For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|
Whistle Movie Review And Rating || విజిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5
Star Cast: విజయ్, నయనతార, వివేక్, జాకీ ష్రాఫ్, కథిర్, యోగిబాబు
Director: అట్లీ

రాజప్ప (విజయ్) రౌడీ కుమారుడు మైఖేల్ ఉరఫ్ బిగిల్ (విజయ్) జాతీయ జట్టుకు ఆడాలనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తన కుమారుడు మైఖేల్ జాతీయ స్థాయిలో చాంఫియన్‌గా నిలిచి కప్పు సాధిస్తే చూడాలనే కోరికతో ఉంటాడు. అయితే ఉన్నతమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మారే అవకాశం ఉన్న మైఖేల్ జీవితంలో చోటు చేసుకొన్న కొన్ని కారణాల వల్ల తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రౌడీగా మారుతాడు.

 విజిల్‌లో ట్విస్టులు

విజిల్‌లో ట్విస్టులు

తండ్రి రాజప్ప రౌడీయిజం బాటలో మైఖేల్ ఎందుకు నడవాలని నిర్ణయం తీసుకొన్నాడు? ఫుట్‌బాల్ క్రీడను మైఖేల్ వదిలేయాల్సినంత అవసరం ఏం వచ్చింది. రౌడీగా మారిన బిగిల్ తన లక్ష్యాన్ని అందుకొన్నాడా? రౌడీయిజం కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న మైఖేల్ మళ్లీ ఫుట్‌బాల్ కోచ్‌గా మారాడు. ఫుట్ బాల్ సెలక్షన్ బోర్డు అధికారి (జాకీ ష్రాఫ్) పాత్ర ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లింది. కోచ్‌గా తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాడు. బిగిల్ జీవిత ప్రయాణంలో నయనతార పాత్ర ఏమిటి? ఈ చిత్రంలో ఎమోషనల్‌ అంశాలు తెరపైన ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే విజిల్ సినిమా కథ.

ఫస్టాఫ్‌ విశ్లేషణ

ఫస్టాఫ్‌ విశ్లేషణ

కాలేజీని కబ్జా చేసిన రాజకీయ నాయకుడిని ఎదురించే విద్యార్థుల అంశంతో కథ ఆసక్తిగా ప్రారంభమవుతుంది. రెగ్యుల్ మాస్ అంశాలతో విజయ్ ఎంట్రీ.. ఆయన మార్కు పంథాతో విద్యార్థుల సమస్యకు ముగింపు పలకడం లాంటి అంశాలతో తొలి భాగం రొటీన్‌గా నడుస్తుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు రాజప్ప‌పై జరిగే ఎటాక్ సీన్ కథా గమనాన్ని మార్చివేస్తుంది. మైఖేల్ ఫ్యాష్ బ్యాక్ ఓపెన్ కావడం బిగిల్ కాస్తా కోచ్‌గా మారడం చకచకా జరిగిపోతాయి. దాంతో రోటీన్‌గా సినిమా తొలి భాగం ముగుస్తుంది.

 సెకండాఫ్‌ విశ్లేషణ

సెకండాఫ్‌ విశ్లేషణ

ఇక రెండో భాగంలో ఎమోషనల్ అంశాలకు పెద్ద పీట వేశారు. ఫుట్‌బాల్ క్రీడాకారిణి యాసిడ్ దాడికి గురికావడం, అలాగే మరో క్రీడాకారిణిని ఆటకు దూరమైన కావడం అనే అంశాలు హృదయాన్ని టచ్ చేసేలా ఉంటాయి. జాకీ ష్రాఫ్ వేసే ఎత్తులకు బిగిల్ పైఎత్తులు వేస్తూ తన లక్ష్యాన్ని చేరుకొన్నారు. తనకు ప్రతికూలంగా వ్యవహరించిన జట్టు సభ్యులను తనదారికి ఎలా తెచ్చుకొన్నాడనే అంశాలు సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లేలా ఉంటాయి. చివర్లో తండ్రి చిరకాల కోరికను నెరవేర్చి.. తండ్రి మరణానికి కారణమైన క్రీడాధికారి జాకీ ష్రాఫ్‌కు ఎలాంటి శిక్ష పడేలా చేశాడనేది సెకండాఫ్‌లో మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటాయి.

దర్శకుడు అట్లీ మరోసారి

దర్శకుడు అట్లీ మరోసారి

దర్శకుడు అట్లీ మరొసారి విజయ్ స్టామినా, క్రేజ్, మాస్ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభిమానులు అంచనాలకు అనుగుణంగా స్క్రిప్టు రాసుకొన్నారు. ఇక తొలి భాగంలో ఓ ట్రిక్కీ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతుంది. తన మార్కు కథనంతో సినిమాపై ఆసక్తిని రేపడంలో సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్‌లో భావోద్వేగమైన అంశాలను జొప్పించి కథను మరింత ఎమోషనల్‌గా మార్చడంలో సక్సెస్ అయ్యాడు. ఓ స్పోర్ట్స్ డ్రామాకు సామాజిక అంశాలను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విజిల్‌ను మాస్ ఎంటర్‌టైనర్‌గా మార్చడంలో తన మార్కు చూపించాడు.

విజయ్ ఫెర్ఫార్మెన్స్

విజయ్ ఫెర్ఫార్మెన్స్

ఇక విజయ్‌కి చాలా రకాల షేడ్స్ ఉన్న పాత్ర లభించింది. తండ్రి రాజప్పగా, అలాగే మైఖేల్‌గా, బిగిల్‌గా అనేక కోణాల్లో కనిపిస్తాడు. అలాగే రౌడీగా, ప్రేమికుడిగా తన స్టయిల్ తడాఖా చూపించాడు. మాస్ సీన్లను ఇరగదీశాడు. ప్రేక్షకులను ఆలోచింపజేసేలా డైలాగ్స్‌ చెప్పి తన అభిమానులను కూడా ఫుల్లుగా సంతృప్తి పరిచారని చెప్పవచ్చు. తొలిభాగంలో రాజప్పగా.. సెకండాఫ్‌లో బిగిల్‌గా అదరగొట్టాడు. దీపావళీ పండగకు మాస్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించాడనే చెప్పవచ్చు.

నయనతార గురించి

నయనతార గురించి

విజిల్ చిత్రంలో నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదు. సోలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో దుమ్మురేపుతున్న ఈ అందాల భామ సాదాసీదా పాత్రలో నటించింది. విజయ్‌కి ప్యాడింగ్ ఆర్టిస్టుగా పాటలకు, కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. విజయ్ దూకుడు ముందు నయనతార ఫెర్ఫార్మెన్స్ పెద్దగా హైలెట్ కాలేదు. కొన్ని సీన్లలో మాత్రమే ఆమె కనిపించింది. రొమాన్స్‌కు ఎక్కువగా స్కోప్ లేకుండా పోయింది.

సాఫ్ట్ విలన్‌గా జాకీ ష్రాఫ్

సాఫ్ట్ విలన్‌గా జాకీ ష్రాఫ్

ఇక విజిల్‌లో సాఫ్ట్ విలన్‌గా జాకీ ఫ్రాఫ్ కనిపించారు. తన మార్కును ప్రదర్శిస్తూ కొత్త రకంగా ప్రదర్శించిన విలనిజం ఆకట్టుకోలేకపోయింది. తన పాత్రలో బలమైన అంశాలు లేకపోవడం వల్ల జాకీ ష్రాఫ్ పాత్ర ఫెర్ఫార్మెన్స్‌ను పండించేందుకు స్కోప్ లేకపోయింది. ఇక మిగితా వారు వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

మ్యూజిక్, సినిమాటోగ్రఫి

మ్యూజిక్, సినిమాటోగ్రఫి

విజిల్ సినిమా సాంకేతిక అంశాల్లో హైలెట్‌గా ఉన్నవి సినిమాటోగ్రఫి, మ్యూజిక్. జీకే విష్ణు అందించిన విజువల్స్ బాగున్నాయి. ఎరుపు రంగు ఫ్లేవర్‌తో చిత్రీకరించిన సీన్లు ప్రేక్షకులకు ట్రీట్‌గా మారాయి. ఫుట్‌బాల్ సీన్ల చిత్రీకరణ హైరేంజ్‌లో ఉన్నాయి. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. సినిమాకు రీరికార్డింగ్ స్పెషల్ ఎట్రాక్షన్. వెర్రెక్కిద్దాం అనే పాట బాగుంది.

టెక్నికల్ టీమ్ పనితీరు

టెక్నికల్ టీమ్ పనితీరు

మిగితా సాంకేతిక విభాగాల్లో రుబెన్ ఎడిటింగ్ పనితీరు ఒకేలా ఉంది. ఇంకా కొంత నిడివి తగ్గించడానికి స్కోప్ ఉంది. యాక్షన్ సీన్లు, స్టంట్ కొరియోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. వీఎఫెఎక్స్ గ్రాఫిక్స్ క్వాలిటీ బాగుంది. స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించిన తీరు ప్రొడక్షన్ యూనిట్ అభిరుచికి అద్దం పట్టింది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

మాస్, ఎమోషనల్ అంశాలను జొప్పించి దర్శకుడు అట్లీ, సూపర్‌స్టార్ విజయ్ అందించిన స్పోర్డ్స్ డ్రామా విజిల్. ఈ సినిమా తొలిభాగం రొటీన్‌గా నడిచినా సెకండాఫ్‌లో ఎమోషనల్ అంశాలు జతకావడం సినిమాకు బలంగా మారింది. మాస్ ప్రేక్షకులు, దీపావళీ పండుగ సీజన్‌ను టార్గెట్‌గా చేసుకొని అందించిన భావోద్వేగమైన మూవీ అని చెప్పవచ్చు. ఈ చిత్రం తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించడానికి అవకాశం ఉంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

విజయ్ ఫెర్ఫార్మెన్స్

సినిమాటోగ్రఫి

ఏఆర్ రెహ్మన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సెకండాఫ్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ రొటీన్‌గా ఉండటం

పాటలు బాగాలేవు

సినిమా నిడివి ఎక్కువగా ఉండటం

తెర వెనుక తెర ముందు

తెర వెనుక తెర ముందు

విజయ్, నయనతార, వివేక్, జాకీ ష్రాఫ్, కథిర్, యోగిబాబు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అట్లీ

నిర్మాత: మహేష్ కోనేరు

మ్యూజిక్: ఏఆర్ రెహ్మన్

సినిమాటోగ్రఫి: జీకే విష్ణు

ఎడిటింగ్: రుబెన్

ప్రొడక్షన్: ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్

రన్‌టైమ్: 179 నిమిషాలు

బడ్జెట్: 180 కోట్లు

రిలీజ్: 2019-10-25

English summary
Whistle movie review: Thalapathy Vijay's Whistle movie set to release world wide on October 25th. This movie made Rs.138 crores business. In AP 10 crores business happend. Producer Mahesh Koneru is releasing this movie in Telugu states.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more