Home

By Staff

- సమీక్ష
-జలపతి గూడెల్లి

చిత్రం: స్వామి
నటీనటులు:హరికృష్ణ, మీనా, ఆమని, ఉమ, రాజీవ్‌కనకాల, జయప్రకాష్‌రెడ్డి,చలపతిరావు, మోహన్‌రాజ్‌ తదితరులు
సంగీతం: కీరవాణి
కథ, మాటలు: పోసాని కృష్ణమురళి
నిర్మాత:ఆర్‌.కె.భగవాన్‌, తేజ
స్క్రీన్‌ప్లే,దర్శకత్వం:వి. ఆర్‌.ప్రతాప్‌

హరికృష్ణ సీతయ్య, టైగర్‌హరిశ్చంద్రప్రసాద్‌లాంటిఅట్టర్‌ఫ్లాఫ్‌ చిత్రాల తర్వాత మరోసాధారణ చిత్రాన్నే అందించాడు.గుంటూరులో జరిగిన ఓ నిజమైన ఘటనఆధారంగా కథ రూపొందించినట్లు పోసానికృష్ణమురళి ప్రకటించినప్పటికీ,ఆయన ట్రేడ్‌మార్క్‌ ఛీఫ్‌ డైలాగ్స్‌,రోటీన్‌ కథనంతోనే సినిమా సాగింది.హరికృష్ణ భావావేశాల ప్రదర్శనబాగానే ఉన్నా, ఆయన నటనకు ఊతం ఇచ్చేకథ, కథనం లేదు. పగ,ప్రతీకారం అనే ఫార్మూలా కథకుచెల్లెలు సెంటిమెంట్‌, భర్తచెల్లెలను పెంచడం కోసం భార్య (మీనా)తన గర్భాశయాన్నితొలగించుకోవడం వంటి దృశ్యాలుమరీ తమిళ సినిమాల మాదిరి రోటీన్‌పద్దతి. మరీ నాసిరకం సినిమా ఇది.

వేణుగోపాలముద్దుగా (హరికృష్ణ)రైస్‌ మిల్‌ యజమాని. ఆయనకు ఇద్దరుకవల చెల్లెల్లు (ఉమ). వీరిని బాగాచూసుకోవాలనే ఉద్దేశంతో స్వామిభార్య(మీనా) తన గర్భాశయాన్నితొలగించుకొంటుంది. మెడికల్‌ కాలేజ్‌లోచదువుతోన్న సీత(ఉమ)ని హౌస్‌సర్జెన్‌ చేస్తోన్న ఆనంద్‌(రాజీవ్‌కనకాల) ప్రేమిస్తున్నట్లు నమ్మించి,ఆమెను మోసగించి అనుభవిస్తాడు. సీతసోదరి (మళ్ళీ ఉమనే)తో కూడా అదే నాటకంఆడాలని ప్రయత్నించి విఫలమవుతాడు.తన ప్లాన్‌ బయటపడడంతో,వారిద్దరిని వేటాడి కిరాతకంగాచంపేస్తాడు. దంపతులు దీంతోషాక్‌కు గురై, న్యాయం కోసం పోరాడివిఫలమవుతారు. అప్పుడు తనవిశ్వరూపాన్ని ప్రదర్శించి, ఆనంద్‌,ఆయన తండ్రి (జయప్రకాష్‌ రెడ్డి),ఇంకా ఇతరులను చంపి కక్షతీర్చుకోవడం మిగతా కథ..

హరికృష్ణ ఆవేశపూరితమైననటన బాగానే ఉంది. కానీ ఆయన డైలాగ్స్‌నాసిరకంగా ఉన్నాయి. పోసానిరూపొందించిన ఈ కథ ప్రస్తుతానికిటాపికల్‌ అనే చెప్పాలి (శ్రీలక్ష్మి,మనోహర్‌ కేసు ఉదంతంనేపథ్యంలో). కానీ ఆయన ప్రతిదాన్నిఅతి చేయడం మానుకోవడంమంచిది. అంత అతిని తట్టుకోవాలంటేసామాన్య ప్రేక్షకులకు చాలా నిబ్బరంకావాలి. మీనా ఓకే. ఆమని పాత్ర స్వల్పం.కీరవాణి సంగీతం మోస్తారుగానేఉంది. వి. ఆర్‌.ప్రతాప్‌ మరోసారివిఫలమయ్యాడు.

MoreReviews హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X