జాంబీ రెడ్డి ట్విట్టర్ రివ్యూ.. ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ యాక్టింగ్‌పై నెటిజన్ల కామెంట్స్
విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా ప్రశాంత్ వర్మకు మంచి పేరు వచ్చింది. ప్రయోగాత్మక చిత్రాలను తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడంలో ప్రశాంత్ వర్మ శైలి అందరికీ నచ్చింది. అందుకే అ!, కల్కి వంటి చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా ప్రేక్షకుల్లో మాత్రం ప్రశాంత్ వర్మకు గుర్తింపు వచ్చింది. ముచ్చటగా మూడో సారి జాంబీ రెడ్డి అంటూ వచ్చాడు. ఈసారి తెలుగు ప్రేక్షకులకు జాంబీలను పరిచయం చేసి బాక్సాఫీస్ మీద దాడి చేయాలని ప్రశాంత్ వర్మ ప్రయత్నించాడు. మరి నేడు విడుదలైన ఈ మూవీ గురించి ట్విట్టర్‌లో నడుస్తున్న చర్చ ఏంటో ఓ సారి చూద్దాం.

జాంబీరెడ్డి స్పెషల్..
హాలీవుడ్ తెరకు జాంబీలు కొత్తేమీ కాదు. కానీ తెలుగు తెరకు ఈ జాంబీలను ప్రశాంత్ వర్మ కొత్తగా పరిచయం చేస్తున్నాడు. అయితే తెలుగు నేటివిటీకి దగ్గరగా, కామెడీ జానర్‌ను అందులో జొప్పించడంతో జాంబీరెడ్డి అందరికీ నచ్చేట్టు కనిపిస్తోంది.

నెటిజన్ల టాక్..
జాంబీరెడ్డి సినిమాపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జాంబీలు మాత్రం కొత్తగా కనిపిస్తారని, తెరపై జాంబీల విశ్వరూపం మాత్రం అందరికీ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేలా కనిపిస్తోందట. జాంబీలు మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలానే ఉన్నారని అంటున్నారు.

అలా కథ యూటర్న్..
మామూలుగా మొదటి భాగమంతా సాధారణంగానే నడుస్తుందని, రొటీన్ కామెడీ సీన్లతో అలా కానిచ్చేస్తారని, ఇంటర్వెల్‌లో జాంబీలు ఎంటర్ అవుతారని తెలుస్తోంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందట. ద్వితీయార్థంలో జాంబీల పని పట్టడం, అసలు అవి ఎలా పుట్టుకొచ్చాయని హీరో శోదించి వాటి కథ ముగించేస్తాడట. హీరోగా తేజ అదరగొట్టాడని తెలుస్తోంది.

నెటిజన్ల రియాక్షన్..
అయితే జాంబీ రెడ్డి కొత్త ఫీలింగ్ ఇచ్చేలానే ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. పైగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలానే ఉంటుందట. కానీ రొటీన్ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ కాస్త బోర్ కొట్టించేశాడని టాక్ వినిపిస్తోంది. అయితే మొత్తానికి జాంబీ రెడ్డి పాస్ అయ్యేలా కనిపిస్తాడని అంటున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్ ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుందట.

కలెక్షన్లు సైతం..
జాంబీ రెడ్డి కలెక్షన్లు సైతం బాగుండేలానే కనిపిస్తోంది. ట్విట్టర్‌లో ఇప్పటికే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఇక పూర్తి స్థాయి రివ్యూలు కూడా ఈ మాదిరిగానే ఉంటే కలెక్షన్లలో జాంబీ రెడ్డి దూసుకుపోయేలానే ఉన్నాడు. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో రానుంది.


Click it and Unblock the Notifications











