Youth Movie Review: యూత్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శని, సూరజ్ వెంజరామూడు, ప్రియాంషీ యాదవ్, మీనాక్షి దినేష్, అభిసాన్ దేవరస తదితరులు
కథ, మాటలు, దర్శకత్వం: కెన్ అండ్ గ్యాంగ్
నిర్మాతలు: కరుప్పయ్య సీ రామ్, సులోచన కుమార్
మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటర్‌: నాష్
ఆర్ట్ డైరెక్టర్‌: రాము థంగరాజ్
సినిమాటోగ్రాఫర్‌: వికీ
క్యాస్టూమ్ డిజైనర్‌: కావ్య శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్‌: రామ్ థంగరాజ్
రిలీజ్ డేట్: 2026-03-27

ప్రవీణ్ (కెన్ కరుణాస్) స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే లవ్‌లో పడాలనే కోరికతో రగిలిపోతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో తన క్లాస్‌మేట్ ప్రేషికా (మీనాక్షి దినేష్)తో పరిచయం లవ్‌లో పడేలా చేస్తుంది. ప్రేషికాతో డేటింగ్ కొనసాగుతుండగానే సోనాల్ (ప్రియదర్శి యాదవ్) తన జీవితంలోకి వస్తుంది. అయితే తనను మోసగించాడని భావించిన ప్రేషికా బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సోనాల్ కూడా దూరమవుతుంది. ఆ తర్వాత గంగ (అనిష్మా అనిల్ కుమార్) స్కూల్ మేట్ ప్రవీణ్ మనసుకు దగ్గరవుతుంది.

Youth Movie Review and Rating

స్కూల్ లైఫ్‌లోనే లవ్‌లో పడాలనే కోరిక ప్రవీణ్‌కు ఎందుకు కలిగింది? ప్రేషికాతో డేటింగ్ చేస్తుండగానే.. సోనాల్‌కు ఎందుకు దగ్గరయ్యాడు? ఏ పరిస్తితుల్లో ప్రేషికా బ్రేకప్ జరిగింది? ప్రేషికా బ్రేకప్‌కు సోనాల్ ఎలా కారణమైంది? ప్రవీణ్‌ను సోనాల్ ఎందుకు వదిలేసింది? గంగ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్‌ కుటుంబంలో ఎదురైన సమస్య ఏమిటి? ప్రవీణ్ తల్లిదండ్రుల బ్యాక్ స్టోరీ ఏమిటి? తన జీవితంలో ప్రేమ కంటే మరోటి ముఖ్యమని ప్రవీణ్ ఎలా రియలైజ్ అయ్యాడు? చివరకు లవ్ అంతా ట్రాష్ అని నిర్ణయం తీసుకొన్న ప్రవీణ్.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

గతంలో టీనేజ్, స్కూల్ లెవెల్ లవ్ స్టోరీలు ఎక్కువగానే చూసి ఉంటాం. కానీ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన కెన్ మాత్రం ఈ సినిమా కథను, సన్నివేశాలను పూర్తిగా కొత్తగా రాసుకొన్నాడు. స్క్రీన్ ప్లే చాలా రేసింగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా టోటల్‌గా ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రూపొందించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నేటితరం కుర్రాళ్ల పోకడలను వాస్తవానికి చాలా దగ్గరగా చూపించాడు. సెకండాఫ్‌లో ప్రవీణ్ తల్లిదండ్రుల మద్య నడిచే డ్రామా ఈ సినిమాకు ఎమోషనల్ టర్నవుట్‌గా మారుతుంది. టీనేజ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఫన్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో సరదాగా సాగిపోతుంది. పెద్దగా బుర్రపెట్టి ఆలోచించాల్సిన సినిమా కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే యూత్‌ఫుల్ లవ్ స్టోరి.

కెన్ కరుణాస్ నటించడమే కాకుండా కథ, కథనాలను చక్కగా రాసుకోవడం అతడి ప్రతిభకు అద్దంపట్టింది. ప్రవీణ్ పాత్రలో దూరిపోయి నటించారని చెప్పడం కంటే.. ఆ క్యారెక్టర్‌లో బిహేవ్ చేశాడని చెప్పాలి. ఈ సినిమాకు పూర్తిగా ఆయనకే క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక ప్రేషికాగా మీనాక్షి, సోనాల్‌గా ప్రియదర్శి తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. గంగ కూడా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఈ ముగ్గురు గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా మెప్పించారు. కెన్ తండ్రిగా సూరజ్, తల్లిగా దేవదర్శిని ఎమోషనల్ కంటెంట్‌ను పండించారు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు గుర్తుండిపోయేలా నటించారు.

ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ హైలెట్. తెలుగు ఆడియెన్స్ పల్స్ తెలుసుకొని ఆర్పీ పట్నాయక్, ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల పాటలను ఈ కథలో జొప్పించిన విధానం ఈ సినిమాను మరింత క్రేజీగా మార్చేసింది. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగం పనితీరు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఈ సినిమా పక్కాగా మాస్ ఎలిమెంట్స్‌తో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే కాకుండా టీనేజ్ లవ్ స్టోరి. సన్నివేశాలు నవ్వించడమే కాకుండా హృదయాన్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. అంచనాలు పెట్టుకొని వెళ్లినా.. అంచనా లేకుండా వెళ్లిన సంతృప్తిని అందిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X