మహేష్ బాబుకు భారతి చెబుతుందేంటి..? ఆన్‌లైన్‌లో హంగామా చేస్తున్న రేర్ క్లిక్
సూపర్ స్టార్ మహేష్ బాబుకు భారతి ఏదో చెబుతోంది. పక్కనే ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. భారతి చెబుతున్న ముచ్చట్లు వింటూ ఆనంద పడుతున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఈ పిక్ ఏ సందర్భం లోనిది? చూద్దామా..
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఇదే సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. భారతిగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక సీనియర్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోష్హిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిపై చిత్రీకరిస్తున్న ఓ సన్నివేశం తాలూకు పిక్ నెట్టింట దర్శమిచ్చింది. ఇందులో మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాష్ రాజ్ ముగ్గురూ కనిపిస్తుండటంతో వైరల్ అయింది. ఈ రేర్ పిక్ ఆన్‌లైన్‌లో తెగ హంగామా చేస్తోంది.

విజయశాంతి ఏదో చెబుతుంటే, మహేష్ బాబు నవ్వుతున్నట్లుగా కనిపిస్తుండటం అయాన్ అభిమానులను కనువిందు చేస్తోంది. ఇటీవలే దీపావళి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు నుంచి విజయశాంతి ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











