War Movie Review: వార్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్, అశుతోష్ రాణా, సోని రజ్దాన్, అనుప్రియ గోయెంకా తదితరులు
దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్
నిర్మాత: ఆదిత్య చోప్రా
సినిమాటోగ్రఫి: బెంజమిన్ జాస్పర్
ఎడిటింగ్: ఆరీఫ్ షేక్
పాటలు: విశాల్ భరద్వాజ్
బీజీఎం: సంచిత్, అంకిత్ భరద్వాజ్
బ్యానర్: యష్ రాజ్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2019-10-02
రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా) ఏజెంట్‌గా పనిచేసే మేజర్ కబీర్ ధలీవాల్ (హృతిక్ రోషన్) ఉగ్రవాదులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. దేశం ప్రయోజనాలకు ముప్పు ఉందని తెలిస్తే ఎంతకైనా తెగించే కబీర్‌ను ఉగ్రవాది ఫరీద్ హఖానీని మట్టుపెట్టేందుకు నియమిస్తారు. కానీ హఖానీ చేతికి దొరికినా అతడిని చంపడానికి బదులు రా ఏజెంట్ వీకే నాయుడిని కాల్చి చంపుతాడు. వీకే నాయుడిని చంపిన కబీర్‌ను మట్టుపెట్టాలని తన అసిస్టెంట్ ఖాలీద్ రెహ్మానీ (టైగర్ ఫ్రాఫ్)కు ఆపరేషన్‌ను డిఫెన్స్ మినిస్టర్, కల్నల్ సునీల్ లోహ్రా (అశుతోష్ రాణా) అప్పగిస్తారు.

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్దమైన కబీర్‌ను ఎలాంటి సాహసాలు చేశాడనే పాయింట్‌తో సిద్దార్థ్ రాసుకొన్న కథ పూర్తిగా యాక్షన్, ఎమషన్స్‌తో సాగుతుంది. తన కింద పనిచేసే అసిస్టెంట్ ఖాలీద్‌ను కబీర్ శత్రువుగా చూసే అంశంతో కథలో ఓ ఎమోషనల్ ట్విస్ట్‌ను తెర మీద నడిపించిన విధానం బాగుంది. ఖాలీద్ కుటుంబంపై దేశ ద్రోహులనే ముద్ర పడటానికి కారణం ఏమిటనే విషయం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఆ ఎపిసోడ్‌ను మరింత ఎఫెక్టివ్‌గా చెబితే బాగుండేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కబీర్, ఖాలీద్ చుట్టు ఉండే ట్విస్టులు సినిమాకు మరింత బలంగా మారాయి. నైనాగా వాణి కపూర్ క్యారెక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. ఖాలీద్‌కు సంబంధించిన ట్విస్ట్ అదిరిపోయేలా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ డిజైన్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్‌గా దేశభక్తితో సాగే యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
కబీర్‌గా హృతిక్ రోషన్ వన్ మ్యాన్ షో అనే విధంగా పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అలాగే టైగర్ ష్రాఫ్ ఖాలీద్ పాత్రలో ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నాడు. కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటించి మెప్పించాడు. వాణి కపూర్ పాత్ర చిన్నదైనా సినిమాలోని కథకు ఉపయోగపడేలా.. సెంటిమెంట్ పండించేలా ఉపయోగపడింది. టైగర్ ష్రాఫ్ తల్లిగా ఆలియా భట్ తల్లి సోని రజ్దాన్ కీలక పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు సంచిత్, అంకిత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అత్యంత బలంగా మారిందని చెప్పాలి. పాటలకు పెద్దగా స్కోప్ లేదు. కానీ బీజీఎంతో పలు యాక్షన్ సన్నివేశాలు క్రేజీగా మారాయి. ఇక బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫి హైలెట్‌గా నిలిచింది. యష్ రాజ్ ఫిలింస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
దేశాన్ని నాశనం చేయాలనే ఉగ్రవాదుల కుట్రలను ఎంతకైనా తెగించి ఎదుర్కొనే రా ఎజెంట్.. దేశభక్తిపరుడైన మరో ఏజెంట్‌ను దేశ ద్రోహిగా ముద్ర వేయడం లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ రెగ్యులర్, రొటీన్‌గా అనిపించినా.. కథను చెప్పిన విధానం, సన్నివేశాలు డిజైన్ తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ కంటెంట్, యాక్షన్ సీన్లు ఈ సినిమాను మరింత కమర్షియల్‌గా మార్చింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాకు 2019 సంవత్సరంలో రిలీజైన ఈ మూవీ స్టోరికి కొంత కనెక్షన్ ఉండటంతో ఈ చిత్రానికి సంబంధిచంిన రివ్యూను ప్రత్యేకంగా అందిస్తున్నాం. వార్ 2 విడుదలకు ముందు.. భారీ విజయం సాధించిన ఈ రివ్యూను ఎంజాయ్ చేస్తారని అనుకొంటున్నాం.


Click it and Unblock the Notifications











