అమెరికాలో సైలెంట్‌గా మొదలుపెట్టి సర్‌ప్రైజ్ చేసిన అనుష్క

బాహుబలి సినిమాతో అమాంతం తన క్రేజ్ ని ఎల్లలు దాటించింది అనుష్క. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు స్వీటీ. చివరగా భాగమతి రూపంలో వెండితెర దర్శనమిచ్చిన ఈమె అభిమానుల రేంజ్ అందుకోలేక పోయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మధ్య సినిమాలకు దూరమైన అనుష్క ఇటీవలే సైలెన్స్ అనే సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభమైంది. యూఎస్ కావడంతో ఇందుకు సంబందించిన పిక్స్ తీయలేకపోయింది తెలుగు మీడియా వర్గం. దీంతో పేరుకు తగ్గట్టుగానే అనుష్క సైలెన్స్.. మూవీ సైలెంట్ గా మొదలైంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి తెలుగులో నిశ్శబ్దం, ఇంగ్లీష్‌లో సైలెన్స్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తుండగా అంజలితో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కూడా అనుష్క తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. గోపిసుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Anushka Shettys Silence starts in America

థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా కథ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది చిత్రయూనిట్. సినిమాకు సంబంధించిన ఎలాంటి లీక్స్ బటయకు రాకుండా చర్యలు చేపట్టింది. చిత్ర విడుదల తేదీ విషయంలో చిత్రయూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే విడుదలైన అనుష్క లుక్స్ ని బట్టి స్వీటీ ఈ సినిమాలో ఎంత గ్లామర్ గా దర్శమీయనుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ పాటలో చిందులేసేందుకు రెడీ అవుతోంది అనుష్క. అంటే మరికొన్ని నెలల్లోనే వెండితెర పై అనుష్క అందాలు మెరవనున్నాయన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X