Balakrishna: జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య.. అదిరిపోయిన వీడియో!
సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో తెరంగేట్రం చేసిన తనదైన నటనతో, డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాలకృష్ణకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాతో మంచి హిట్ కొట్టిన బాలయ్య బాబు ఇటీవల కాలంలో ఎక్కువగా పలు కమర్షియల్ యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. తాజాగా ఒక జ్యూయలరీకి సంబంధించిన యాడ్ షూట్ మేకింగ్ వీడియో అభిమానులకు పండుగల మారింది.
నట సార్వభౌమ, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలిచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికెళ్లిన.. విదేశాల్లో చూసిన బాలయ్య బాబు క్రేజ్ మాములుగా ఉండదు. జై బాలయ్య అనే నినాదంతో మారు మోగాల్సిందే. ఇక ఇటీవల బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం వీర సింహా రెడ్డి.

అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రూ. 200 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఒక సినిమాను లైన్ లో పెట్టాడు ఈ నట సింహం. ఇలా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోయే బాలకృష్ణ ట్రెండ్ కి తగినట్లుగా నడుచుకుంటారు. అందులో భాగంగానే అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా మారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. తెలుగు టాక్ షోలలో అన్నిటింకంటే క్రేజ్ వచ్చేలా హోస్ట్ గా తన మార్క్ చూపించాడు.
ఇలా సినిమాలు, టాక్ షోలు మాత్రమే కాకుండా కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్స్ లో కూడా సత్తా చాటుతున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే శ్రీ ప్రియ గ్రూప్ 116 పారమౌంట్ రియల్ ఎస్టేట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలయ్య బాబు వేగా జ్యూవెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలయ్య మార్చి 8న విజయవాడలో ప్రారంభం కానున్న కొత్త బ్రాంచ్ కు హాజరు కానున్నాడు.
మార్చి 8న మధ్యాహ్నం 2:45 నిమిషాలకు వేగా శ్రీ జ్యూవేలర్స్ బ్రాంచ్ ను ఓపెనింగ్ చేయనున్నాడు బాలయ్య బాబు. ఇదిలా ఉంటే ఈ అడ్వర్టైజ్ మెంట్ కు సంబంధించిన మేకింగ్ ఫొటోలు, వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ యాడ్ షూట్ లో బాలయ్య బాబు ట్రెడిషనల్ వేర్ లో ఎంతో గ్లామరస్ గా కనిపించగా.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చీరలో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. ఇక షూట్ కి సంబంధించి పనులు, బాలయ్య డైలాగ్ లు చెప్పడం, ప్రాక్టీస్ చేయడం, సరదా ముచ్చట్లని ఈ వీడియోలో చూపించారు.


Click it and Unblock the Notifications











