రకుల్‌తో రొమాన్స్‌కి రెడీ అయిన నాగార్జున.. అదీ హైదరాబాద్‌లోనే!
రొమాంటిక్ సినిమాలు సన్నివేశాలు తీయాలంటే నాగార్జునను మించిన హీరో ఉంటారా చెప్పండి. ఇప్పటికే పలు సినిమాలతో ఆయన రొమాంటిక్ సెన్స్ బయటపడింది. గత కొన్ని దశాబ్దాలుగా సీనియర్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏలుతున్న నాగ్.. దాదాపు అందరు హీరోయిన్లతో నటించారు. దాదాపు 60 ఏళ్ళొచ్చినా ఆయనలోని యంగ్ లుక్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో కుర్ర హీరోయిన్లు కూడా నాగార్జునతో రొమాన్స్ చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ అండ్ గ్లామర్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జునతో కమిట్ అయింది.
నాగార్జున హీరోగా అప్పట్లో వచ్చిన మన్మథుడు చిత్రం ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పే పని లేదు. అయితే మళ్ళీ ఇన్నేళ్లకు అదే పేరుతో మన్మథుడు 2 గా కొత్త చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో నాగార్జుననే హీరోగా నటిస్తున్నారు. కానీ హీరోయిన్ మాత్రం మారింది. నాగ్ చెంతన రకుల్ వచ్చి చేరింది. షూటింగ్‌లో భాగంగా ఈ ఇద్దరూ సెట్స్‌పై యమ రొమాన్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే పోర్చుగల్ అంతా దున్నేసి వచ్చిన ఈ జంట ఇక హైదరాబాద్ లో హవా కొనసాగించనుంది. మన్మథుడు 2 తదుపరి షెడ్యూల్‌ని అతి త్వరలో హైదరాబాద్ లోని పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించనున్నారు.

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 తెరకెక్కుతోంది. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యత చేపట్టారు. త్వరగా చిత్రీకరణను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్. ఇంకా ఈ చిత్రంలో నాగార్జున కోడలు అక్కినేని సమంత, వెన్నెల కిశోర్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











