Yatra 2 Movie Review వైఎస్ జగన్‌గా జీవా వన్ మ్యాన్ షో.. యాత్ర 2 మూవీ రివ్యూ!

Rating:
3.0/5

నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు
రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ
నిర్మాత: మేక శివ
సినిమాటోగ్రఫి: మధీ
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
ఎడిటర్: శ్రవణ్
బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ 02
రిలీజ్ డేట్: 2024-02-08

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని అతడికి అనుకూలంగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అధిష్టానానికి పంపిస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల సీఎం కుర్చీని జగన్‌కు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఆ తర్వాత తండ్రి మరణంతో గుండె పగిలి మరణించిన 660 కుటుంబాలను పరామర్శించడానికి జగన్ బయలు దేరుతాడు. ఆ యాత్ర చేయవద్దని జగన్‌కు ప్రొగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తుంది. దాంతో పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్రను వైఎస్ జగన్ చేపడుతాడు.

Yatra 2 Telugu Movie Review and Rating: Jiva lives upto the YS Jagans Character

ఓదార్పు యాత్రను చేపట్టిన జగన్‌కు కాంగ్రెస్ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఆ తర్వాత అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌ను ఎలా అరెస్ట్ చేశారు? అరెస్ట్ తర్వాత వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి? తనకు ప్రతికూలంగా మారిన పరిస్థితులను ఎదురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా సీఎం అయ్యాడనేది యాత్ర 2 కథ.

యాత్ర 2 చిత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా చేసిన సంక్షేమ పథకాలను హైలెట్ చేసే విధంగా డిజైన్ ఎమోషనల్ సీన్లతో మూవీ ప్రారంభమవుతుంది. వైఎస్ బ్రతికి ఉండగానే కాంగ్రెస్ అధిష్టానంతో కొంత వైరం లాంటి సంఘటనలు మహీ వీ రాఘవ క్రియేటివ్ లిబర్టీ తీసుకొని రాసిన సీన్లు బాగున్నాయి. వైఎస్ మరణాంతరం జరిగిన నాటకీయ పరిణామాలను దర్శకుడు రాసుకొన్న తీరే కాకుండా తెర మీద చూపించిన విధానం బాగుంది.

వైఎస్ఆర్, జగన్ మధ్య ఉండే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. కొడాలి నాని, ఇతర సన్నివేశాలకు సంబంధించిన సీన్లు బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని సన్నివేశాలు కొంత వాస్తవాలకు దూరంగా అనిపిస్తాయి, క్రియేటివ్ లిబర్టీతో సినిమాను ఎమోషనల్ డ్రామాగా మార్చడంలో మహీ వీ రాఘవ అనుసరించిన విధానం సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది.

Yatra 2 Telugu Movie Review and Rating: Jiva lives upto the YS Jagans Character

ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే..యాత్ర 2 మొత్తం రాజకీయ ప్రతీకారాలు, కక్ష్యలతో సాగడం రొటీన్‌గా మారుతుంది. నందిగం సురేష్‌కు సంబంధించిన ఎపిసోడ్ హైలెట్‌గా అనిపిస్తుంది. ఇక కేవీపీ మాదిరి పాత్రతో చెప్పించిన డైలాగ్స్ సినిమా హైలెట్‌గా అనిపించడమే కాకుండా ఆడియెన్స్ ఫుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. పొలిటికల్ సినిమాల్లో జగన్ వ్యతిరేకించే వ్యక్తులను దూషించిన విధంగా కాకుండా చంద్రబాబు క్యారెక్టర్‌ను కూడా డిగ్నిఫైడ్‌గా చూపించడం ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో మీడియాలో, జనం మధ్య జగన్‌ను ూసిన అంశాలే స్క్రీన్ మీద చూపించడం రొటీన్, రెగ్యులర్‌గా అనిపిస్తుంది. కొత్తగా విషయాలను ప్రస్తావించలేకపోవడంతో సినిమాలో క్యూరియాసిటీ మిస్ అయిందనిపిస్తుంది.

Yatra 2 Telugu Movie Review and Rating: Jiva lives upto the YS Jagans Character

నటీనటుల విషయానికి వస్తే.. యాత్ర చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశాడు. ఈ సినిమాలో కూడా అదే జోష్‌ను చూపించాడు. ఇక వైఎస్ జగన్‌గా జీవా కూడా పరకాయ ప్రవేశం చేయడమే కాకుండా.. ఆ పాత్రలో జీవించాడనే ఫీలింగ్ కలుగుతుంది. హావభావాలు, రోల్‌కు సంబంధించిన యాటిట్యూడ్‌ను పక్కాగా జీవా దించేశాడనే చెప్పాలి. ఎలాంటి తడబాటు, సందేహాలు లేకుండా జీవా తన లభించిన పాత్రలో దూరిపోయాడు. ఎక్స్‌లెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో అందర్ని ఎమోషనల్‌గా కదలిస్తాడు.

ఇక మిగితా పాత్రల్లో కేవీపీ తరహ పాత్ర (శుభలేఖ సుధాకర్), చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, భారతీగా కేతకీ నారాయణ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సోనియా పాత్రలో నటించిన ఆర్టిస్టు కూడా అద్బుతంగా చేసింది. నందిగం సురేష్ పాత్రలో నటించిన నటుడు కిషోర్ కుమార్ గుర్తుండిపోయే విధంగా నటించాడు. విజయమ్మ పాత్ర, ఇంకా మిగితా ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

Yatra 2 Telugu Movie Review and Rating: Jiva lives upto the YS Jagans Character

యాత్ర 2 సినిమాలో టెక్నికల్ విభాగం పనితీరు కూడా బాగుంది. ఈ సినిమాకు మ్యూజిక్, కెమెరా వర్క్ హైలెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. ఫస్టాఫ్‌లో రెండు పాటలు బాగున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే పాట ఇంకా బెటర్‌గా ఉంటే మరింత ఎమోషన్స్ డ్రైవ్ చేసేందుకు అవకాశం ఉంది. మిగితా అంశాలతో ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

వైఎస్ఆర్ కుమారుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఎదురైన ఎన్నో ఆటుపోట్లను అధిగమించి రాజకీయాల్లో హీరోగా మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ జర్నీ యాత్ర 2. గత కొన్ని సంవత్సరాలుగా మీడియాను, జగన్‌ను ఫాలో అయిన వారికి ఈ సినిమా ఎక్సైటింగ్ అనిపించదు. ఎందుకంటే అన్నీ తెలిసిన సంఘటనలే సినిమాలో కనిపిస్తాయి.

Yatra 2 Telugu Movie Review and Rating: Jiva lives upto the YS Jagans Character

సాధారణ ప్రేక్షకులకు, జగన్ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఈ సినిమా హై మూమెంట్స్ ఇస్తాయి. ఫస్టాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సెకండాఫ్ రెగ్యులర్ పొలిటికల్ స్టఫ్ ఉండటం వల్ల రొటీన్ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది. యాత్రను ఎమోషనల్ జర్నీగా మార్చడంలో సఫలమైన మహీ వీ రాఘవ, జీవాకే ఆ క్రెడిట్ దక్కుతుంది. పొలిటికల్ ఎజెండా, జెండాలను పక్కన పెడితే.. మంచి అనుభూతిని కలిగించే చిత్రం యాత్ర2.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X