twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chittam Maharani Review: లాక్ డౌన్ లో బైక్ పై లవ్ జర్నీ 'చిత్తం మహారాణి'.. ఆకట్టుకుందా అంటే?

    |

    Rating:
    2.0/5

    టైటిల్: చిత్తం మహారాణి
    నటీనటులు: యజుర్వేద్ గుర్రం, రచన ఇందర్, తులసి, సునీల్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, మధునందన్ తదితరులు
    సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ. కాశీ
    సంగీతం: గౌర హరి
    మాటలు: సురేష్ సిద్ధాని
    నిర్మాతలు: జేఎస్ మణికంఠ, టీఆర్. ప్రసాద్ రెడ్డి
    సమర్పణ: లిటిల్ థాట్స్ సినిమాస్
    ఓటీటీ విడుదల తేది: జనవరి 20, 2023
    ఓటీటీ వేదిక: ఆహా

    ఇటీవల కాలంలో చిన్న సినిమాల సందడి ఎక్కువ అయింది. కంటెంట్ నమ్ముకుని నూతన నటీనటులతో సినిమాలు తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలా తెరకెక్కించిన చిన్న సినిమానే 'చిత్తం మహారాణి'. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కి మంచి స్పందనే లభించింది. ఈ సినిమా టీజర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా విడుదల చేసి ప్రమోట్ చేశారు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లోతెరకెక్కిన ఈ సినిమాకు ఆకుల కాశీ విశ్వనాథ్ కథతో పాటు దర్శకత్వం చేశారు. యజుర్వేద్ గుర్రం, రచన ఇందర్ హీరోహీరోయిన్లుగా అలరించిన 'చిత్తం మహారాణి' సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథ:

    కథ:

    చైత్ర (రచన ఇందర్) బీటెక్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్తుంది. రూ. 10 లక్షల ప్యాకేజీతో జాబ్ సంపాదిస్తుంది. అయితే ఇంటికి తిరిగి వెళ్దామనుకునే సరికి.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారు. దీంతో తన ఫ్రెండ్ ఇచ్చిన సలాహాతో ఒక యాప్ ద్వారా రచన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఆ యాప్ ద్వారా రచనను ఇంటికి తీసుకెళ్లేందుకు రాజు (యజుర్వేద్ గుర్రం) వస్తాడు. రచన ఊళ్లో రాజు ఒక బైక్ మెకానిక్. వద్దనుకుంటూనే అప్పుడున్న పరిస్థితి దృష్ట్యా రాజు బైక్ ఎక్కుతుంది. అసలు రాజుకు రచనకు ఉన్న సంబంధం ఏంటీ? రాజు అంటే రచనకు ఎందుకు అసహ్యం? సొంత ఊరుకు వెళ్లేందుకు రాజు, రచన ఎలాంటి కష్టాలు పడ్డారు? రాజుకు అంతకుముందు జరిగిన పాప కిడ్నాప్ కు సంబంధం ఏంటీ? పోలీసులు రాజు వెంట ఎందుకు పడుతున్నారు? వంటి తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'చిత్తం మహారాణి' చూడాల్సిందే.

    విశ్లేషణ:

    విశ్లేషణ:


    కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో ఎంతోమంది తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారు. అనేక చెక్ పోస్టుల వద్ద ఎంతో మంది నిస్సాహయస్థితిలో కనపించేవారు. కొంతమంది అయితే సైకిళ్లపై, నడుస్తూ వేల కిలోమీటర్లు నడిచిన సంఘటనలు కలిచివేసేవి. ఇలాంటి సంఘనటలను స్ఫూర్తిగా తీసుకుని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రమే 'చిత్తం మహారాణి'. ప్రారంభంలో ఒక మాటలు రాని కొడుకు కోసం తల్లి పడే బాధ బాగానే చూపించారు. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, జాబ్ తెచ్చుకోవడం, లాక్ డౌన్, తర్వాత కిడ్నాప్, పోలీసులు, చెక్ పోస్ట్ లు తదితర సన్నివేశాలతో ఆసక్తిగానే ఉన్నా.. సినిమా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ లాజిక్ లేని సన్నివేశాలతో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని అర్థమవుతోంది.

    మోస్తారుగా కామెడీ..

    మోస్తారుగా కామెడీ..

    ఇక హీరో, హీరోయిన్ల మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని ముందుగానే తెలుస్తోంది. కానీ వాళ్లకు సంబంధించిన స్టోరీని సెకండాఫ్ లో చూపించి కాస్తా ప్రేక్షకుల ఓపికను టెస్ట్ చేశారనిపించింది. అయితే మరోవైపు కిడ్నాపర్ల కోసం పోలీసులు వెతుకుంటే చెక్ పోస్ట్ వద్ద కమెడియన్ సత్యకు వాళ్ల లవ్ స్టోరీ చెప్పడం ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. తీసుకున్న కథ లాక్ డౌన్, లవ్ అండ్ కిడ్నాప్ నేపథ్యమే కావచ్చు కానీ, అది స్క్రీన్ పై చూపించిన విధానం ఏమాత్రం ఆకట్టుకోలేదు. కానీ కమెడియన్ సత్యకు వాళ్ల విలేజ్ లవ్ స్టోరి చెప్పడం.. ఆ స్టోరీలో సత్య దూరిపోవడం ఓ మోస్తారు కామెడీని పండించింది. సినిమా మధ్యలోకి వచ్చాకా నీ లవ్ స్టోరీ ఏంట్రా అని సత్య డైలాగ్ తో తనపై తనే డైరెక్టర్ సెటైర్ వేసుకున్నట్లు అనిపించింది. అయితే ఇలానే తను చెప్పాలనుకున్న స్టోరీ అని కూడా తెలుస్తోంది.

    చివరి 20 నిమిషాలు మాత్రం..

    చివరి 20 నిమిషాలు మాత్రం..

    కిడ్నాపర్ దొరకిన తర్వాత కూడా సినిమా అర గంట నడుస్తుంది. అప్పుడే హీరోపై హీరోయిన్ కు ఉన్న అసహ్యం, హీరో కోల్పోయింది చూపించారు. ఇక సినిమా ఆఖరు 20 నిమిషాలు ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తో హీరో చెప్పే డైలాగ్ లు కూడా బాగుంటాయి. అయితే సినిమా ప్రారంభంలో హీరోకు మాత్రమే యాక్సిడెంట్ అయినట్లు చూపించారు. కానీ చివరిలో ఆ యాక్సిడెంట్ వేరే టర్న తీసుకుంటుంది. ఇలా అక్కడక్కడ కొన్ని అసంపూర్తిగా ఉన్న సన్నివేశాలు సినిమాకు మైనస్ అనే చెప్పాలి.

    ఎవరెలా చేశారంటే?

    ఎవరెలా చేశారంటే?

    బైక్ మెకానిక్ గా, యువతిని ప్రేమించే లవర్ గా, తల్లి కోసం చేసే కొడుకుగా బాగానే నటించాడు హీరో యజర్వేద్ గుర్రం. సాంగ్స్ లో మాత్రం ఇంప్రూవ్ కావాలని అనిపించింది. ఇక పొగరు ఉన్న అమ్మాయిగా.. తను చెప్తే సాగాలనే యాటిట్యూడ్ యువతిగా రచన ఇందర్ ఆకట్టుకుంది. ఎలాంటి హాట్ షో లేకుండా అందంగా కనిపించింది. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ పర్వాలేదనిపించాడు. అక్కడక్కడ సునీల్ సీరియస్ టోన్ సెట్ కాలేదనిపించింది. ఇక మిగతా పాత్రలు బాగానే అలరించాయి. కొన్ని పాటలు మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. తీసుకున్న కథను దర్శకుడు సరిగా చెప్పలేదనే భావన కలుగుతుంది. కామెడీ కూడా సత్య పాత్ర వచ్చినప్పుడు తప్పా మిగతా చోట్ల అంతగా ఏం పండదు. టైమ్ పాస్ కు చూడాలనుకుంటే మాత్రం ఈ 'చిత్తం మహారాణి'ని చూడొచ్చు.

    Read more about: sunil సునీల్
    English summary
    Yazurved Rachana Inder Sunil Starrer OTT Movie Chittam Maharani Review And Rating In Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X