కామెడీతో కథ సాగనున్నదనే విషయం త్వరలోనే ప్రేక్షకుడు ఫిక్స్ అయ్యేలా సన్నివేశాలు స్పష్టం చేశాయి. జ్ఞానవేల్ రాజా ఎపిసోడ్‌లో పోసానిని కనెక్ట్ చేసి తీరుతో అడల్డ్ కామెడీ డోస్ ఎక్కువైందనిపిస్తుంది.
వీజే సన్నీ లవ్ ట్రాక్‌లో మంచి ఫీల్ ఉండటానికి స్కోప్ ఉంది. కానీ ఒక్క సీన్‌తో ముగించేయడం సరికాదనిపిస్తుంది. కథ, కథనంలో కొత్తదనం ఎక్కడ కనిపించకపోవడం ఫ్రెష్ కామెడీ లేకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.
కోహినూర్ కల్యాణ్ పాత్రను వీజే సన్నీ నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం బాగుంది. పాత్ర ద్వారా రాణించడానికి విషయం లేకపోవడంతో వీజే సన్నీ ఏం చేయలేకపోయారనిపిస్తుంది. కానీ మంచి పాత్ర, కథ పడితే ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉన్న నటుడిని అని వీజే సన్నీ నిరూపించుకొన్నారు. ఇక సప్తగిరి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గుడ్ రోల్, ఆ రోల్‌కు తగిన సీన్లు పడితే చెలరేగిపోవడం ఆయన కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమాలో ఆ స్కోప్ లేకపోవడంతో ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఆక్సా ఖాన్ పెర్ఫార్మెన్స్‌తోపాటు యాక్షన్ సీన్లలో అదరగొట్టింది.

అన్‌స్టాపబుల్ సినిమాలో నటించిన మిగితా నటీనటుల్లో పోసాని, రాజా రవీంద్ర, షకలక శంకర్, బిత్తిరి సత్తి, మురళీ గౌడ్, తమదైన శైలిలో రాణించారు. విలన్ పాత్ర ఎఫెక్టివ్‌గా లేకపోయిందనే చెప్పాలి. సీఎంగా కనిపించిన (ఆనంద చక్రపాణి) ఎపిసోడ్ ఎందుకో అర్ధం కాదు. కథకు సరిగా లింక్ చేయకపోవడంతో పెద్దగా ఆ ట్రాక్ పండలేకపోయిందనిపిస్తుంది. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా ఫర్వాలేదనిపించారు.
ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. పేలవమైన కథ, కథనం, సన్నివేశాల ఉన్నప్పటికీ మ్యూజిక్ పరంగా భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన ట్యూన్స్ బాగున్నాయి. ఫోక్ టచ్‌తో సాంగ్స్ జోష్ కలిగించాయి. కాసర్ల శ్యామ్ రాసిన పాటలు బాగున్నాయి. వేణు మురళీధర్ సినిమాటోగ్రఫి కారణంగా సీన్లు తెర మీద రిచ్‌గా కనిపించాయి. ఎస్బీ ఉద్దవ్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఏ2బీ బ్యానర్‌పై నిర్మాత రజిత్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
అన్‌స్టాపబుల్ సినిమా కడుపుబ్బ నవ్వించడానికి స్కోప్ ఉన్న ఈవీవీ, జంధ్యాల తరహాలాంటి చిత్రంగా ఉండాల్సిన మూవీ. కానీ కథ, కథనాలు, నాసిరకమైన కామెడీ, పేలవంగా సన్నివేశాల కారణంగా ఆ స్థాయిని చేరుకోలేకపోయిందనే చెప్పాలి. మంచి ఫెర్ఫార్మెర్స్ ఉన్నప్పటీకి కంటెంట్ సరిగా లేకపోవడం వల్ల వారి టాలెంట్ ఉపయోగించు కోలేకపోయారనిపిస్తుంది. కామెడీ సినిమాలను ఇష్టపడే వారు వీకెండ్‌లో ఎంజాయ్ చేయవచ్చు.కానీ అతిగా అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











