మెగాస్టార్ పక్కన ఆ ఇద్దరు భామలు.. థియేటర్లు హోరెత్తిపోతాయేమో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు చిరంజీవి. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ అది కలసి రాకపోవడంతో మరోసారి సినిమానే జీవితంగా ఎంచుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో అనుష్క కూడా నటించనుందనే ఆసక్తికర వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇంతకీ ఆ పాత్ర ఏంటి? ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు జనం. ఈ నేపథ్యంలో సైరాలో అనుష్క పాత్రపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది.

ఈ సినిమాలో అనుష్క పాత్రను కేవలం ఒకే ఒక్క పాటకు అంకితం చేశారని తెలుస్తోంది. అలా వచ్చి చిరంజీవితో చిందులేసి ఇలా 5 నిమిషాల్లోనే వెళ్లిపోతుందట ఈ జేజమ్మ. అయితే ఈ 5 నిమిషాలు మాత్రం థియేటర్లు ఈలలతో హోరెత్తే విధంగా కనువిందు చేసేలా ఈ పాట షూట్ చేయబోతున్నారట. ఇందులో చిరంజీవితో పాటు తమన్నా, అనుష్క ఇద్దరూ కలిసి సరసాలాడనున్నారని సమాచారం. సినిమా క్రేజ్ పెంచాలనే ఉద్దేశ్యంగానే అనుష్కను ఇలా పాటలో నటింపజేయాలనే ప్రయత్నం చేసినట్లుగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

in bizare incident in bollaram municipality

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సైరా నరసింహా రెడ్డికి సంబంధించి ప్రస్తుతం మిగిలి ఉన్న ఓకే ఒక్క పాట చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్టింగ్‌లో ఈ పాట చిత్రీకరణకు అంతా సిద్దం చేశారు. ఇందులో అనుష్క, తమన్నా, చిరు పాల్గొననున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X