త్రివిక్రమ్ సెట్స్ నుంచి లీకైన బన్నీ లుక్.. నెట్టింట హల్చల్ చేస్తున్న సర్‌ప్రైజింగ్ పిక్స్
అరవింద సమేత లాంటి యావెరేజ్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నా పేరు సూర్య లాంటి డిసాస్టర్ తర్వాత అల్లు అర్జున్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరమైన ఈ తరుణంలో ఎంతో శ్రద్దగా స్క్రిప్ట్ పనులు చూసుకున్నారట త్రివిక్రమ్. ప్రేక్షక లోకాన్ని భారీ రేంజ్‌లో ఆకట్టుకునేలా బన్నీతో కలిసి తన మ్యాజిక్ చేయబోతున్నాడు మాటల మాంత్రికుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి లుక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు యూనిట్ సభ్యులు. కానీ ఊహించని రీతిలో తాజాగా త్రివిక్రమ్ సెట్స్ పై ఉన్న బన్నీ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై షాకిచ్చింది. ఎలా లీక్ చేశారో.. ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ బన్నీ లుక్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇందులో చాలా డీసెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు బన్నీ. సాధారణమైన హెయిర్ స్టైల్‌తో ఫార్మల్ డ్రెస్‌లో.. కాలికి చెప్పులు లేకుండా మెడలో ఐడి కార్డుతో సింపుల్‌గా నడిచి వస్తున్నట్లుగా బన్నీ దర్శనమిచ్చాడు. గత సినిమాకు పూర్తి భిన్నంగా ఈ లుక్ లో బన్నీని చూసి మురిసి పోతున్నారు ఆయన అభిమానులు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ కూడా భాగం కానున్నారని ప్రకటన రావడంతో ప్రేక్షక లోకంలో ఆసక్తి నెలకొంది. ఫామిలీ సెంటిమెంట్స్ తో ఎమోషన్ ప్లస్ యాక్షన్ అన్ని కలగలసి హ్యాట్రిక్ హిట్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని పక్కాగా రూపొందించినట్టు ఫిలిం నగర్ టాక్.


Click it and Unblock the Notifications











