twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Enugu movie review ఆకట్టుకొన్న అరుణ్ విజయ్.. హరి మార్కు యాక్షన్ థ్రిల్లర్

    |

    Rating:
    3.0/5

    నటీనటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి,కేజీఎఫ్ రామచంద్రరాజు తదితరులు
    దర్శకత్వం: హరి
    నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
    మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్
    సినిమాటోగ్రఫి: ఎస్ గోపినాథ్
    ఎడిటర్: ఆంథోని
    రిలీజ్ డేట్: 2022-07-01

     ఏనుగు కథ ఏమిటంటే?

    ఏనుగు కథ ఏమిటంటే?

    కాకినాడ ప్రాంతంలో పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. పీవీఆర్ కుటుంబానికి, తన సవతి తల్లి కొడుకులు (సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)‌కు రవి (అరుణ్ విజయ్) కొండంత బలంగా ఉంటాడు. సముద్రం కుటుంబానికి చెందిన లింగం (కేజీఎఫ్ గురుడ రామ్)‌తో రవికి వైరుధ్యం ఉంటుంది. ఈ క్రమంలో తన అన్న (సముద్రఖని) కూతురు దేవీ (అమ్ము అభిరామి) ముస్లిం యువకుడితో లేచిపోతుంది.

    ఏనుగు కథలో ట్విస్టులు

    ఏనుగు కథలో ట్విస్టులు

    సముద్రం, పీఆర్వీ కుటుంబానికి వైరుధ్యం ఎందుకు ఏర్పడింది? ఈ రెండు కుటుంబాలు పగ, పత్రీకారంతో ఎందుకు చెలరేగిపోతాయి. తొలి చూపులోనే ఇష్టపడిన క్రిస్టియన్ యువతి (ప్రియా భవానీ శంకర్) తో రవి ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది? ప్రేమించిన వ్యక్తితో అన్న కూతురు లేచిపోవడంతో రవి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?. తన తండ్రి మరణం కుటుంబంలో ఎలాంటి చిచ్చు పెట్టింది? తనను చంపాలని పథకం వేసిన అన్న (సముద్రఖని)కి ఎలాంటి గుణపాఠం నేర్పాడు. తన అన్న కూతురు ఎత్తికెళ్లిన లింగంలో మార్పుకు రవి ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏనుగు కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఏనుగు సినిమాలోని పలు రకాల క్యారెక్టర్లు, వాటి క్యారెక్టరైజేషన్లను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకోవడంతో సినిమా అసలు కథ చెప్పడానికి సగభాగం అయిపోతుంది. కాకపోతే కథను ఎస్టాబ్లిష్ చేయడానికి అనుసరించిన విధానం బాగుంది. స్లోగా, నింపాదిగా కథను ముందుకు తీసుకెళ్లడంతో సినిమా నిడివి ఎక్కువ అనిపిస్తుంది. గ్రామంలో కక్షలు, ప్రతీకారం లాంటి అంశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. పీఆర్వీ కుటుంబంలో చీలికలు రావడం లాంటి ఎమోషనల్‌ అంశంతో కథ ముగుస్తుంది.

    సెకండాఫ్‌లో అసలు కథ..

    సెకండాఫ్‌లో అసలు కథ..

    ఏనుగు సినిమా అసలు కథ రెండో భాగంలో మొదలవుతుంది. తన అన్న కూతురు ముస్లిం యువకుడితో లేచిపోయిన అంశం సినిమాను ముందుకు డ్రైవ్ చేసేలా చేస్తుంది. కుటుంబ కలహాలు, వైరి వర్గంతో పగ లాంటి అంశాలు సబ్ ప్లాట్‌గా మారుతాయి. రవి తండ్రి మరణించిన సీన్ గుండెను పిండి వేస్తుంది. అలాగే తన అన్న కూతురు చిన్నారిని లింగం కిడ్నాప్ చేసిన సీన్ సినిమాకు హైలెట్‌గా మారుతుంది. సెకండాఫ్‌లో ట్విస్టులు, భావోద్వేగాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. అయితే ఈ సినిమా నిడివి కథలోని బలాన్ని నిరసించేలా చేసింది. కనీసం 20 నిమిషాల నిడివి తగ్గిస్తే.. మరింత ఫీల్‌గుడ్ పెరగడమే కాకుండా మంచి ఎమోషన్స్‌ కూడా పండిస్తుంది.

    అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ గురించి

    అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ గురించి

    రవి పాత్రలో అరుణ్ విజయ్ చక్కగా ఒదిగిపోయాడు. ఇప్పటి వరకు ఓ రేంజ్ హీరోగా ముద్ర వేసుకొన్న అరుణ్.. ఈ చిత్రంలో పలు రకాల వేరియేషన్స్‌ ఉన్న పాత్రను తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో దడదడలాడించాడు. యాక్షన్ సీన్లలో చెలరేగిపోయాడు. ఇక హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. కథలో కూడా కీలకంగా మారిన పాత్రను తనదైన శైలిలో నటించి మెప్పించింది.

    సముద్రఖని పవర్‌ఫుల్ పాత్రలో

    సముద్రఖని పవర్‌ఫుల్ పాత్రలో

    ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే.. సముద్రఖని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అంతేకాకుండా సినిమాకు వెన్నుముకగా మారిన పాత్రను అద్బుతంగా పోషించాడు. సెకండాఫ్‌లో అరుణ్ విజయ్, సముద్రఖని పాత్రల మధ్య పోటీ ఆకట్టుకొనేలా ఉంటుంది. రాధిక శరత్ కుమార్, ఐశ్వర్య, లింగంగా గరుడ రామ్ ఆకట్టుకొన్నాడు. ఇక యోగి బాబు కామెడీ సినిమాకు మరో హైలెట్. ఫస్టాఫ్‌లో సాగదీత అనిపిస్తున్న క్రమంలో యోగి బాబు పేల్చిన డైలాగ్స్ థియేటర్లో నవ్వులపూలు పూయించాయి.

     టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపినాథ్ అందించిన విజ్వుల్ గ్రాండ్‌గా ఉన్నాయి. యాక్షన్ సీన్లు, సముద్ర తీరం అందాలు, బోట్ చేజింగ్స్‌ను అద్బుతంగా చిత్రీకరించాడు. ఎడిటర్‌కు ఇంకా చాలా పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. హరి మార్కు టేకింగ్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అత్యంత బలంగా మారాయి. సెకండాఫ్‌లో ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్లు పవర్‌ఫుల్‌గా ఉంటాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    అరుణ్ విజయ్, సముద్ర ఖని ఫెర్ఫార్మెన్స్
    ప్రియా భవానీ శంకర్ గ్లామర్
    హరి టేకింగ్, స్క్రీన్ ప్లే
    డైలాగ్స్, యోగి బాబు కామెడీ

    మైనస్ పాయింట్స్
    రొటీన్, రెగ్యులర్ కథ
    ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండకపోవడం
    సినిమా నిడివి

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    లవ్, యాక్షన్, థ్రిల్లింగ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసి రూపొందించిన చిత్రం ఏనుగు. గతంలో సూర్యతో సింగం లాంటి పోలీస్ కథా నేపథ్యంతో చిత్రాలను అందించిన హరి ఈ సారి తనదైన స్టయిల్లోనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్, హరి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. వారాంతంలో మంచి సినిమాను చూడాలనుకొనే వారికి ఏనుగు మంచి అనుభూతిని పంచుతుంది.

    English summary
    Director Hari and Actor Arun Vijay's Enugu movie hits the theatres on July 1st. Here is the exclusive review for Filmibeat Telugu audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X