హీరోయిన్‌తో కలిసి అల్లు అర్జున్ ప్యారిస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యారిస్ పయనానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అది కూడా హీరోయిన్ పూజా హెగ్డేను వెంటపెట్టుకొని ఆయన ప్యారిస్ వెళుతున్నారు. ఇప్పటికే విషయం అర్థమై ఉంటుంది. అదేనండీ.. అల్లు అర్జున్- త్రివిక్రమ్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమా కోసం ప్యారిస్ బయల్దేరబోతోందట చిత్రయూనిట్. తదుపరి షెడ్యూల్‌ని అక్కడి అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేయాలని నిర్ణయించారట.
సినిమా ప్రారంభంలోనే కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ వెంటనే హైదరాబాద్ లో భారీ సెట్ వేసి కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఇక ఇప్పుడు ప్యారిస్ బయల్దేరడానికి సిద్ధమవుతున్నారు. వచ్చేనెల మొదటివారంలో ప్యారిస్ లో 'అల.. వైలుంటాపురంలో' తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలతో రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని, ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











