Walter Veerayya review ఊర మాస్ వీరయ్య.. పక్కా రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

Rating: 2.75/5

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం భారీ క్రేజ్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అభిమానులను, ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాన్ని తెలుసుకొందాం పదండి..

వాల్తేరు వీరయ్య కథేమిటంటే?

వాల్తేరు వీరయ్య కథేమిటంటే?

వాల్తేరు పోలీస్ స్టేషన్ నుంచి అంతర్జాతీయ మాఫియా డ్రగ్ లీడర్ సాల్మన్ సీజర్‌ (బాబీ సింహా) మలేషియాకు తప్పించుకుపోవడంతో పోలీస్ ఆఫీసర్ (రాజేంద్రప్రసాద్) సస్పెన్షన్‌కు గురవుతాడు. దాంతో సల్మాన్ సీజర్‌ను మలేషియా నుంచి తీసుకురావడానికి వాల్తేరులో జాలరి వీరయ్య సహకారం తీసుకొంటాడు. అయితే కోర్టులో ఓ కేసు విషయంలో పోరాటం చేస్తున్న వీరయ్య తప్పనిపరిస్థితిలో సల్మాన్ సీజర్‌ను ఇండియాకు తీసుకురావడానికి పోలీస్ ఆఫీసర్‌తో డీల్ చేసుకొంటాడు.

వాల్తేరు వీరయ్యలో ట్విస్టులు

వాల్తేరు వీరయ్యలో ట్విస్టులు

మలేషియాకు వెళ్లిన వాల్తేరు వీరయ్యకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వాల్తేరులో జాలరిగా పనిచేసే కాలా (ప్రకాశ్ రాజ్) అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌గా ఎదిగాడు. క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండే కాలా, వీరయ్య మధ్య ఎందుకు చెడింది? మలేషియాలో అతిథి (శృతిహాసన్) ఎందుకు ఉద్యోగం చేస్తుంది? తన తమ్ముడు విక్రమ్ సాగర్ (రవితేజ)కు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? విక్రమ్ సాగర్ భార్య (క్యాథరీన్ త్రెసా) వాల్తేరు వీరయ్యను ఎందుకు ఈసడించుకొంటుంది? తమ్ముడు విక్రమ్ సాగర్ చివరి కోరికను వాల్తేరు వీరయ్య తీర్చాడా? సల్మాన్‌ను ఇండియాకు తీసుకొచ్చాడా? కాలాకు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే వాల్తేరు వీరయ్య సినిమా కథ.

కమర్షియల్ ఫార్మాట్‌తో ఫస్టాఫ్

కమర్షియల్ ఫార్మాట్‌తో ఫస్టాఫ్

ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్‌ సల్మాన్‌ను అరెస్ట్ చేసే సన్నివేశంతో కథ నార్మల్‌గానే మొదలవుతుంది. సల్మాన్ తప్పించుకుపోవడం, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్ గురి కావడం లాంటి సన్నివేశాలు ఎక్కువ ల్యాగ్ లేకుండా చకచకా జరిగిపోతాయి. సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ సహాయం కోసం వెళ్లడంతో పవర్‌ఫుల్ ఎంట్రీతో వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఇంట్రడక్షన్ ఫ్యాన్స్‌కు కిరాక్ లేపుతుంది. అయితే ఆ తర్వాత బాస్ పార్టీ, ఫైట్లతో కమర్షియల్ ఫార్మాట్‌తో కొనసాగుతుంది. మలేషియాలో అతిథిగా శృతిహాసన్ ఎంట్రీ సీన్లు చిరంజీవితో రొమాంటిక్‌గా ఉంటాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి పాటపై శృతి, చిరు డ్యాన్స్ తెరపైకి రావడం ఫ్యాన్స్‌కు హై మూమెంట్‌గా ఉంటుంది. అయితే ఆ తర్వాత కథ, కథనాల్లో పసలేకపోవడం, సీన్లు కొత్తగా ఉండకపోవడంతో మనం రొటీన్ సినిమాను చూడాల్సిందే అనే ఫీలింగ్ కలుగుతుంది. పవర్‌ఫుల్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డు పడటంతో ఫస్టాప్ ముగుస్తుంది.

సెకండాఫ్‌లో రవితేజ ఎంట్రీ

సెకండాఫ్‌లో రవితేజ ఎంట్రీ

ఇంటర్వెల్ తర్వాత విక్రమ్ సాగర్‌గా రవితేజ ఎంట్రీ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రొటీన్, రెగ్యులర్‌ మోడ్‌లోకి కథ వెళ్తుంది. పోలీస్ ఆఫీసర్‌ విక్రమ్ సాగర్, వాల్తేరు వీరయ్య మధ్య ఉండే సన్నివేశాలు బాగా ఎలివేట్ కాకపోవడంతో ఫ్యాన్స్ చల్లబడిపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. రవితేజపై ఎటాక్ సీన్లు కూడా సింపతీని క్రియేట్ చేయలేదు. కాకపోతే సల్మాన్ సీజర్‌ను చంపే ఎపిసోడ్ కేకపెట్టిస్తుంది. కోర్టు సీన్లలో చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టేందుకు ప్రయత్నం జరిగిందనిపిస్తుంది. కానీ అప్పటికే సినిమా చేజారిపోయిందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతోపాటు రెగ్యులర్ ఫార్మాట్‌లో క్లైమాక్స్ ముగియడంతో చిరంజీవి చెప్పినట్టు పక్కా రొటీన్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది.

బాబీ తడబాటు గురై..

బాబీ తడబాటు గురై..

దర్శకుడు బాబీ ఊహించుకొన్న పాయింట్‌ బాగానే ఉంది. కానీ కథ, మంచి సన్నివేశాలుగా విస్తరించడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. సంక్రాంతి జోష్ కనిపించేలా సన్నివేశాలు రాసుకోలేకపోయడం మైనస్ అని చెప్పవచ్చు. 80, 90 దశకంలో కూడా అనుసరించని స్క్రీన్ ప్లేతో కథను నీరుగార్చాడని చెప్పవచ్చు. ఇంటర్వెల్‌కు ముందు 10 నిమిషాలు, ఆ తర్వాత కొద్ది సేపు సినిమా యాక్టివ్‌గా ఉంటుంది. పునకాలు లోడింగ్ పాట ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది. మిగితాదంతా రొటీన్‌గానే సాగించాడని చెప్పవచ్చు.

చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్

చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్

వాల్తేరు వీరయ్య క్యారెక్టర్ చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్. కథ, కథనాల్లో వైఫల్యం ఉన్నప్పటికీ.. పలు రకాలుగా చిరంజీవి ఈ సినిమాను నిలబెట్టేందుకు తన అనుభవాన్ని చూపించాడు. 90 దశకంలోని టాప్ సినిమాల్లోని క్యారెక్టర్లను మళ్లీ గుర్తుకు తెచ్చేలా చిరంజీవి చేశాడు. బాస్ పార్టీ, పునకాలు లోడింగ్ పాటల్లో చెలరేగిపోయారు. ఎప్పటి మాదిరిగానే సినిమా భారన్నంతా తానే మోసే ప్రయత్నం చేశారు. శృతిహాసన్ కొన్ని సీన్లలో ఆకట్టుకొన్నప్పటికీ...ప్రధానంగా గ్లామర్‌కే పరిమితమయ్యారు. శ్రీదేవీ పాట, మరో పాటలో చిరంజీవితో కలిసి కేకపెట్టించారు.

రవితేజ ఫెర్ఫార్మెన్స్ ఎలా అంటే..

రవితేజ ఫెర్ఫార్మెన్స్ ఎలా అంటే..

రవితేజ‌ ఇమేజ్‌కు తగినట్టుగా సీన్లు ప్లాన్ చేసుకొన్నారు. సెకండాఫ్‌లో సినిమాను నిలబెట్టే విధంగా మాస్ మహారాజ్ క్యారెక్టర్ పనికివచ్చింది. ఎప్పటిలానే రవితేజ తన మార్కు నటనతో ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల విషయానికి వస్తే.. బాబీ సింహా, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, ఇతర పాత్రలు పరమ రొటీన్‌గా ఉన్నాయని చెప్పవచ్చు.

ఆర్ట్, మ్యూజిక్ హైలెట్‌గా

ఆర్ట్, మ్యూజిక్ హైలెట్‌గా

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. కాకపోతే.. ఎంత అవసరమో.. అంత ఇవ్వకుండా.. ప్రతీ సన్నివేశానికి ఒకే రేంజ్‌లో బీజీఎంను ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని సీన్లలో పస లేకున్నా... అదనపు హోరుతో కొంత ఇబ్బంది పెట్టారనిపిస్తుంది. ఆర్ట్ విభాగం ఈ సినిమాకు హైలెట్. మిగితా విభాగాలు ఫర్యాలేదనిపిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రమాణాలకు తగినట్టుగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి.

ఫైనల్‌గా వాల్తేరు వీరయ్య ఎలా అంటే..

ఫైనల్‌గా వాల్తేరు వీరయ్య ఎలా అంటే..

కథలో కొత్తదనం, పాత్రల్లో ఎలాంటి వైవిధ్యం లేకుండా, చిరంజీవి, రవితేజ ఇమేజ్‌కు, అభిమానులు ఏం కోరుకొంటారో.. వాటికి తగినట్టుగా మాస్, కమర్షియల్, ఫన్, ఎమోషనల్ అంశాలను కలిపి చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. అయితే కథకు అవసరమయ్యే అదనపు అంశాలు సమపాళ్లలో పండకపోవడంతో పక్కా రొటీన్‌ సినిమా అనిపిస్తుంది. చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగ లాంటి సినిమా. సంక్రాంతి పండగ సీజన్‌లో మంచి జోష్ నింపే చిత్రంగా వాల్తేరు వీరయ్య రూపొందింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వారాంతంలో ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
చిరు, రవితేజ ఇంట్రడక్షన్ సీన్లు
శృతి హాసన్ గ్లామర్
ఇంటర్వెల్ బ్యాంగ్
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్

నెగిటివ్ పాయింట్స్
రొటీన్ కథ, కథనాలు
పండని కామెడీ
బాబీ డైరెక్షన్

వాల్తేర్ వీరయ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

వాల్తేర్ వీరయ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, క్యాథరీన్ త్రెసా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, సత్యర���జ్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి తదితరులు
కథ, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కల్యాణ్ చక్రవర్తి
నిర్మాతలు: నవీన్ యెర్నీని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫి: ఆర్థర్ ఏ విల్సన్
ఎడిటింగ్: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2023-01-13

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X