twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    World Famous Lover రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    World Famous Lover Review And Rating | Filmibeat Telugu

    Rating:
    3.0/5
    Star Cast: విజయ్ దేవరకొండ,రాశీఖన్నా,ఐశ్వర్య రాజేశ్,క్యాథరీన్ త్రెసా
    Director: క్రాంతి మాధవ్

    పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ తన స్టార్ ఇమేజ్‌ను పెంచుకొంటూ టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయారు. అయితే ఇటీవల ఆయన సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించినా.. బ్లాక్‌బస్టర్ రేంజ్ హిట్టును సాధించలేకపోయాయి. అయితే విజయ్ దేవరకొండ నటనపై ఎలాంటి ప్రతికూల కామెంట్లు రాకపోవడం గమనార్హం. స్టార్ స్టేటస్‌ను పెంచుకొనే క్రమంలో విజయ్ చేసిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. మళ్లీ మళ్లీ రానిరోజు లాంటి ఫీల్ గుడ్ సినిమాను అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ మళ్లీ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి హిట్టును సొంతం చేసుకొన్నారా? క్రాంతి మాధవ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మళ్లీ పనిచేసిందా అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    వరల్డ్ ఫేమస్ లవర్ కథ

    వరల్డ్ ఫేమస్ లవర్ కథ

    రచయితగా కావాలనుకొని ఆ కలతో బతికే గౌతమ్ (విజయ్ దేవరకొండ) తాను పనిచేసే కార్పోరేట్ ఉద్యోగాన్ని వదులుకొంటాడు. అయితే తన లివింగ్ పార్ట్‌నర్ యామిని (రాశీఖన్నా) తో గౌతమ్‌కు విభేదాలు తలెత్తడంతో బ్రేకప్ జరుగుతుంది. కానీ యామిని అంటే గౌతమ్‌కు చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. యామిని ప్రేమ కోసం పరితపించినప్పటికీ.. ఆమె ప్రేమను, సాన్నిహిత్యాన్ని పొందలేకపోతాడు.

    వరల్డ్ ఫేమస్ లవర్ కథలో ట్విస్టులు

    వరల్డ్ ఫేమస్ లవర్ కథలో ట్విస్టులు

    రచయితగా గౌతమ్ ఏ మేరకు రాణించాడు? బ్రేకప్ తర్వాత యామిని ప్రేమను పొందడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు బెడిసికొట్టాయి? చివరకు ఏ విధంగా యామిని ప్రేమను సొంతం చేసుకొన్నాడు? కథకు ఇల్లందు ట్రేడ్ యూనియన్ లీడర్ శ్రీను ( విజయ్ దేవరకొండ), సువర్ణ(ఐశ్వర్య రాజేశ్), స్మిత (క్యాథరీన్ త్రెసా) పాత్రలు ఏ విధంగా భాగమయ్యాయి. అలాగే పైలెట్ ఇజా (ఇజబెత్ లీటీ)కి గౌతమ్‌కు ఎలాంటి రిలేషన్ ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానమే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    జీవితంపై అసంతృప్తితో రగిలే గౌతమ్, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి ప్రియుడు తనకు దూరమవుతున్నారనే బాధలో యామిని సంఘర్షణతో వరల్డ్ ఫేమస్ లవర్ కథ మొదలవుతుంది. గౌతమ్, యామిని బ్రేకప్ తర్వాత కథలో ఎలాంటి ఎమోషన్స్ చోటుచేసుకొన్నాయి. రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టిన గౌతమ్‌కు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. యామిని ప్రేమను పొందడానికి గౌతమ్ పడిన తపన తొలిభాగంలో కనిపిస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక సెకండాఫ్‌లో ప్యారిస్‌లో రేడియో కంపెనీ అధినేతగా.. ఇజాతో భావోద్వేగమైన ప్రేమకథ వరల్డ్ ఫేమస్ మూవీ సినిమాకు కీలకంగా మారుతాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సాగే ఎమోషనల్ డ్రైవ్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. కాకపోతే క్రాంతి మాధవ్ స్టయిల్ ఆఫ్ స్టోరి టెల్లింగ్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కథను నిదానంగా అరటిపండు ఒలిచిపెట్టే తీరు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది.

    క్రాంతి మాధవ్ డైరెక్షన్

    క్రాంతి మాధవ్ డైరెక్షన్

    దర్శకుడిగా క్రాంతి మాధవ్ తన కలానికి మరోసారి పదును పెట్టారని చెప్పవచ్చు. కథలో ప్రతీ ఎపిసోడ్‌ను హృదయానికి హత్తుకునే అంశాలను జొప్పించి తెరకెక్కించడం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. అలాగే తెలంగాణ యాసలో రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకున్నాయి. ఇక చివర్లో కథను మరో రేంజ్‌కు చేరవేయడానికి చేసిన ప్రయత్నం భేష్‌గా ఉంది. ఇల్లందు ఎపిసోడ్ దర్శకుడిగా ఆయన పరిణితి స్పష్టంగా కనిపించింది. కాగితం, కలం పనిచేయకపోతే ప్రపంచమే ఉండదు లాంటి డైలాగ్స్ ఆకట్టుకొంటాయి.

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    ఇక విజయ్ దేవరకొండ మరోసారి తెర మీద అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. రకరకాల షేడ్స్, గెటప్స్, హావభావాలు పలికే పాత్రలో ఒదిగిపోయాడు. విజయ్ దేవరకొండ కంటే గౌతమ్‌గానే ఆకట్టుకొంటాడు. గౌతమ్ జర్నీలో ఉండే ఎమోషనల్ కంటెంట్‌లో పరకాయ ప్రవేశం చేశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. సహజసిద్ధమైన నటన విజయ్ ఆయుధం.. ఆ వెపన్‌తోనే ప్రేక్షకులను టార్గెట్ చేసి సఫలమయ్యాడని చెప్పవచ్చు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో ఫైట్ సీన్ తర్వాత, క్లైమాక్స్‌లో స్టేజి మీద మాట్లాడే సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి. అలాగే కంటతడి పెట్టించేలా ఉంటాయి. గౌతమ్‌గా విజయ్ దేవరకొండ మరో రేంజ్ నటనా విశ్వరూపం అని చెప్పవచ్చు.

    రాశీఖన్నా నటన

    రాశీఖన్నా నటన

    ఇప్పటి వరకు గ్లామర్ డార్లింగ్‌గానే రాశీఖన్నాను చూశాం. తొలి ప్రేమ తర్వాత నటనలో ఆమె కాన్ఫిడెన్స్ మరింత పెరిగిపోయింది. యామిని పాత్రలో తన రేంజ్‌కు మించిన నటనను ప్రదర్శించి అందర్ని ఆశ్చర్య పరిచింది. భావోద్వేగమైన సన్నివేశాల్లో రాశీ ఖన్నా పలికించిన ఎమోషన్స్ బాగున్నాయని చెప్పవచ్చు. ఇక ఎలాంటి గ్లామర్‌కు ఆస్కారం లేని 100 శాతం నటనకు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది. వరల్డ్ ఫేమస్ లవర్‌లో కొత్త రాశీఖన్నాను ప్రేక్షకులు చూడటానికి అవకాశం లభించింది.

    ఐశ్వర్య, ఇజబెల్లే యాక్టింగ్

    ఐశ్వర్య, ఇజబెల్లే యాక్టింగ్

    మిగితా హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇల్లందు ఎపిసోడ్‌లో ఐశ్వర్య రాజేశ్ నేచురల్‌ యాక్టింగ్‌తో మెప్పించింది. పక్కా డీ గ్లామర్ రోల్‌ సువర్ణ పాత్రలో ఒదిగిపోయింది. గ్రామీణ యువతి పాత్రలో ఎమోషనల్ సీన్లలో ఇరదగీసిందని చెప్పవచ్చు. ఇక శ్రీను, సువర్ణ ఎపిసోడ్‌లో ఐశ్వర్య ఒక వంతు అధిక్యాన్ని ప్రదర్శించేలా నటించింది. మోడరన్ డ్రస్‌లో ఐశ్వర్య రాజేశ్ నటన పీక్స్ అనిచెప్పవచ్చు. ఇజాగా ఇజబెల్లే తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    ఇక ఇతర పాత్రల్లో ఆనంద చక్రపాణి విజయ్ దేవరకొండ తండ్రిగా కనిపించాడు. అతిథి పాత్ర అయినప్పటికీ గుర్తుండిపోతుంది. విలన్ టచ్ ఉన్న పాత్రలో శత్రు తన మార్కును చూపించాడు. రాశీఖన్నా తండ్రి జయ ప్రకాశ్ మరోసారి ఆకట్టుకొన్నాడు. ఇక ప్రియదర్శి సినిమాలో కీలక పాత్రలో మెప్పించాడు. కథకు అవసరమైన కొన్ని పాత్రల్లో నటించిన వారు కూడా ఫర్వాలేదనిపించారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    సాంకేతిక అంశాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనేది గోపి సుందర్ రీరికార్డింగ్. పాటలు ఒకే అనిపించేలా ఉన్నాయి. ఎమోషనల్ సీన్లను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్ తీసుకుపోవడంలో గోపి సుందర్ తన మార్క్ చూపించారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా జయకృష్ణ గుమ్మడికి చేతినిండా పని దొరికింది. ఇల్లందు లాంటి గ్రామీణ వాతావరణాన్ని, ప్యారిస్ లాంటి యూనివర్సల్ అర్బన్ ఎన్విరాన్‌మెంట్‌ను చక్కగా కెమెరాలో ఒడిసిపట్టుకొన్నారు. ఇక కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌కు ఇంకా స్కోపు ఉంది.

    క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ వాల్యూస్

    క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ వాల్యూస్

    ఉత్తమ చిత్రాలు, ప్రజాదరణ చిత్రాలు టాలీవుడ్‌లో రూపొందించడంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌కు ఓ హిస్టరీ ఉంది. మారుతున్న పరిస్థితులను బేరిజు వేసుకొని మంచి ఫీల్‌గుడ్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నటీనటుల ఎంపిక, బడ్జెట్‌ పరంగా పలు జాగ్రత్తలు తీసుకొన్నట్టు తెరమీద స్పష్టంగా కనిపించింది. సీసీ బ్యానర్‌లో ఈ చిత్రం మంచి సినిమా అవుతుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    విజయ్ దేవరకొండ, రాశీఖన్నా అవార్డు విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్‌‌తో రూపొందిన చిత్రం World Famous Lover చిత్రం. అయితే లవ్, రొమాంటిక్, యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యూత్‌కు కావాల్సిన అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి. స్లో నేరేషన్, ఎడిటింగ్, సినిమా నిడివి అంశాలు ఈ సినిమాకు మైనస్‌గా అనిపిస్తాయి. ఇక బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బ్లాక్‌బస్టర్ మూవీగా మారే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్
    రాశీఖన్నా యాక్టింగ్
    కథ, కథనాలు
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్
    స్లో నేరేషన్
    లెంగ్త్ అండ్ ఎడిటింగ్

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, క్యాథరీన్ త్రెసా, ఇజబెల్లే లీటే, ఆనంద చక్రపాణి, శత్రు తదితరులు
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: క్రాంతి మాధవ్
    నిర్మాత: కేఏ వల్లభ, కేఎస్ రామారావు
    మ్యూజిక్: గోపిసుందర్
    సినిమాటోగ్రాఫర్: జయకృష్ణ గుమ్మడి
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
    రిలీజ్ డేట్: 2020, ఫిబ్రవరి 14

    English summary
    World Famous Lover mov Review: Vijay Deverkonda's latest move World Famous Lover released on Feb 14. raashi khanna, aishwarya rajesh, Catherine tresa, Izabelle Leite are in female leads.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X