'అరవింద సమేత' స్టిల్ లీక్.. 100 కోట్లు పక్కా, గాయాలయతో ఎన్టీఆర్, నాగబాబు!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబందించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలకు ఇదే నిదర్శనం. తాజగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒక సోషల్ మీడియాలో భభత్సం సృష్టిస్తోంది.

స్టిల్ లీక్
సినిమాకు సంబందించి లీకేజీలు ఎప్పుడూ ఉండే సమస్యే. పెద్ద చిత్రాలకు ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. ఎడిటింగ్ రూమ్ నుంచి చిత్రానికి సంబందించి స్టిల్ లీక్ అయ్యే అవకాశం ఉంది. తాజగా అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్, నాగబాబుకు సంబందించి ఓ స్టీల్ లీక్ అయింది.

ఎమోషనల్ సీన్
ఈ ఫోటోలు ఎన్టీఆర్, నాగబాబు ఇద్దరూ గాయాలతో కనిపిస్తున్నారు. ఎమోషనల్ నేపథ్యం ఉన్న సన్నివేశం అని అనిపిస్తోంది. గాయాలతో ఉన్న నాగబాబుని వాహనంలో తీసుకుని వెళుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా చూస్తున్నాడు.

100 కోట్లు పక్కా
ఈ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫాన్స్ ఈ ఫోటోని చూసి పొంగిపోతున్నారు. ఇలాంటి ఎమోషనల్, యాక్షన్ సీన్స్ ఉంటె అరవింద సమేత చిత్రం 100 కోట్లు సాధించడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో
అరవింద సామెత చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. నాగబాబు ఈ చిత్రంలో ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నది కూడా నాగబాబే అని ప్రచారం జరుగుతుండం విశేషం.

దసరా కానుకగా
సాధారణంగా నెమ్మదిగా చిత్రీకరణ జరిపే త్రివిక్రమ్ శ్రీనివాస్.. అరవింద సమేత చిత్రాన్ని మాత్రం శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











