twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరవింద సమేతకు తప్పని లీకుల బెడద.. త్రివిక్రమ్‌కు సవాల్‌గా నిలుస్తున్న లీకు వీరులు!

    |

    Recommended Video

    Aravinda Sametha Movie Shooting Was Held In Metro Station

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఫస్ట్ లుక్ తోనే అంచనాలని అమాంతం పెంచేశారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల నుంచి త్రివిక్రమ్ సహా అరవింద సమేత యూనిట్ మొత్తాన్ని ఓ సమస్య వేధిస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన కీలకమైన స్టిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి.

    నాగబాబు ఫొటోతో

    నాగబాబు ఫొటోతో

    మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఓ ఎమోషనల్ సన్నివేశానికి సంబందించిన స్టీల్ ఆ మధ్యన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎడిటింగ్ రూమ్ నుంచి లీక్ అయి ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి.

    టీజర్ కోసం

    టీజర్ కోసం

    తాజాగా మరి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీజర్ కోసం కట్ చేసిన స్టిల్స్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ స్టిల్స్ లో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నాడు.

    తల పట్టుకుంటున్న

    తల పట్టుకుంటున్న

    వరుసగా లీకులు జరుగుతూనే ఉన్నాయి. దీనితో చిత్ర యూనిట్ తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంత జాగ్రత్త వహించినా ఎదో విధంగా లీకులు జరుగుతూనే ఉన్నాయి. కీలకమైన సన్నివేశాలకి సంబందించిన స్టిల్స్ లీక్ అయితే సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    మెట్రో స్టేషన్‌లో

    మెట్రో స్టేషన్‌లో

    ప్రస్తుతం అరవింద సమేత షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మెట్రో స్టేషన్ లో ఎన్టీఆర్, పూజ హెగ్దేపై త్రివిక్రమ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లోని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మెట్రో స్టేషన్ లో హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశానికి సంబందించిన చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Aravindha Sametha Shooting at Metro station. Romantic scene between NTR and Pooja Hegde
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X