twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాంబి రెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: తేజ సజ్జ, ఆనందిని, దక్ష నగార్కర్, హర్షవర్ధన్, వినయ్ వర్మ, గెటప్ శ్రీను
    Director: ప్రశాంత్ వర్మ

    అ! కల్కి లాంటి చిత్రాలతో అభిరుచి కల దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న ప్రశాంత్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం జాంబిరెడ్డి. తేజ సజ్జ, ఆనందిని, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉండే జాంబీ జానర్‌లో తెరకెక్కింది. రాయలసీమ ఫ్యాక్షన్, జాంబీ అంశాలను జోడించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా అని తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

    జాంబిరెడ్డి కథ..

    జాంబిరెడ్డి కథ..

    మారియో అలియాస్ మర్రిపాలెం ఓబుల్ రెడ్డి (తేజ సజ్జ), భద్రం ( కిరిటీ దామరాజు), మ్యాగి (దక్ష నగార్కర్), కల్యాణ్ (హేమంత్) కంప్యూటర్ గేమ్ డిజైనర్స్. మారియో టీమ్ రూపొందించిన గేమ్ అత్యధిక డౌన్‌లోడ్స్ సాధిస్తుంది. కాకపోతే సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు రావడంతో కల్యాణ్ అవసరం పడుతుంది. కానీ అనుకోకుండా కల్యాణ్ పెళ్లి కుదరడంతో అందుబాటులో లేకపోవడం వల్ల మారియో టీమ్ ఫ్యాక్షన్ కక్షలతో అట్టుడికే కర్నూలులోని రుద్రవరం గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. రుద్రవరం చేరుకొన్న మారియోకు కల్యాణ్‌ను పెళ్లి పీటల మీదే హత్య చేస్తారని తెలుస్తుంది.

    జాంబిరెడ్డిలో ట్విస్టులు

    జాంబిరెడ్డిలో ట్విస్టులు

    కర్నూల్‌కు వెళ్లే క్రమంలో భద్రం‌కు ఎదురైన సమస్య ఏమిటి? జాంబిగా మారిన భద్రం రుద్రవరం గ్రామంలో ఎలాంటి అలజడి సృష్టించాడు? రుద్రవరం గ్రామంలో నందినిరెడ్డి (ఆనంది) పాత్ర ఏమిటి? రుద్రవరంతోపాటు పొరుగు గ్రామంలో ప్రజలందరూ జాంబిలుగా మారడానికి కారణం ఏమిటి? వైరాలజిస్టు (చిట్టి అలియాస్ త్రిపురనేని వరప్రసాద్) చేసిన ప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఇంతకు కల్యాణ్ పెళ్లి జరిగిందా? జాంబీలు మామూలు మనుషులుగా మారిపోయారా? కసిరెడ్డి (గెటప్ శ్రీను) పాత్ర ఏమిటి అనే అంశాలతోపాటు ఇంకా పలు ప్రశ్నలకు సమాధానమే జాంబిరెడ్డి.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    కొడుకు మారియో చేసే గేమ్ డిజైనింగ్ పనిపై తండ్రి ప్రతాప రెడ్డి ( హర్షవర్ధన్) అసంతృప్తితో కథ మొదలవుతుంది. తండ్రి ముందు తన సత్తాను నిరూపించుకొందామనుకొంటున్న సమయంలో మారియో రూపొందించిన గేమ్‌లో సమస్యలు తలెత్తడం, దాంతో కర్నూలుకు వెళ్లాల్సి రావడం చకచక జరిగిపోతాయి. కర్నూలుకు చేరుకొన్న మారియో టీమ్‌ ముందు ఫ్యాక్షన్‌, పగ, ప్రతీకారం అనే అంశాలను కథలోకి తీసుకొచ్చిన దర్శకుడు ఫర్వాలేదనే విధంగా కథను నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే దారిలో భద్రంను ఓ వ్యక్తి కొరకడంతో అతడు జాంబిగా మారిపోవడంతో అసలు కథ మొదలవుతుంది.

    సెకండాఫ్‌లో సాగదీత

    సెకండాఫ్‌లో సాగదీత

    ఇక ఫ్యాక్షన్‌ అంశంతో ఫస్టాఫ్‌ను సాగదీసిన దర్శకుడు సెకండాఫ్‌లో పూర్తిగా జాంబీ కథను భుజానికెత్తుకొన్నాడు. అయితే జాంబీలతో చేయించిన విన్యాసాలు కొద్దిసేపు ఫర్వాలేదనిపించినా.. కథ సాగిన కొద్ది విసుగుపుట్టించేలా చేస్తాయి. జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు రోత పుట్టించేలా ఉన్నాయి. మితీ మీరిన హింస, జాంబీలను చిత్రీకరించిన తీరు జుగప్సగా అనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో నందినిరెడ్డి, ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ట్విస్టులు, గెటప్ శ్రీను, నాగ మహేష్ కామెడీ కొంత ఊరటగా అనిపిస్తుంది. వైరస్‌కు విరుగుడుగా తీసుకొన్న అంశం లాజిక్‌కు చాలా దూరంగా ఉండి సినిమా ఏదో ఫర్వాలేదని ఫీలింగ్‌ను కలిగిస్తుంది.

    తేజ సజ్జా ఫెర్ఫార్మెన్స్ గురించి

    తేజ సజ్జా ఫెర్ఫార్మెన్స్ గురించి

    ఇంద్ర సినిమాలో బాలనటుడిగా పరిచయం అయిన తేజ సజ్జ ఇటీవల కాలంలో చిన్న పాత్రల్లో కనిపించాడు. అయితే జాంబిరెడ్డి రూపంలో తేజ సజ్జ ఓ భారీ పాత్రను భుజాన మోసాడు. మారియోగా తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. నటనపరంగా ఇంకా పరిణితిని సాధించాల్సి ఉంటుంది. కేవలం ఒకే పాయింట్‌పై కథ సాగడంతో డ్యాన్సులు, స్టెప్పులకు అవకాశం దక్కలేదు. ఓవరాల్‌గా తేజ తన నటనతో ఆకట్టుకొన్నాడనే చెప్పవచ్చు.

    ఇతర నటీనటులు ప్రతిభ

    ఇతర నటీనటులు ప్రతిభ

    మ్యాగీగా తన ప్రతిభను చాటుకోవడానికి దక్ష నగార్కర్‌‌కు పెద్దగా స్కోప్ లేదు. ఇక నందినిరెడ్డిగా ఆనంది తన నటనతో ఆకట్టుకొన్నారు. కీలక సన్నివేశాల్లో ఆనంది పరిణతిని చూపించారు. ఇక జాంబీల భయంకరమైన సన్నివేశాల మధ్య గెటప్ శ్రీను కామెడీ కామెడీ ఉపశమనం కలిగించింది. గెటప్ శ్రీనును ఇంకా పూర్తిస్థాయిలో ఉపయోగించుకొంటే కథలో ఉండే విపరీతత్వం కొంత బ్యాలెన్స్ అయి ఉండేది.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కథ, కథనాలకు తగినట్టుగా మార్క్ కే రాబిన్ మ్యూజిక్ యాప్ట్‌గా అనిపిస్తుంది. మార్క్ రాబిన్ రూపొందించిన రీరికార్డింగ్ కొన్ని సన్నివేశాలను మరో లెవెల్ తీసుకెళ్లింది. ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకా సాయిబాబుకు చేతినిండా పని ఉందనే చెప్పవచ్చు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణ. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఫ్యాక్షన్, జాంబీ జోనర్ మేలవించిన జాంబిరెడ్డి ఉడికి ఉడకని వంటకంలా ఉంటుంది. మితీమీరిన హింస, పేలవమైన సన్నివేశాలు కొన్ని చోట్ల సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటాయి. పిల్లలు, ఫ్యామిలీస్ సినిమాకు దూరంగా ఉంటే మంచింది. క్రైమ్, థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు జాంబిరెడ్డి నచ్చవచ్చు. ప్రశాంత్ వర్మ చేసిన ప్రయత్నం మాత్రం అ! అనే రేంజ్‌లో లేదనే చెప్పాలి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    సాంకేతిక అంశాలు
    నటీనటుల ఫెర్ఫార్మెన్స్
    సినిమాటోగ్రఫి, మ్యూజిక్

    మైనస్ పాయింట్
    సినిమా నిడివి
    సాగదీత మరీ ఎక్కువగా ఉండటం
    స్క్రీన్ ప్లే
    మితీ మీరిన హింస

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: తేజ సజ్జ, ఆనందిని, దక్ష నగార్కర్, హర్షవర్ధన్, వినయ్ వర్మ, గెటప్ శ్రీను, నాగ మహేష్, హేమంత్, కిరిటీ దామరాజు తదితరులు
    రచన, దర్శకుడు: ప్రశాంత్ వర్మ
    నిర్మాత: రాజశేఖర్ వర్మ
    మ్యూజిక్: మార్క్ కే రాబిన్
    ఎడిటింగ్: సాయిబాబు
    సినిమాటోగ్రఫి: అనిత్
    బ్యానర్: ఆపిల్ ట్రీస్ స్టూడియోస్
    రిలీజ్: 2021-02-05

    English summary
    Zombie Reddy action horror film directed by Prasanth Varma. Starring Sajja Teja, Daksha Nagarkar and Anandhi. This movie Produced under Apple Trees Studios banner. The film is hits screen on 5 February 2021
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X