Vrusshabha Box Office Collections: వృషభ డిజాస్టర్ దిశగా.. మోహన్‌లాల్ కెరీర్‌లోనే దారుణంగా, ఎన్ని కోట్లంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం వృషభ. భారతీయ సినీరంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్‌తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి శోభాకపూర్, ఏక్తా కపూర్, పద్మకుమార్, వరుణ్ మాథుర్, అభిషేక్ ఎస్ వ్యాస్ తదితరులు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ ద్విపాత్రాభినయం చేయగా.. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, వినయ్ వర్మ, ఆలీ, అయ్యప్ప పీ శర్మ తదితరులు నటించారు. లెజెండరీ హీరో జితేంద్ర అతిథి పాత్రలో మెరిసారు. ఈ చిత్రానికి ఆంటోని శ్యామ్సన్, కేఎం ప్రకాశ్ ఎడిటింగ్, సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ నేపథ్యంగా యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మోహన్‌లాల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతో కలిపి సుమారుగా 200 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాను మలయాళంలో ఆశీర్వాద్ సినిమాస్, తెలుగులో గీతా ఆర్ట్స్, హిందీలో పెన్ మూవీస్, కన్నడలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేశాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 250 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
రికార్డు లెవెల్ టార్గెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను ప్రభావితం చేయలేకపోయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు కూడా బజ్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. కేవలం మోహన్‌లాల్ స్టార్‌డమ్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి రోజు పేలవమైన ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఎంపురాన్ 2, తుడరం, హృదయపూర్వమ్ చిత్రాలు రికార్డు ఓపెనింగ్స్ సాధించాయి. కానీ ఈ చిత్రం ఏ భాషలోను సరైన కలెక్షన్లు రాబట్టలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రం కేరళలో చాలా దారుణమైన కలెక్షన్లను సాధించింది. మలయాళంలో కేవలం 45 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో అంటే నార్త్ అమెరికాలో 25 వేల డాలర్లు అంటే సుమారుగా 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 1.05 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక భాషల వారీగా ఈ సినిమా కలెక్షన్లు చూస్తే.. మలయాళం వెర్షన్ 65 లక్షలు, తెలుగు వెర్షన్ 17 లక్షలు, హిందీ వెర్షన్ 10 లక్షలు, కన్నడ వెర్షన్ కలెక్షన్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్‌లోనే అత్యంత తక్కువగా వసూళ్లను నమోదు చేసింది. బరోజ్ సినిమా తర్వాత పేలవమైన కలెక్షన్లు రాబట్టింది. ఇదే తీరు కొనసాగితే.. లాలెట్టా కెరీర్‌లోనే డిజాస్టర్ మూవీగా నమోదు అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











