War 2 Critic Review: వార్ 2 క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.
వార్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకు బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ గ్రాండ్‌గా రూపొందించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఓవర్సీస్ సెన్సార్ స్క్రీనింగ్ దుబాయ్‌లో జరిగింది. ఈ చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమాల సందర్భంగా చూసినట్టు దుబాయ్ క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సంధూ తన రివ్యూను అందించారు.

ఉమేర్ సంధూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేస్తూ.. నేను దుబాయ్ సెన్సార్ స్క్రినింగ్ సందర్భంగా వార్ 2 సినిమా చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత ష్యూర్ షాట్ హిట్ అనిపించింది. జూ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి ఇద్దరు హంక్స్ మధ్య కెమిస్ట్రీ మ్యాజిక్‌లా వర్కవుట్ అయింది. వారి మధ్య ఉండే యాక్షన్ సీన్లు సూపర్బ్‌గా ఉన్నాయి. కేవలం యాక్షన్ సీన్లే కాకుండా డ్యాన్స్ ఎపిసోడ్స్ అవుట్‌స్టాండింగ్‌గా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాకు యాక్షన్, డ్యాన్స్ ప్లస్ పాయింట్స్ అని తెలిపారు.
వార్ 2 సినిమా ద్వారా హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జూనియర్ ఎన్టీఆర్.. అన్ని రకాలు అద్బుతమైన ప్రతిభను చూపించి మనసు దోచుకొన్నాడు. హృతిక్ టెర్రిఫిక్ ఫామ్‌లో ఉన్నాడు. క్లైమాక్స్‌లో ట్విస్ట్, సస్పెన్స్ అదిరిపోయేలా ఉంటాయి. ఆ క్లైమాక్స్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. కియారా అద్వానీ కేవలం శృంగారం, అందాల ఆరబోతకే పరిమితయ్యారు అని ఉమేర్ సంధూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇక వార్ 2 సినిమాకు ఆయన్ ముఖర్జీ అందించిన దర్శకత్వ ప్రతిభ, , సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ రేటింగ్ ఇవ్వాలి. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా సాగాయి. ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం సెలవుల నేపథ్యంలో ప్రేక్షకులకు పర్‌ఫెక్ట్ సినిమాగా ఉంటుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు గాను 4 రేటింగ్ ఇస్తున్నాను అని ఉమేర్ సంధూ తన ఒపీనియన్ రివ్యూను అందించారు.
ఇక ఉమేర్ సంధూ విషయానికి వస్తే.. బాలీవుడ్‌కు సంబంధించిన అసభ్యకరమైన గాసిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాడు. దుబాయ్ సెన్సార్ స్క్రీనింగ్ పేరిట రివ్యూలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటాడు. ఆయన అద్బుతం అంటూ రివ్యూ, రేటింగ్ ఇచ్చిన సినిమాలు కొన్ని హిట్స్‌గా నిలిచాయి.. మరొకిన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర వార్తల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











