Yamadheera Review: క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా మెప్పించాడా? యమధీర సినిమా సమీక్ష

Rating: 2.5/5

నటీనటులు: కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషికా శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్ తదితరులు
కథ, దర్శకత్వం: R శంకర్
నిర్మాత: వేదాల శ్రీనివాసరావు
మ్యూజిక్: వరుణ్ ఉన్నీ
సినిమాటోగ్రఫి: రోష్ మోహన్ కార్తీక్
ఎడిటింగ్: C రవిచంద్రన్
డైలాగ్స్, లిరిక్స్: వరదరాజ్ చిక్కబళ్లాపుర
బ్యానర్ం శ్రీ మందిరం ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-03-23

నీతి, నిజాయితీ, విధి నిర్వాహణలో రాజీ పడని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కేపీ గౌతమ్ (కోమల్ కుమార్). అయితే అన్యాయాలు, అక్రమాలు సహించకపోవడంతో తన కెరీర్‌లో పలు చోట్లకు ట్రాన్స్‌ఫర్లు కావడం జరుగుతుంది. ఆ క్రమంలోనే వైజాగ్ కమిషనర్‌గా వస్తాడు. అయితే మిస్టరీగా మారిన ఓ యువకుడి మరణంపై కేసు రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేపడుతాడు. ఆ యువకుడి మరణం వెనుక అజర్‌బైజాన్‌లో ఉండే దేశ్‌ముఖ్ (శ్రీశాంత్) కారణమని తెలుసుకొంటాడు.

Yamadheera Movie Review

యువకుడి మరణంపై కేసును కేపీ గౌతమ్ ఎందుకు రీ ఓపెన్ చేయాల్సి వచ్చింది? ఆ యువకుడి మరణానికి దేశ్‌ముఖ్ కారణమని తెలిసిన తర్వాత ఆయన చేశాడు. అజర్‌బైజాన్‌లో ఉండే దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్‌కు ఎలా సీఎం అయ్యాడు? ఉన్నతాధికారి (నాగబాబు) నుంచి గౌతమ్‌కు ఎలాంటి సపోర్ట్ లభించింది? ఏపీ సీఎంకు హత్య కేసుకు సంబంధం ఉందని తెలిసి పోలీసు విభాగం ఏం చేసింది? ఈ కేసు విచారణ ఎలా జరిగింది? సీఎం దేశ్‌ముఖ్ అరాచకాలకు ఎలా ముగింపు పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే యువధీర సినిమా కథ.

మర్డర్ మిస్టరీతో సాగే పొలిటికల్ థ్రిల్లర్‌ను కన్నడలో నిర్మించారు. అయితే తెలుగు నేటివిటికి ఏ మాత్రం తగ్గకుండా డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే దర్శకుడు రాసుకొన్న పాయింట్‌ రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ..ఈవీఎం టాంపరింగ్ అనే పాయింట్ కొత్తదానాన్ని తెచ్చిపెట్టింది. దర్శకుడు కథ నడిపించిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. అయితే కథ సాగదీసినట్టు అనిపించినప్పటికీ.. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరకు గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన విధానం ఫర్వాలేదనిపిస్తుంది.

సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మోహన్ కార్తీక్ సినిమాటోగ్రఫి, వరుణ్ మ్యూజిక్ విభాగాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. అక్కడక్కడ డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. శ్రీమందిరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదాల శ్రీనివాసరావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా చూస్తే రాజీపడకుండా రిచ్‌గా తీశారనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X