Welcome To The Jungle First Review: వెల్‌కమ్ టు ది జంగిల్ మూవీ ఫస్ట్ రివ్యూ
హిందీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, లారా దత్తా, దిశా పటానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్, ఊర్వశి రౌటేలా, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్, పరేశ్ రావెల్‌తో సుమారుగా 30పైగా యాక్టర్లు, కమెడియన్లతో భారీగా నిర్మించిన చిత్రం వెల్‌కమ్ టూ ది జంగిల్. ఈ సినిమాను ఫిరోజ్ ఏ నాడియావాలా, రాకేష్ దాంగ్, వేదాంత్ వికాస్ బాలీ నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షైరా ఆహ్మద్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ మూవీకి సాజిద్ వాజిద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి స్వర్గీయ నీరజ్ ఓరా కథను అందించారు. ఇక సినిమాటోగ్రఫి: కబీర్ లాల్, ఎడిటర్: నితిన్ ఎఫ్‌సీపీ, మ్యూజిక్ కంపోజర్స్: విక్రమ్ మాంత్రోసే, తల్విందర్, ఎన్‌డీఎస్, ఆనంద్ రాజ్ ఆనంద్, కొరియోగ్రఫి: గణేష్ ఆచార్య, ఆదిల్ షేక్, ప్రిన్స్ గుప్తా, రాహుల్ శెట్టి, యాక్షన్ డైరెక్టర్: అబ్బాస్ ఆలీ మొఘల్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ వివరాలు, అలాగే రన్ టైమ్, ఈ సినిమా కథ, ఈ చిత్రంపై వచ్చిన ఫీడ్ బ్యాక్ వివరాల్లోకి వెళితే..

ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) వీక్షించింది. ఈ చిత్రంలో కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలు, పాత్రల మధ్య డైలాగ్ డ్రామా, హీరోయిన్ల అందచందాలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయనే అభిప్రాయాన్ని సెన్సార్ వ్యక్తం చేశారు. కొన్ని డైలాగ్స్ విషయంలో, కొన్ని సీన్ల విషయంలో స్వల్ప అభ్యంతరాలు వ్యక్తం కాగా, వాటికి చిత్ర యూనిట్ సవరణలు చేపట్టారు. దాంతో సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు ఈ మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం ఈ చిత్రాన్ని 16 ఏళ్లకు పైబడిన వారందరూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని ఈ సినిమా కోసం జారీ చేసిన సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఇక ఈ చిత్రంలోని సన్నివేశాలు, కథ డిమాండ్ చేయడంతో నిడివి కూడా భారీగా పెరిగింది. పాత్రలను తెరపైకి తీసుకొచ్చి చూపించే ప్రయత్నంలో ఈ మూవీ నిడివి 2 గంటల 45 నిమిషాలకు పెరిగింది. అంటే ఈ చిత్రం రన్ టైమ్ 165 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్ స్పష్టం చేసింది.
ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ ఆహ్మద్ ఖాన్ చాలా రోజుల తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ కాస్టింగ్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో డైలాగ్ డ్రామా హిలేరియస్ కామెడీని జనరేట్ చేసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు హైలెట్ కానున్నాయి. అలాగే అందమైన హీరోయిన్ల గ్లామర్ ట్రీట్ గిలిగింతలు పెట్టేలా ఉంటుంది అనే ఫీడ్ బ్యాక్ సెన్సార్ తర్వాత బయటకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. ఈ మూవీ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications