RGV's Vyooham Review పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు వెన్నుపోటా? వ్యూహం మూవీ రివ్యూ

Rating:
2.5/5

నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ నిరోషా, వాసు ఇంటూరి, కోట జయరాం, ఎలీనా తుటేజా తదితరులు
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
మ్యూజిక్: ఆనంద్
సినిమాటోగ్రఫి: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: మనీష్ ఠాకూర్
బ్యానర్: శ్రీ రామదూత, ఆర్జీవి డెన్ ప్రోడక్ట్స్
రిలీజ్ డేట్: 2023-03-02

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీఎస్ వీరశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వీఎస్ మదన్ మోహన్ రెడ్డి (అజ్మల్ అమీర్) ఓదార్పు యాత్ర చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ భారత్ పార్టీ అధినేత్రి అందుకు అభ్యంతరం చెబుతుంది. దాంతో వీఎస్ఆర్ సీపీ పార్టీని మదన్ మోహన్ రెడ్డిని స్థాపిస్తాడు.

Vyooham Movie Review in Telugu  Ram Gopal Varma failed impress YS Jagan Biopic

భారత్ పార్టీని ఎదురించి సొంత పార్టీని స్థాపించడానికి ముందు జరిగిన సంఘటనలు ఏమిటి? వీఎస్ఆర్ సీపీ పార్టీ ప్రారంభించిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి? మదన్ రెడ్డిని అడ్డుకొనేందుకు ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహాలు ఏమిటి? భర్త మదన్ మోహన్ రెడ్డికి ఎదురైన గడ్డు పరిస్థితుల్లో వీఎస్ మాలతి రెడ్డి (మానస రాధాకృష్ణన్) ఎలాంటి పాత్ర పోషించింది? ఏపీ రాజకీయాల్లో శ్రవన్ కల్యాణ్ ఎలాంటి పాత్రను పోషించాడు? ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎలాంటి అడ్డంకులను అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే వ్యూహం సినిమా కథ.

ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌తో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇంద్రబాబు అరెస్ట్‌కు సీఎం మదన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో ఏదో కొత్త కోణంలో మూవీ చూడబోతున్నామనే ఫీలింగ్ దర్శకుడు వర్మ కలిగించాడు. కానీ ఇప్పటి వరకు ప్రజలకు తెలిసిన, ప్రింట్, వెబ్ మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా సీన్లు రాసుకోవడంతో మూవీ చాలా రొటీన్‌గా సాగినట్టు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌ ఎలాంటి కొత్తదనం లేకుండానే సినిమా ముగుస్తుంది.

Vyooham Movie Review in Telugu  Ram Gopal Varma failed impress YS Jagan Biopic

వ్యూహం సెకండాఫ్‌లో వాస్తవాలకు దూరంగా.. విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ.. వర్మ రాసుకొన్న ఊహాజనిత సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. శ్రవణ్ పాత్ర ద్వారా పవన్ కల్యాణ్‌ను ఎక్కువగానే టార్గెట్ చేయడం ఫుల్ కామెడీగా మారిందని చెప్పవచ్చు. పవన్‌ను వెన్నుపోటు పొడవక్కర్లేదు.. అతడే ముందు పోటు వేసుకొంటాడు అని ఇంద్రబాబు చేత చెప్పించిన సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. లోకేష్‌ను చూపించకుండా చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్‌గా సంచలనాలు లేకుండా, వివాదాస్పద అంశాల జోలికి పోకుండా వర్మ తనదైన శైలిలో సినిమా పార్ట్ 1ను ముగించేశాడనిపిస్తుంది.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. జగన్ పాత్రలో కనిపించిన అజ్మల్ అమీర్ పూర్తి స్థాయిలో స్క్రీన్ మీద ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కొన్ని సీన్లలో మాత్రమే పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఇక మాలతి రెడ్డిగా వైఎస్ భారతీ పాత్రలో మానస రాధకృష్ణన్‌కు మంచి రోల్ లభించింది. సెకండాఫ్‌లో ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాల్లో సహజంగా నటించారనే ఫీలింగ్ కలుగుతుంది. అంబటిగా వాసు ఇంటూరి ఆకట్టుకొంటాడు. చంద్రబాబుగా ధనుంజయ్ ప్రభునే అద్బుతంగా నటించాడు. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

Vyooham Movie Review in Telugu  Ram Gopal Varma failed impress YS Jagan Biopic

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫి భాగుంది. సన్నివేశాల కోసం వాడిన లైటింగ్, కలర్ ప్యాటర్న్ సినిమాను రిచ్‌గా కనిపించేలా చేసింది. మ్యూజిక్ ఈ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఇతర విభాగాల పనితీరు ఒకేలా ఉన్నాయి. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ రూపొందించిన చిత్రం వ్యూహం. చాలా సీన్లు చాలా సిల్లీగా ఉంటే.. కొన్ని సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. గత చిత్రాలతో పోల్చుకొంటే రాంగోపాల్ వర్మ కొంత ఫర్వాలేదనే విధంగా సినిమాను తెరకెక్కించారు. కానీ వర్మ పీక్స్‌లో ఉన్నప్పుడు తీసిన సర్కార్ లాంటి బయోపిక్ సినిమాలకు ఆమడ దూరంలో ఉందనే వాస్తవం. వర్మ పేలవమైన ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్‌పై వేసిన సెటైర్లు భారీగానే పేలాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రమే ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. కేవలం ఈ సినిమా వైఎస్ అభిమానులకు మాత్రమే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X