Akhanda 2: కుంభమేళాలో అఖండ -2 మూవీ టీమ్.. బోయపాటి ప్లాన్ మైండ్ బ్లోయింగ్..

Akhanda 2: నట సింహాం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి. తాజాగా వీరి కాంబోలో తన మరో సినిమా తెరకెక్కబోతుంది. అదే.. 'అఖండ 2-తాండవం'.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న 'అఖండ 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మూవీ మేకర్స్ నెట్టింట్టో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ మూవీ అప్డేట్ ఏంటో ఓ లూక్కేయండి.

నందమూరి బాలయ్య- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'అఖండ' ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా 'అఖండ 2' ప్రకటించారు. ఇటీవల మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షూటింగ్ గురించి సమాచారం ఇచ్చారు.

balakrishna boyapati sreenu comments on Akhanda 2 shooting in Prayagraj Maha kumbh Mela nandamuri

అఖండ 2 మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేస్తూ. 'అఖండ 2 - తాండవం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో షూటింగ్ ప్రారంభమవుతుంది, విశ్వాసం, భక్తిని ఈ సినిమాలో ప్రదర్శించబోతున్నాం' అనే పేర్కొన్నారు.ఈ మూవీ 2025 సెప్టెంబర్ 25న దసరాకు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్నదట. ఈ నేపథ్యంలో మహాకుంభమేళాలో షూటింగ్ చేయబోతున్నారట. ఈ మేరకు ఈ మూవీకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ఉన్నట్లు చూపబడింది.

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'అఖండ 2: తాండవం' (Akhanda2). ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ జరుగుతోంది. అఖండ 2 - తాండవం' సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను ప్రయాగ్‌రాజ్ షూటింగ్ చేస్తున్నారు. దీనిని ఉద్దేశించి తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. మహాకుంభ మేళ ఏర్పాట్లు చాల బాగున్నాయని, మా సినిమా ఆఖండ2 షూటింగ్ కోసం.. జనవరి 11న ప్రయాగ్ రాజ్ కు వచ్చామన్నారు.

అఘోర పాత్రతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళలో కోట్ల మంది భక్తుల మధ్య, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నాయి. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలుస్తామన్నారు. నేడు చివరి షూటింగ్ చేస్తున్నామన్నారు. మా షూటింగ్ లో ప్రయత్న లోపం లేకుండా అఖండ సినిమా షూటింగ్ చేస్తున్నామని డైరెక్టర్ బోయపాటి అన్నారు.

balakrishna boyapati sreenu comments on Akhanda 2 shooting in Prayagraj Maha kumbh Mela nandamuri

అఖండ 2' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం కూడా విడుదల కానున్నది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కాబోతుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X