With Love First Review: విత్ లవ్ మూవీ ఫస్ట్ రివ్యూ
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పసిలియాన్ నిర్ామతలుగా జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం విత్ లవ్ (With Love). ఈ చిత్రంలో అభిషాన్ జీవింత్, అనశ్వర రాజన్, హరీష కుమార్, కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేనీ మురుగన్, శరవణన్ నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు మాదన్ దర్శకత్వం వహించారు.
ఇక శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫి, సురేష్ కుమార్ ఎడిటింగ్, ఏ సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు చెన్నైలో ప్రదర్శించారు. సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాకు యూ (U16+) సర్టిఫికెట్ జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు చూడొచ్చు. అంతకంటే తక్కువగా ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ జారీ సమయంలో నిబంధనలు వెల్లడించారు. ఈ సినిమా నిడివి సుమారుగా 140 నిమిషాలు అంటే.. 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ సినిమా ప్రీమియర్లు చెన్నైలో గ్రాండ్‌గా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రావడంతో మీడియా అటెన్షన్, అలాగే సినీ ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. దాంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో సానుకూలంగా బాక్సాఫీస్ రన్ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇక సినిమా దర్శకుడు మదన్ కథ చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకొన్నది. కామెడీ సూపర్బ్‌గా వర్కువుట్ అయింది. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్లు గుండెను పిండేశాయి. ఒకే ఒక సీన్ చాలా ప్రభావం చూపించేలా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా సినిమాలు చూశాను. కానీ అలాంటి సన్నివేశాన్ని మాత్రం చూడలేదని పలువురు నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్‌గా థియేటర్‌లో రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











