War 2 Twitter Review: వార్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ
బాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందించిన వార్ 2 చిత్రానికి బ్రహ్మస్త్ర ఫేమ్ ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్‌తోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమాకు పరిచయమైతే.. హృతిక్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయ్యారు.
వార్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకు బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ గ్రాండ్‌గా రూపొందించారు. ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా మొదలయ్యాయి. ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను, రివ్యూలను వెల్లడించారు. ట్విట్టర్‌లో వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

యూకేలో ఫస్ట్ షో చూస్తున్నాను. ఇంటర్వెల్ వార్ సీన్ ఇది. బాలీవుడ్‌లో ఈ రేంజ్ ఉన్న సినిమాను ఇప్పటి వరకు చూడలేదు. యాక్షన్, మాస్, క్లాస్ కలబోసిన తీరు బాగుంది. స్పై యూనివర్స్‌లో సరికొత్త చాప్టర్. స్టాల్ వార్ట్స్‌తో కన్వెన్షన్‌ను బ్రేక్ చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
వార్ 2 గురించి జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఇండియన్ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ చూస్తే.. ఇంతకంటే చెత్త ఉండదు. ఇంత దారుణంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేసి ఉండరు. వరస్ట్ స్క్రీన్ ప్రజెనస్, వరస్ట్ లుక్, వరస్ట్ డైలాగ్ డెలివరీ, వరస్ట్ డ్యాన్స్,.. అంతా వరస్ట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
వార్ 2 సినిమా చూశాను. ఇటీవల కాలంలో మైండ్ బ్లోయింగ్ ఫస్టాఫ్‌ను చూడలేదు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. సలాం అనాలి, ఎన్టీఆర్ ఇంట్రో, ఇంటర్వెల్ ఎపిసోడ్ టికెట్ పైసల్ వసూలు. ఫస్టాఫ్ వరకే సినిమా బ్లాక బస్టర్అని నెటిజన్ కామెంట్ చేశాడు. వార్ 2కు సలాం అనక తప్పదు అని పేర్కొన్నాడు.
ఎన్టీఆర్ షర్ట్ లేస్ సీన్ కేక. గూస్ బంప్స్ ఫీల్స్, థియేటర్ దద్దరల్లింది. షర్ట్ లెస్ అవతారంలో ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు పిచ్చెక్కడం ఖాయం అని నెటిజన్ కామెంట్ చేశాడు.
పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తోపాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మ్యాజిక్ చేసింది. డ్యాన్స్ సీక్వెన్స్ అదిరిపోయింది. అయితే కథలో దమ్ము లేదు. పేలవంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. కియారా అద్వానీ గ్లామర్ షో బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. చివరి 25 నిమిషాల క్లైమాక్స్ బెస్ట్‌గా ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫస్టాఫ్ ఎక్సలెంట్. సెకండాఫ్ కూడా బాగుంది. క్లైమాక్స్ సూపర్‌గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్‌తో ట్విస్టు రివీల్ చేసే విధానం బాగుండటమే కాుండా సినిమాకు హైలెట్ అవుతుంది. హృతిక్‌ను జూనియర్ ఎన్టీఆర్ డామినేట్ చేశారు. కియారా గ్లామర్‌తో అదరగొట్టింది.
వార్ 2 సినిమా చూశాను. విజువల్‌గా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ నోరెళ్లబెట్టి చూసేలా ఉంటాయి. ప్రతీ ఫ్రేమ్‌లో హృతిక్ చరిష్మా, పవర్ బాగుంది. ఎన్టీఆర్ ప్రజెన్స్ బాగుంది. ఫైనల్‌గా ఈ సినిమా అదిరిపోయింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోతుంది. హృతిక్ రోషన్ పరదా చించేలా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ప్రతీ క్షణం అనేక ట్విస్టులతో పలు రకాల సందేహాలు వ్యక్తమవుతాయి. ట్విస్టు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
వార్ 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నా ప్రియమైన తారక్ సార్‌కు శుభాకాంక్షలు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా రైడ్ ఏమిటో పూర్తిగా అర్ధమైంది. మీ హార్డ్ వర్క్, అంకిత భావం ఎంతో మందికి స్పూర్తిని అందిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందించాలని కోరకొంటున్నాను. హృతిక్ సార్.. మీ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అనే కోరికతో ఉన్నాను అని దర్శకుడు బుచ్చిబాబు సనా ట్వీట్ చేశారు.వార్ 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నా ప్రియమైన తారక్ సార్‌కు శుభాకాంక్షలు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా రైడ్ ఏమిటో పూర్తిగా అర్ధమైంది. మీ హార్డ్ వర్క్, అంకిత భావం ఎంతో మందికి స్పూర్తిని అందిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందించాలని కోరకొంటున్నాను. హృతిక్ సార్.. మీ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అనే కోరికతో ఉన్నాను అని దర్శకుడు బుచ్చిబాబు సనా ట్వీట్ చేశారు.
వార్ 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో నా సహోదరు తారక్ సార్‌కు, ఎప్పడూ స్పూర్తిని కలిగించే హృతిక్ సార్‌కు ఆల్ ది బెస్ట్. రెండు పవర్ హౌస్‌లు కలిసి ఆన్ స్క్రీన్ మీదకు ఒక్కటై వస్తున్నారు. ఇది కేవలం ఓ సినిమా కాదు. గొప్ప అనుభూతిగా మిగులుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు పండుగలాంటి వాతావరణం నింపుతుంది. ఎన్టీఆర్ ఎనర్జీ, హృతిక్ సార్ చరిష్మా తెర మీద ప్యూర్ మ్యాజిక్ అవుతుంది. మీ హర్డ్ వర్క్, ప్యాషన్, అంకితభావం, ప్రతీ ఫ్రేమ్ ఇండియన్ సినిమాలో మైలురాయిగా నిలుస్తుంది అని రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











