వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్స్
విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ త్వరలో 'అంతరిక్షం' అనే స్పేస్ కాన్సెప్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ఝాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.
ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలను నిర్మించిన రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ముఖ్యభూమిక పోషించనున్నాయి.
ఇందులో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి వ్యోమగాముగా కనిపించబోతున్నారు. కేవలం సైన్స్, ఫిక్షన్ మాత్రమే ఉంటుందా? తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే ఆసక్తికర కథ ఏమైనా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ది ఎక్స్‌పెండబుల్స్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ, హెర్క్యులెస్, ది ఇన్‌విజబుల్, లవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కోపోలో, గేమ్ అఫ్ థ్రోన్స్ వంటి హాలివుడ్ ప్రాజెక్టులకు పని చేసిన స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), రోమన్ ఈ చిత్రానికి పని చేశారంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని- మౌనిక నిగొత్రే సబ్బాని, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ, డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ, కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి, స్టంట్స్: టోడోర్ లాజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్, ఎస్.ఎఫ్.ఎక్స్: మైష్ త్యాగి, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.


Click it and Unblock the Notifications











