Vrusshabha Movie Review: వృషభ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: మోహన్‌లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, ఆలీ, అయ్యప్ప పీ శర్మ, కిషోర్ తదితరులు
దర్శకత్వం: నందకిషోర్
నిర్మాతలు: శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా
సహ నిర్మాత: విమల్ లహోటి
మ్యూజిక్: సామ్ సీఎస్, అరియన్ మెహెదీ
ఎడిటింగ్: కేఎమ్ ప్రకాష్
సినిమాటోగ్రఫి: ఆంటోనీ సామ్ సన్
స్టంట్స్: పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, నిఖిల్
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
డైలాగ్స్: ఎస్ ఆర్ కే, జనార్థన మహర్షి, కార్తీక్
బ్యానర్స్: కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-12-25

ఆది దేవ వర్మ (మోహన్‌లాల్) బిజినెస్ మ్యాగ్నెట్. భార్య మరణంతో ఒంటరిగా మారిన ఆయన తన కుమారుడు తేజ్ (సమర్జీత్ లంకేష్)తో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తూ లైఫ్‌ను ఆస్వాదిస్తుంటాడు. అయితే ఆదిదేవకు విచిత్రమైన కలలు వెంటాడుతుంటాయి. రాజులు, గుర్రాలు, యుద్ధాలు లాంటి ఆయనను నిద్రలో వెంటాడుతుంటాయి. వాటి వెనుక కారణాన్ని అఘోరాను కలిసి తెలుసుకోవడానికి తేజ్ బయలుదేరుతాడు. అఘోరా కలిసిన ప్రాంతంలో తేజ్‌పై ఎటాక్ జరుగుతుంది. ఆ దాడి నుంచి కుమారుడిని ఆదిదేవ వర్మ కాపాడుతాడు. కానీ తన తండ్రినే తేజ్ కత్లి పోట్లతో పొడిచి చంపేందుకు ప్రయత్నిస్తాడు.

ఆదిదేవ వర్మను వెంటాడుతున్న కలలు గత జన్మకు సంబంధించినవా? గత జన్మలో ఆదిదేవ వర్మ ఎవరు? తండ్రిని వెంటాడుతున్న కలలను తెలుసుకోవడానికి వెళ్లిన తేజ్‌కు ఏం తెలిసింది? సొంత తండ్రినే తేజ్ ఎందుకు చంపాలని అనుకొన్నాడు? ఆదిదేవ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం ఏమిటి? చివరకు ఆదిదేవ, తేజ్‌కు ఉన్న సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించింది? అనే ప్రశ్నలకు జవాబు వృషభ.

Vrusshabha Movie Review

గత జన్మ జ్ఞాపకాలు నేపథ్యంగా దర్శకుడు నందకిషోర్ రాసుకొన్న సోషల్ డ్రామా. త్రిలింగ దేశంలోని మహత్తు కలిగిన స్పటిక శివలింగం చోరి చేసేందుకు దుష్టశక్తులు పన్నిన పన్నాగాన్ని రాజా విజయేంద్ర వృషభ ప్రయత్నాలు చేస్తాడు? ఆ ప్రయత్నంలో తాను వేసిన బాణం గురితప్పి ఓ బాలుడి ప్రాణాలను బలిగొట్టది. దాంతో విజయేంద్రకు ఆ బాలుడి శాపం పెడుతూ.. నీ కళ్లముందే నీ వల్లనే నీ కొడుకు మరణిస్తాడు అని శపిస్తుంది. ఇలాంటి పాయింట్‌తో కథ ఇంట్రెస్టింగ్‌గానే మొదలుపెట్టాడనిపిస్తుంది. కానీ అక్కడ నుంచి ఆదిదేవ వర్మ ఇంట్రడ్యూస్ చేస్తూ సాగించిన సోషల్ డ్రామా చాలా పేలవంగా ఉంది. ఏ ఒక్క సన్నివేశం కూడా సినిమా కనెక్ట్ చేయలేకపోవడం.. అత్యంత నీరసంగా కథ సాగిన తీరు చూస్తే.. ఈ సినిమాను మోహన్‌లాల్ ఎందుకు చేశాడా? అనే అసహనం, సందేహాం కలుగుతుంది.

ఫస్టాఫ్‌ను చాలా కష్టంగా కొనసాగిస్తూ.. ఇంటర్వెల్‌లో ఆదిదేవను, తేజ్ మర్డర్ అటెంప్ట్ చేసే సీన్‌ కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ పాయింట్ ఏదైనా కొత్తగా, సినిమాను కాపాడుతుందా? అనే ఆశ ప్రేక్షకుడిలో పుట్టేలా చేసింది. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత కథ, కథనాలు, రాసుకొన్న సన్నివేశాలు అత్యంత దారుణంగా ఉండటంతో ఇక ఈ సినిమాలో గొప్ప కథేమీ లేదని డిసైడ్‌ అయిపోతుంది. మోహన్ లాల్ కెరీర్‌లో బరోజ్ తర్వాత అత్యంత నాసిరకమైన సినిమాగా వృషభ కనిపిస్తుంది.

ఇటీవల కాలంలో గొప్ప కథలు, అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌లో సినీ ప్రేక్షకులను మెస్మరేజ్ చేస్తున్న మోహన్‌లాల్.. వృషభ లాంటి కథతో రావడం బ్లండర్‌గానే కనిపిస్తుంది. మోహన్‌లాల్ లాంటి స్టార్స్ ఇలాంటి నాసిరకమైన కథతో సినిమా చేయడం అభిమానులకు కూడా మింగుడు పడని విషయంగానే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఏ పాత్ర కూడా మెప్పించేలా కనిపించదు. సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రమే. వెరసి ఈ సినిమా పూర్తిగా నిరాశను కలిగించిందనే చెప్పాలి. ప్రేక్షకుడి పెట్టే టికెట్ ధరకు ఒక శాతం కూడా న్యాయం చేయలేని సినిమా. కాబట్టి ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీ ఛాయిస్ మాత్రమే.

More from Filmibeat

Read more about: mohanlal shobha kapoor Vrusshabha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X