War 2 First Review: వార్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ.. ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మొదలు కానున్నది. తన తొలి సినిమానే ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో, హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు.

వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మరింత క్రేజ్‌ను పెంచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ చిత్రం ఇటీవల ముంబైలో పూర్తి చేసుకొన్నది. ఈ సెన్సార్ ప్రీమియర్ తర్వాత అధికారుల రివ్యూ ఏమిటి? ఈ సినిమా సర్టిఫికెట్ వివరాలు, ఈ చిత్రం రన్ టైమ్ విషయానికి వస్తే..
పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొంందిన వార్ 2 సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అధికారులు ముంబైలో వీక్షించారు. ఈ సినిమాకు యూ/ఏ (U/A) 16+ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంటే ఈ సినిమాను 16 ఏళ్లు పైపడిన వారు చూడటానికి అర్హత ఉంటుందని సర్టిఫికెట్ ప్రకారం వెల్లడైంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు.. తల్లిదండ్రుల గైడెన్స్ అవసరమని నిబంధనలు తెలియజేస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటుంది. హృతిక్‌తో జూనియర్ ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్లు బాగున్నాయి. పూర్తిస్థాయి యాక్షన్ మూవీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని ట్రిమ్ చేశారు. ప్రస్తుతం సెన్సార్ తర్వాత పూర్తిస్థాయిలో రిలీజ్‌కు ముస్తాబైంది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇక వార్ చిత్రంలో టైగర్ ష్రాఫ్, హృతిక్ కాంబినేషన్ భారీ విజయం అందుకొన్నది. వార్ 2పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న ఈ మూవీ నిడివి 182 నిమిషాలు అంటే.. 3 గంటల 2 నిమిషాలు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సినిమాను తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేస్తున్నది. ఈ సినిమా హక్కులను సుమారుగా 94 కోట్ల రూపాయలకు నాగవంశీ చేజిక్కించుకొన్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











