Yevam Review: యేవమ్ మూవీ రివ్యూ.. అషురెడ్డి, చాందినీ చౌదరీ మూవీ ఎలా ఉందంటే?
మూవీ: యేవమ్ (Yevam)
నటీనటులు: చాందిని చౌదరీ, అషురెడ్డి, వశిష్ట సింహ, జై భారత్ రాజ్, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, కల్పిత తదితరులు
దర్వకత్వం: ప్రకాశ్ దంతులూరి
నిర్మాత: నవదీప్, పవన్ గోపరాజు
మ్యూజిక్: కీర్తన శేష్, నీలేష్ మందలపు
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి
సినిమాటోగ్రఫి: విశ్వేశ్వర్ ఎస్‌వీ
బ్యానర్: సీ స్పేస్, ప్రకాశ్ దంతులూరి
వికారాబాద్ ప్రాంతంలో సినీ హీరో ప్రభాస్ వాడుకొని యుంగధర్ అనే సైకో (వశిష్ట సింహా) అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి సబ్ ఇన్స్‌పెక్టర్‌గా సౌమ్య (చాందినీ చౌదరీ) వస్తుంది. అదే పోలీస్ స్టేషన్‌లో అభిరామ్ ఎస్సైగా ఉంటాడు. భార్య హారిక (అషు రెడ్డి)తో వైవాహిక దాంపత్యంలో విభేదాలు రావడంతో ఒంటరిగా ఉంటాడు. ఆ క్రమంలో అభిరామ్, సౌమ్య ఒకరికొకరు దగ్గర అవుతారు. ఈ క్రమంలో అభి భార్య హారిక గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంది.

అమ్మాయిలను యుగంధర్ ఎందుకు ట్రాప్ చేస్తుంటాడు? హీరో ప్రభాస్ పేరును ఎందుకు వాడుకొంటాడు? అభిరామ్, హారికకు మధ్య ఎందుకు గొడవలు జరిగాయి? హారికకు యుగంధర్‌కు ఉన్న లింకు ఏమిటి? యుగంధర్, అభిరామ్‌కు ఏదైనా రిలేషన్ ఉందా? సౌమ్య ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిన షాకింగ్ విషయాలు ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబే యేవమ్ మూవీ కథ.
క్రైమ్, ఇన్వెస్టిగేషన్‌తో సాగే సైకాలజికల్ థ్రిలర్ యేవమ్. దర్శకుడు ప్రకాశ్ దంతులూరి ఎంచుకొన్న పాయింట్ రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ.. తెరపైన ఆ పాయింట్‌ను చెప్పిన విధానం చాలా బాగుంది. అయితే ఇది ఒకరకంగా స్క్రీన్ ప్లే పరంగా చేసిన ప్రయోగమే అని చెప్పాలి. అయితే ఓ కథను కొత్తగా ప్రజెంట్ చేయాలనే తపన ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంకా సీన్లు, కథలో ట్విస్టులపై మరింత వర్క్ చేసి ఉంటే.. డెఫినెట్‌గా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకొంటూ మెప్పిస్తున్న చాందినీ చౌదరీ మరోసారి మెచ్యుర్డ్ క్యారెక్టర్‌లో నటించింది. పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నది. ఇక గ్లామర్ పాత్రలకే పరిమితమవుతున్న అషురెడ్డి హారిక పాత్రతో డిఫరెంట్ రోల్‌లో కనిపించడమే కాకుండా తనదైన శైలిలో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వశిష్ట సింహ, జై భారత్ ఇంటెన్స్ రోల్‌లో పోటీ పడి నటించారు. వేరియేషన్‌కు స్కోప్ ఉన్న పాత్రలో ఒదిగిపోయారు. మిగితా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఎడిటర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇద్దరు మహిళలే వర్క్ చేసి తమ సత్తాను చాటుకొన్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీర్తన్ ఆకట్టుకొంటే.. సృజన ఎడిటర్‌గా ట్రీక్కీగా ఉండే స్క్రీన్ ప్లేను చాలా స్పూత్‌గా డీల్ చేశారు. నవదీప్, పవన్ గోపరాజు పాటించిన నిర్మాణ విలువులు బాగున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి యేవమ్ నచ్చుతుంది. ఓసారి ఈ సినిమాను థియేటర్లో చూడొచ్చు.


Click it and Unblock the Notifications











