Zara Hatke Zara Bachke Twitter Review సారా అలీఖాన్, వికీ కౌశల్ కెమిస్ట్రీ అదుర్స్..ఫన్‌తో ఫ్యామిలీ డ్రామా

నటీనటులు: వికీ కౌశల్, సారా ఆలీఖాన్, ఇనాముల్ హక్, శ్రీష్టి రిందానీ, మేఘన అగర్వాల్, ఆకాశ్ ఖురానా, నీరజ్ సూద్ తదితరులు
దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్
నిర్మాతలు: దినేస్ విజన్
మ్యూజిక్: సచిన్ జిగర్
సినిమాటోగ్రఫి: రాఘవ్ రామదాస్
ఎడిటింగ్: మనీష్ ప్రధాన్
ఆర్ట్: నిలేష్ విశ్వకర్మ
రిలీజ్ డేట్: 2023-06-02

వికీ, సారా కెమిస్ట్రీ: జరా హట్కే జరా బచ్‌కే విషయానికి వస్తే డ్రీమ్ హౌజ్ ఎలా సొంతం చేసుకోవడమేనే కథ. వికీ కౌశల్, సారా అలీ ఖాన్ తెర మీద అద్బుతంగా కనిపించారు. వారిద్దరి జంట బాగుంది. వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండటమే కాకుండా మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను థియేటర్లో చూస్తే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది. డోంట్ మిస్.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Zara Hatke Zara Bachke twitter review: Vicky Kaushal and Sara Ali Khan lovely chemistry

కాన్పిడెంట్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా: జరా హట్కే జరా బచ్‌కే మూవీలో సారా ఆలీ ఖాన్ నటన బాగుంది. ఆమె ఫెర్ఫార్మెన్స్ వైబ్రెంట్‌గా ఉంది. సౌమ్య పాత్రలో ఆమె చాలా కాన్పిడెంట్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా కనిపించింది. ఆమె పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఫ్యామిలీ: జరా హట్కే జరా బచ్‌కే సినిమా ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి వినోదాన్ని అందించే సినిమా. వికీ కౌశల్ బాగా నటించాడు. సారా ఆలీ ఖాన్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. ఈ సినిమా క్లైమాక్స్ గుండెను పిండేసేలా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమాకు నా రేటింగ్ 3/5 అంటూ రివ్యూ ఇచ్చాడు.

లక్ష్మణ్ ఉటేకర్ కథ: జరా హట్కే జరా బచ్‌కే విభిన్నమైన కథతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చాలా బాగా ఎంజాయ్ చేసే విధంగా సినిమాలో కంటెంట్ ఉంది. లక్ష్మణ్ ఉటేకర్ కథ చెప్పిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో సందేశం ఇచ్చిన తీరు బాగుంది. ఆద్యంతం సినిమా వినోదంగా సాగుతుంది అని క్రిటిక్ సుమిత్ కడేల్ తన రివ్యూలో పేర్కొన్నారు.

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: జరా హట్కే జరా బచ్‌కే చిత్రం లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించే టిపికల్ సినిమాల్లో ఒకటిగా ఉంటుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. వికీ కౌశల్ తన పాత్రను పర్‌ఫెక్ట్‌గా పోషించాడు. కేదారినాథ్ తర్వాత సారాఆలీఖాన్ అద్బుతంగా నటించిన చిత్రం ఇది. వినోదం, ఎంగేజింగ్‌గా, మంచి పాటలతో టైంపాస్ మూవీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Zara Hatke Zara Bachke twitter review: Vicky Kaushal and Sara Ali Khan lovely chemistry

ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌తో: మధ్య తరగతి కుటుంబానికి చెందిన దంపతుల కథ. ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌తో మంచి టైంపాస్ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మన్ ఉటేకర్ అందించారు. వికీ కౌశల్, సారా ఆలీఖాన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. కామిక్ టైమింగ్ బాగా వర్కవుట్ అయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

సెకండాఫ్ చాలా బోరింగ్‌గా: జరా హట్కే జరా బచ్కే సినిమాను కొత్తగా తీసే ప్రయత్నం చేశారు. జరా బచ్కే అనే స్ట్రాటజీని యూజ్ చేయండి. ఈ సినిమా కథ వాస్తవ పరిస్థితులకు కనెక్ట్ కావడానికి చాలా కష్టం. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమా కథ మధ్య తరగతి కుటుంబానికి చెందిన దంపతుల కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X