సైలెంట్‌గా చిరంజీవితో కానిచ్చేసిన అనుష్క.. అంతా ఫినిష్
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్కకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. బాహుబలి ద్వారా వరల్డ్ స్టార్ గా కీర్తించబడినప్పటికీ.. ఆ తర్వాత భాగమతి చేసి సైలెంట్ అయింది. దీంతో అనుష్కకు పెళ్లి కల వచ్చేసింది. ఇక సినిమాలు చేయదు.. పెళ్లి చేసుకుంటుంది అనే ప్రచారాలు మొదలయ్యాయి. ఈ లోగా అలాంటి ప్రచారాలను తిప్పికొడుతూ సైలెన్స్ సినిమా సెట్స్‌పై వాలింది అనుష్క.
అంతటితో ఆగక ఇక తన సినిమాల జోరును పెంచేయాలని భావించిన ఆమె మెగాస్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు సైరా నరసింహా రెడ్డికి ఓకే చెప్పేసింది. ఈ చిత్రంలో ఓ కామియో రోల్ చేసేందుకు గాను అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి కథను వివరించే పాత్రలో అనుష్క నటించనున్నట్లు కొన్ని వార్తలు రాగా, మెగాస్టార్ తో ఓ మాస్ మసాలా సాంగ్‌లో దుమ్మురేపే స్టెప్పులేయనుందని మరికొన్ని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సస్పెన్స్ గానే ఉంచిన సైరా యూనిట్.. సైలెంట్ గా అనుష్కకు సంబంధించిన షూట్ ఫినిష్ చేసిందనేది తాజా సమాచారం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హిస్టారికల్ నేపథ్యంలో సైరా నరసింహా రెడ్డి సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. కథను మలుపు తిప్పే పాత్రలో తమన్నా నటిస్తోందని సమాచారం. ఇక అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కుచ్చ సుదీప్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది దసరా కానుకగా 'సైరా నరసింహా రెడ్డి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











