Welcome To The Jungle Movie Review: వెల్‌కమ్ టూ ది జంగిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: వెల్‌కమ్ టూ ది జంగిల్
నటీనటులు: అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, లారా దత్తా, దిశా పటానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్, ఊర్వశి రౌటేలా, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్, పరేశ్ రావెల్ తదితరులు
దర్శకత్వం: ఆహ్మద్ ఖాన్
నిర్మాతలు: ఫిరోజ్ ఏ నాడియావాలా, రాకేష్ దాంగ్, వేదాంత్ వికాస్ బాలీ
సహ నిర్మాత: షైరా ఆహ్మద్ ఖాన్
మ్యూజిక్: సాజిద్ వాజిద్
కథ: స్వర్గీయ నీరజ్ ఓరా
సినిమాటోగ్రఫి: కబీర్ లాల్,
ఎడిటర్: నితిన్ ఎఫ్‌సీపీ,
మ్యూజిక్ కంపోజర్స్: విక్రమ్ మాంత్రోసే, తల్విందర్, ఎన్‌డీఎస్, ఆనంద్ రాజ్ ఆనంద్,
కొరియోగ్రఫి: గణేష్ ఆచార్య, ఆదిల్ షేక్, ప్రిన్స్ గుప్తా, రాహుల్ శెట్టి,
యాక్షన్ డైరెక్టర్: అబ్బాస్ ఆలీ
రిలీజ్ డేట్: 2026-06-26
రాజకీయ అండదండలు ఉన్న వ్యాపారవేత్త సిన్హా (జాకీర్ హుస్సేన్) అవినీతి, అక్రమాలతో కోట్ల రూపాయల సంపాదిస్తాడు. నలధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు ఆలోచిస్తుండగా.. తన సెక్రెటరీ దుబే (జానీ లీవర్) ఫ్లాప్ సినిమా తీస్తే కోట్ల నష్టం వస్తుంది. దాంతో బ్లాక్ మనీని వైట్ చేసుకోవచ్చని ప్లాన్ ఇస్తాడు. దాంతో 2000 కోట్ల రూపాయలతో ఓ చెత్త సినిమా తీయడానికి సిన్హా కూతురు జేనా (జాక్వలైన్ ఫెర్నాండేజ్)ను నిర్మాతగా చేస్తారు. ఈ సినిమా కోసం వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న ఫ్లాప్ హీరో రాజీవ్ కోహ్లీ (అక్షయ్ కుమార్)ను హీరోగా, దేవ్ (పరేశ్ రావెల్), దాస్ (రాజ్‌పాల్ యాదవ్)ను డైరెక్టర్లుగా, టాప్ హీరోయిన్, రాజీవ్ మాజీ లవర్ నాడియా (దిశాపటానీ)ని హీరోయిన్‌గా సెలెక్ట్ చేస్తారు. ముంబైని వణికించే డాన్స్ రోమియో (అర్షద్ వార్సీ), యెడా అన్నా (సునీల్ శెట్టి) సపోర్టింగ్ యాక్టర్లుగా చేరుతారు. సినిమాను చెత్తగా తీసే ప్రయత్నంలో ఓ కారణం వల్ల సిన్హా అప్పుల పాలవుతాడు. దాంతో హిట్ సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతలో సినిమా యూనిట్ అంతా పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో బందీ అవుతుంది.
బిజినెస్‌మ్యాన్, మరో పొలిటిషియన్ కలిసి మురిగిపోతున్న నల్లధనాన్ని వైట్ మనీగా మార్చడానికి ఎలాంటి ప్లాన్స్ వేశారు? అప్పటి వరకు సక్సెస్ లేని హీరో, డైరెక్టర్లకు 2000 కోట్ల సినిమా రావడంతో వారి పరిస్థితి ఏమిటి? మంద బుద్ది ఉన్న జేనా నిర్మాతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నది? ప్లాప్ హీరో రాజీవ్, స్టార్ హీరోయిన్ నాడియాకు బ్రేకప్ ఎందుకు జరిగింది? డాన్స్ రోమియో, యేడా ఈ సినిమాలో నటించాలని ఎందుకు అనుకొన్నారు? చెత్త సినిమా తీద్దామని ప్రయత్నాలు చేసిన నిర్మాతలకు హిట్ సినిమా తీయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది. భారత, పాక్ సరిహద్దులో షూటింగ్ ఎలా సాగింది? ముజాహిద్దీన్ నాయకుడు జటారా (జాకీ ష్రాఫ్) చేతిలో చిత్ర యూనిట్, ఆజాద్ గంజ్ అనే గ్రామం ఎలా బందీ అయింది? జటారాను సినిమా యూనిట్ ఎలా ఎదురించింది? ఉగ్రవాదుల నుంచి సినిమా టీమ్ ఎలా బయటపడింది? ఇంతకు హిట్ సినిమా తీశారా? అనే ప్రశ్నలకు సమాధానమే వెల్‌కమ్ టూ ది జంగిల్ సినిమా కథ.

వెల్‌కమ్ టూ ది జంగిల్ కథ గురించి చెప్పుకోవాలంటే.. కొత్తగా, డిఫరెంట్‌గా ఉన్న స్టోరీ కాదనే విషయం ఫస్ట్ సీన్‌లోనే దర్శకుడు అహ్మద్ ఖాన్ తెలివిగా హింట్ ఇచ్చాడు. అప్పటికప్పుడు రెడీమెడ్‌గా వచ్చే సీన్లు.. ఆ సీన్లలో సిచ్చువేషనల్ కామెడీని నింపేసి సినిమాను మొదలుపెట్టారు. ఫ్లాప్ హీరో, ఫ్లాప్ డైరెక్టర్లు, సక్సెస్ లేని టీమ్‌ను సినిమా కోసం సెలెక్ట్ చేసే క్రమంలో రొటీన్ సీన్లతో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా డైలాగ్ డ్రామాను బాగా ప్లాన్ చేశారు. కథలో కొత్తదనం లేకపోయినా.. ఫన్ ఎలిమెంట్స్‌తో సినిమాను లాగించే ప్రయత్నం వర్కవుట్ అయిందనిపిస్తుంది. తెర మీద లెక్కలేనన్ని పాత్రలు, గ్లామర్‌తో ఫస్టాఫ్‌ను యావరేజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మార్చేశాడు.
ఇక సెకండాఫ్‌లో హిట్ సినిమా తీయాల్సిన పరిస్థితి రావడం, కథలోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను చేర్చడంతో మూవీలో వేగం, చలనం కనిపిస్తుంది. పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగే సినిమా కావడంతో కథలో మరోటి ఊహించుకోవడానికి అవకాశమే లేకపోయింది. క్రింజ్ కామెడీ, ఒక పాత్ర మీద మరో పాత్ర వేసుకొనే సెటైరికల్ డైలాగ్ డ్రామాతో సరదాగా గడిచిపోతుంది. డిఫరెంట్ సినిమాను చూడాలనుకొనే వారికి అసంతృప్తిని కలిగించినా.. వెల్‌కమ్ ఫ్రాంచైజీని ఇష్టపడే వారు ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. సెకండాఫ్‌లో రవీనా టాండన్, ఆమె మూగ కూతురు (భజరంగీ భాయ్‌జాన్ తరహా) సెంటిమెంట్ ట్రాక్ సినిమాకు కొంత బలంగా మారుతుంది. సినిమాలో ఫరీదా జలాల్, కిరణ్ కుమార్ కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. ఇక డిఫరెంట్ క్యారెక్టర్‌లో అక్షయ్ కుమార్ డబుల్ రోల్ మంచి ఫన్ జనరేట్ చేస్తుంది. అలా ఈ సినిమా ఏ మాత్రం కొత్తదనం లేకుండా రెగ్యులర్ కామెడీతో హ్యాపీ ఎండింగ్ నోట్‌లో ముగుస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కథలో వెరైటీ లేకపోవడంతో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, అర్హద్ వార్సీ నుంచి గొప్పగా పెర్ఫార్మెన్స్‌ను ఊహించలేం. కమర్షియల్ పంథాలో మాస్ ప్రేక్షకులకు ఏం కావాలో అలా సినిమాలోని యాక్టర్ల పాత్రలను టైలర్ మేడ్‌గా క్రియేట్ చేశారు. ఎప్పటి లానే అక్షయ్ కుమార్ కొంత తన స్టయిల్ కామెడీ, యాక్షన్‌తో తన మార్కును చూపించాడు. సునీల్, అర్క్షద్ తమ ఇమేజ్ నుంచి బయటపడలేదు. దిశా పటానీ, జాక్వలైన్ గ్లామర్ షోకే పరిమితమయ్యారు. జాకీ ష్రాఫ్ విలన్ పాత్ర రొటీన్‌గానే ఉంటుంది. రవీనా టాండన్ పాత్ర కథలో సెంటిమెంట్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. దలేర్ మెహందీని సరిగా వాడుకోలేదు. జానీ లీవర్ సినిమాలో మంచి కామెడీని పండించాడు. కృష్ణ అభిషేక్, కికూ శర్దా తమ రొటీన్ కామెడీని ప్లే చేశారు. ఊర్వశీ రౌటేలా గెస్ట్ పాత్రలో అందాలు ఆరబోసింది. మిగితా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ విభాగాలు తమ గుర్తింపును చాటుకొన్నాయి. మంచి పాటలతో సాజిద్ వాజిద్, అందమైన లొకేషన్లు, మంచి యాక్షన్ సీన్లతో కబీర్ లాల్ ఆడియెన్స్‌ను తృప్తి పరిచేందుకు కృషి చేశారనే విషయం తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. కొరియోగ్రఫి, యాక్షన్ కొరియోగ్రఫి టీమ్ వర్క్ బాగుంది. ముఖ్యంగా అతిపెద్ద స్టార్ కాస్ట్‌తో సినిమాను రూపొందించిన విధానం.. క్వాలిటీతో, మంచి నిర్మాణ విలువలతో సినిమాను రూపొందించడం నాడియావాలా టేస్ట్‌కు నిదర్శనంగా మారింది. ఎక్కువగా ఆశించకుండా రెండున్నర గంటలపాటు కామెడీని ఎంజాయ్ చేయాలనుకొంటే సినిమాకు వెళ్లండి.. లాజిక్‌లు వెతికేంత సీన్ ఉన్న సినిమా కాదు. కొన్నిసార్లు బాగా నవ్విస్తుంది. మరికొన్ని సార్లు ఇరిటేట్ చేస్తుంది. వెలకమ్ ఫ్రాంజైజీని ఇష్టపడే వారికి ఈ సినిమాను నచ్చడానికి అవకాశం ఉంది. ఈ వారం క్రింజ్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకొనువారికి, భారీ తారాగణంతో ఉన్న మూవీని ఇష్టపడే వారికి.. వెల్‌కమ్ టూ ది జంగిల్ మంచి ఆప్షన్.


Click it and Unblock the Notifications