With Love Twitter Review: విత్ లవ్ తెలుగు మూవీ ట్విట్టర్ రివ్యూ
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పసిలియాన్ నిర్ామతలుగా జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం విత్ లవ్ (With Love). ఈ చిత్రంలో అభిషాన్ జీవింత్, అనశ్వర రాజన్, హరీష కుమార్, కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేనీ మురుగన్, శరవణన్ నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు మాదన్ దర్శకత్వం వహించారు.
ఇక శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫి, సురేష్ కుమార్ ఎడిటింగ్, ఏ సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు చెన్నైలో ప్రదర్శించగా, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో భారీగా సినీ అభిమానులు వీక్షించారు. ఈ సినిమా ప్రదర్శన అనంతరం మూవీ చాలా బాగుంది అంటూ రజనీ కామెంట్ చేశారు. ఈ ప్రీమియర్ షో తర్వాత నెటిజన్లు, క్రిటిక్స్ తమ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను, రివ్యూలను పోస్ట్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

విత్ లవ్ సినిమా రేపటి నుంచి థియేటర్లలో ఆడియెన్స్ గుండెలు పిండేస్తుంది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ యాక్టర్‌గా మారి నటించిన చిత్రం. ఈ సినిమాలో ఆయనకు జతగా అనశ్వర రాజన్ నటించింది. మాధన్ దర్శకత్వం వహించగా, సీన్ రోల్డెన్ సంగీతం అందించారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
విత్ లవ్ సినిమా చూశాను. వాలంటై్ వీక్ సమయంలో లవ్లీ రొమాంటిక్ కామెడీ మూవీ. ఫస్టాఫ్‌లో మంచి హ్యుమర్ ఉంటుంది. సెకండాఫ్‌లో కథ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. అనశ్వర రాజన్ యాక్టింగ్ బాగుంది. ఈ వారాంతంలో సినిమా చూడాలంటే.. ఈ మూవీని ఎంచుకోవచ్చు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
విత్ లవ్ సినిమా ప్రేమానుభూతులను నింపి రూపొందించారు. చిట్టచివరి సారిగా తన హైస్కూల్‌లో అమితంగా ఇష్టపడే ఫ్రెండ్‌ను కలువాలని చేసే జర్నీగా ఈ సినిమా రూపొందింది. ఎప్పటికీ మనసులో దాచుకొనే మంచి గ్రీటింగ్ కార్డు లాంటి సినిమా. మధుర అనుభూతలను పంచే పర్సనల్ డైరీ అంటూ సుదీర్ఘమైన రివ్యూను నెటిజన్ రాశాడు.
జీవితంలోని ఎన్నో విషయాలను గుర్తు చేసే విధంగా ఉన్న ఫెంటాస్టిక్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ తమ ఫస్ట్ లవర్స్‌ను కలుసుకొనేందుకు చేసే జర్నీలో వారిద్దరూ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఫస్ట్ లవ్ వర్సెస్ ప్రజెంట్ లవ్. ఈ సినిమా చాలా ఫ్రెష్‌గా, ఫన్, లైఫ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసే విధంగా ఉంటుంది. అభిషాన్ జీవింత్ తొలి చిత్ర నటుడిగా అదరగొట్టాడు. అనశ్వర రాజ్ గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. సీన్ రొనాల్డ్ మంచి ఫీల్‌తో సాగే బీజీఎంను అందించారు. మాధన్ మంచి రొమాంటిక్ సినిమాను అందించారు అని క్రిటిక్ రమేష్ బాలా అన్నారు.


Click it and Unblock the Notifications











