వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రివ్యూ అండ్ రేటింగ్

Recommended Video

Where Is Venkata Lakshmi Movie Review || Filmibeat Telugu

Rating:
2.0/5
Star Cast: రాయ్‌ లక్ష్మీ, రామ్‌ కార్తీక్‌, పూజితా పొన్నాడ
Director: కిశోర్‌ కుమార్

టాలీవుడ్‌లో సస్పెన్స్ థిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ పెరుగుతున్నాయని గీతాంజలి, ఆనందో బ్రహ్మ చిత్రాలు నిరూపించాయి. ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా వస్తున్న ఈ రకం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా వచ్చిన చిత్రం వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ. రాయ లక్ష్మీ ప్రధాన పాత్రలో ఉండటంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా నటించిన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ కథ

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ కథ

బెల్లంపల్లి గ్రామంలో రమేష్, సురేష్ (మధునందన్, ప్రవీణ్) అల్లరి చిల్లరిగా తిరిగే యువకులు. గ్రామంలోని ప్రజలను నానా రకాలుగా వేధించి పబ్బం గడుపుకొంటుంటారు. ఇదిలా ఉండగా, పక్కగ్రామంలో ఉండే ఓ మాఫియా నాయకుడు చెల్లెలు గౌరీ (పూజిత పొన్నాడ)తో శేఖర్ (రామ్ కార్తీక్) లవ్‌లో పడుతాడు. కథ ఇలా సాగుతుంటే ఆ గ్రామంలోకి టీచర్ (రాయ్ లక్ష్మీ) ప్రవేశిస్తుంది. మాఫియా నాయకుడు ఓ పెట్టే కోసం ఓ ఆడిటర్‌ (బ్రహ్మాజీ) కుటుంబాన్ని చంపేస్తాడు. రమేష్, సురేష్‌ను మచ్చిక చేసుకొని మాఫియా నాయకుడు ఇంట్లోని పెట్టెను తీసుకురమ్మని వేధిస్తుంది.

సినిమాలో ట్విస్టులు

సినిమాలో ట్విస్టులు

మాఫియా నాయకుడి ఇంట్లో పెట్టెకు లక్ష్మీరాయ్‌కి ఉన్న సంబంధమేమిటి? శేఖర్ ప్రేమలో పడి గర్బవతి అయిన గౌరీ పరిస్థితి ఏమిటి? కరడుగట్టిన మాఫియా నేత తన చెల్లెలి వివాహానికి ఒప్పుకొన్నాడా? రమేష్, సురేష్ ఆ పెట్టెను తీసుకు రావడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు. ఆ పెట్టె వెనుక ఉన్న అసలు కథ ఏంటి? రాయ్ లక్ష్మీ టీచరేనా? లేక దయ్యామా? అనే ప్రశ్నలకు సమాధానమే వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ.

ఫస్టాఫ్ విశ్లేషణ

ఫస్టాఫ్ విశ్లేషణ

ప్రవీణ్, మధునందన్ అల్లరి చిల్లరి పనులతో వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ సినిమా సగం ముగుస్తుంది. వీరిద్దరి క్యారెక్టరైజన్ పేలవంగా, నాసిరకంగా ఉండటం వలన సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. కథను సాగదీసి సాగదీసి చివరకు ఇంటెర్వెల్‌కు ముందు రాయలక్ష్మి పాత్ర ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాంతోనైన ఏమైనా ఊరట లభిస్తుందా అని ఆశించిన ప్రేక్షకుడిపై మరింత భారం పడుతుంది. రాయ్ లక్ష్మీ‌ని అటు గ్లామర్ కోసం ఉపయోగించుకోవాలా? లేక ఫెర్మార్మెన్స్ కోసం వాడుకోవాలా అనే సందిగ్ధావస్థలో దర్శకుడు కొట్టుమిట్టాడుకొన్నట్టు కనిపిస్తుంది.

 సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక సెకండాఫ్‌లో నాటు, చాలా దారుణమైన కామెడీతో వెగటు పుట్టిస్తుంది. కథ, కథనాలు చాలా బలహీనంగా ఉండటం ఆడియెన్స్‌కు సినిమా చూడటం కఠినపరీక్షగా మారిందనే చెప్పవచ్చు. కొండంత రాగం తీసి అన్నట్టు చివరకు సాదాసీదా క్లైమాక్స్‌తో లక్ష్మీరాయ్ గురించి ఓ భయంకర వాస్తవం చెప్పి ఎండ్ కార్డేశాడు దర్శకుడు. ఎలాంటి పస లేకుండా వడ్డి వార్చిన వంటకం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ అని తేల్చేయడం జరుగుతుంది.

దర్శకుడి ప్రతిభ గురించి

దర్శకుడి ప్రతిభ గురించి

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే నాటు కామెడీ, నాలుగు రొమాంటిక్ సీన్లు ఉంటే సరిపోతుందనే ఆలోచనతో బలంగా ఉన్నట్టు కనిపించాడు. నాటు సీన్లనయినా మీనింగ్ ఫుల్‌గా రాసుకొంటే బాగుండేదేమో. ఈ సినిమాకు రాయ్ లక్ష్మిని ఒప్పించడమే దర్శకుడి సక్సెస్ అని చెప్పవచ్చు. నాసిరకమైన కథ, బలహీనమైన కథనం సినిమాకు శాపంగా మారాయని చెప్పవచ్చు. కాకపోతే సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులను కూడా మేనేజ్ చేసి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేశాడు. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటో దర్శకుడే చెప్పాల్సి ఉంటుందేమో.

గ్లామర్ పాత్రలో రాయ్ లక్ష్మీ

గ్లామర్ పాత్రలో రాయ్ లక్ష్మీ

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ రాయ్ లక్ష్మి. బలమైన పాత్రగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. అది నిస్సారంగా మార్చిన రోల్‌లో ఆమె కనిపించారు. పక్కన ఉండే పాత్రలు డామినేట్ చేయడం వల్ల తన పాత్ర అస్థిత్వాన్ని కోల్పోవడంతో రాయలక్ష్మీ ఏమి చేయలేకపోయింది. కమర్షియల్ వాల్యూస్ కోసం ఓ ఐటెం సాంగ్‌లో మెరవడం, బాత్రూం సీన్లు, అందాల ఆరబోయడం తప్పా గొప్పగా ఏం చేయలేకపోయింది.

రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ కెమిస్ట్రీ

రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ కెమిస్ట్రీ

రామ్ కార్తీక్, పూజిత పొన్నాడా జంటకు కొన్ని సీన్లలో రెచ్చిపోయి నటించారు. రామ్ కార్తీక్ ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశాడు. మంచి పాత్ర లభిస్తే న్యాయం చేయగలడనే ఫీలింగ్‌ను రామ్ కార్తీక్ కలిగించాడు. పూజిత పొన్నాడ కీలక సన్నివేశాల్లో మెప్పించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ జంట కెమిస్ట్రీ బాగుంది.

మధునందన్, ప్రవీణ్ నటన గురించి

మధునందన్, ప్రవీణ్ నటన గురించి

ఇక ఈ సినిమాకు బలం, బలహీనత కమెడియన్లు మధునందన్, ప్రవీణ్ (చంటి, పండు) అని చెప్పవచ్చు. చాలా నాటు పాత్రల్లో వీరిద్దరూ జీవించారని చెప్పవచ్చు. బేసిగ్గా వీరి పాత్రలను డిజైన్ చేయడంలోనే లోపం ఉంది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించే విధంగా రాసుకొని ఉంటే మధునందన్, ప్రవీణ్‌కు నటులుగా మంచి పేరు వచ్చే అవకాశం ఉండేది. నాటు, జుగప్సతో కూడిన కామెడీ వీరి ప్రతిభను మసకబారేలా చేసింది. పంకజ్ కేసరి విలనిజం పండలేదనే చెప్పవచ్చు. అరుపులు ఎక్కువ యాక్షన్ తక్కువగా ఉంది.

 సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు

ఇక సాంకేతిక విభాగాల పనితీరు అంతంత మాత్రమే అనిచెప్పవచ్చు. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రంలో కాస్త పాజిటివ్‌గా అనిపించేది హరిగౌర మ్యూజిక్. ఓ రొమాంటిక్ పాట బాగుంది. గోదావరి తీర అందాలను అద్బుతం అనిపించేలా సినిమాటోగ్రఫి ఉంది. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదనించేలా ఉన్నాయి. నిర్మాతలు శ్రీధర్ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సింది.

 ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఎలాంటి కొత్తదనం, ఆసక్తి కలిగించని విధంగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. టైటిల్‌లో తప్ప సినిమాలో పస కనిపించదు. రాయ్ లక్ష్మీ గ్లామర్ తప్పా ఏమీ కనిపించదు. దిగువ తరగతి ప్రేక్షకులకు నచ్చితే కొంతైనా కమర్షియల్ సక్సెస్ లభిస్తుందని చెప్పవచ్చు.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్‌ పాయింట్స్‌:
రాయ్‌ లక్ష్మి
మ్యూజిక్
రామ్ కార్తీక్, పూజిత కెమిస్ట్రీ

మైనస్‌ పాయింట్స్‌ :
పేలవమైన కథ, బలహీనమైన కథనం
దర్శకత్వం
ఎడిటింగ్

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: రాయ్‌ లక్ష్మీ, రామ్‌ కార్తీక్‌, పూజితా పొన్నాడ, ప్రవీణ్‌, మధు నందన్‌, పంకజ్ కేసరి, జబర్దస్త్ మహేష్
సంగీతం : హరీ గౌర
కథ: తాటవర్తి కిరణ్
ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్
దర్శకత్వం : కిశోర్‌ కుమార్
నిర్మాత : శ్రీధర్ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి
రిలీజ్ డేట్: 2019-03-15

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X