షూటింగ్ లో హీరోకు ఊహించని ప్రమాదం.. చివరి క్షణంలో చావు నుంచి తప్పుకున్న విశాల్.. వీడియో వైరల్
సినిమాలకు సంబంధించిన యాక్షన్స్ సీన్స్ లో పాల్గొనాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక ఇటీవల హీరో విశాల్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్లో ఒక పెను ప్రమాదం తప్పింది. అందులో ఏమాత్రం తేడా వచ్చిన చాలామంది గాయపడేవారు. ఇక చావు నుంచి తప్పించుకున్నంత పని అయింది అంటూ విశాల్ కూడా వివరణ ఇచ్చాడు. ఆ వివరాలు లోకి వెళితే..

ఇంతకుముందు చాలాసార్లు
యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్న విశాల్ చాలా వరకు డూప్ లేకుండానే సినిమా షూటింగ్స్ లలో పాల్గొంటూ ఉంటాడు. చిన్న సన్నివేశమైన పెద్ద యాక్షన్ సన్నివేశమైన సరే ప్రాణం పెట్టి నటిస్తాడు. చాలాసార్లు షూటింగ్లలో గాయపడిన హీరోలలో విషయాలు మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. ఇక అతని డెడికేషన్ చూసి చాలా మంది కూడా పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు.

అందుకే విశాల్ కు గాయాలు
ఇంతకుముందు వచ్చిన లాఠీ సినిమా షూటింగ్లో కూడా విశాల్ రెండు మూడు సార్లు గాయపడ్డాడు. గాయాల నుంచి కోలుకొని మళ్లీ షూటింగ్లో పాల్గొన్న విశాల్ వారం గ్యాప్ లోనే మళ్లీ దెబ్బలు తగిలించుకున్నాడు. వీలైనంతవరకు అతను సన్నివేశాలు బాగా వచ్చేలా చేయాలి అనే ఆలోచనతో ఈ విధంగా గాయాల పాలవుతుంటాడు.. అని దర్శక నిర్మాతలు చెబుతూ ఉంటారు.

ఈసారి విశాల్ తప్పు లేదు
అయితే ఈసారి మాత్రం విశాల్ తప్పిదం లేదు. ఊహించని విధంగా భారీ వాహనం వలన ఒక డేంజర్ ఎదురుగా వచ్చింది. అప్పటికప్పుడే అందరూ కూడా పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే ఊహించని ప్రమాదం చోటు చేసుకునేది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మార్క్ అంథోని సినిమా షూట్
ప్రస్తుతం విశాల్ మార్క్ అంథోని అనే ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ త్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఫైట్స్ కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. అయితే ఈ సినిమాలో కూడా విశాల్ ఎలాంటి డూప్ లేకుండా నటిస్తున్నాడు. ఇక చెన్నైలో ఇటీవల వల్ల వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.

దూసుకొచ్చిన భారీ వాహనం
ఎదురుగా ఒక భారీ వాహనం వస్తూ ఉన్న సన్నివేశాలను షూట్ చేస్తూ ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. హఠాత్తుగా యాక్షన్ డైరెక్టర్ కట్ చెప్పినప్పటికీ కూడా వాహనం అలానే దూసుకు వచ్చింది. దీంతో అప్పటివరకు కాస్త నిలకడగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదరై పోయారు. ఇక విశాల్ కూడా అందులోనే ఉన్నాడు. అతను ఎదురుగా వచ్చిన వాహనాన్ని చూసి కాస్త కింద పడిపోయాడు.

ఆ కారణంగా ప్రమాదం
యాక్షన్ సీన్స్ లో ముందుగానే ఇలాంటి సీన్స్ కోసం శిక్షణ తీసుకొని మరి నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మార్క్ అంథోని సినిమా కోసం కూడా పలుమార్లు శిక్షణ తీసుకున్న తర్వాతనే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ విధమైన సీన్ షూట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక వాహనాన్ని హఠాత్తుగా కంట్రోల్ చేసినప్పటికీ కూడా టెక్నీకల్ సమస్యల వలన కంట్రోల్ కాలేదట. దీంతో ఎదురుగా ఉన్న సెట్ ప్రాపర్టీని అది తాకడంతో భారీగా సౌండ్ వచ్చింది.
ఆలస్యమైతే ప్రాణాలు పోయేవి: విశాల్
ఇక విశాల్ కూడా ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. టెక్నికల్ టీం ప్రాబ్లమ్ వలన ఈ ప్రమాదం జరిగింది అని కాస్త ఆలస్యమై ఉంటే ప్రాణాలు పోయేవి అని దేవుడు రక్షించినట్లుగా విశాల్ తెలియజేశాడు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ కూడా ఎలాంటి గాయాలు కాలేదు అని మళ్లీ వెంటనే షూటింగ్లో పాల్గొన్నట్లు కూడా విశాల్ వివరణ ఇచ్చాడు. ఇక మార్క్ అంథోని సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











