Balakrishna: శ్రీలీల చెంప పగులగొట్టిన బాలకృష్ణ.. ఏడుస్తూ వెళ్లిపోయిన బ్యూటి!

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి మంచి హిట్స్ అందుకున్న ఆయన లైన్ లో అనేక సినిమాలు ఉంచారు. మాస్ డైరెక్టర్ బోయపాటితో ఓ సినిమా చేస్తున్న బాలయ్య కామెడీ చిత్రాలకుపేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 మూవీ చేస్తున్నాడు. అయితే తాజాగా ముద్దుగుమ్మ శ్రీలీల చెంప చెల్లుమనిపించాడట ఈ నటసింహం. అసలు ఏమైందనే విషయంలోకి వెళితే..

రిలీజ్ డేట్: నందమూరి నటిసింహం బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 108 మూవీ NBK108. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మొదటి సారిగా బాలయ్య బాబు తెలంగాణ భాషతో అలరించనున్నాడని టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Balakrishna Slaps Sreeleela

మరో హీరోయిన్:NBK108 చిత్రాన్ని విజయదశమి కానుకగా.. రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. NBK108 సినిమాలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో బాలకృష్ణకు జోడిగా చందమామ కాజల్ అలరించనుంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ గా బ్యూటిఫుల్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కూడా నటించనుంది.

Balakrishna Slaps Sreeleela

విభిన్న పాత్రల్లో: అయితే బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కాకుండా ఓ రోల్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఇందులో బాలకృష్ణకు శ్రీలీల మేన కోడలిగా నటించనుందని ఓ టాక్ వస్తే.. ఆమెకు బాలయ్య బాబు బాబాయ్ గా చేస్తున్నాడని మరో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో చేయినున్నట్లు కన్ఫర్మ్ అయితే అయింది.

Balakrishna Slaps Sreeleela

ఏడుస్తూ వెళ్లిపోయిన బ్యూటి: ఇదిలా ఉంటే ఫ్రెండ్లీ పర్సన్ అయిన బాలయ్యకు కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలిసిందే. ఫ్యాన్స్ కోపం తెప్పించినప్పుడు ఆయన సీరియస్ గా రియాక్ట్ అవుతారు. అయితే తాజాగా బాలకృష్ణ కోపానికి బ్యూటిఫుల్ శ్రీలీల గురైంది. దీంతో ఆమెను బాలయ్య చెంపదెబ్బ కొట్టాడట. బాలయ్య అలా చెంప చెల్లుమనిపించడంతో శ్రీలీల ఏడుస్తూ వెళ్లిపోయిందని సమాచారం.

Balakrishna Slaps Sreeleela

సైలెంట్ గా: నిజానికి ఇదంతా జరిగింది ఒరిజనల్ గా కాదు. సినిమా షూటింగ్ లో భాగంగా శ్రీలీలను బాలయ్య కొట్టాల్సి వచ్చిందట. సన్నివేశం చిత్రీకరణలో భాగంగా భావోద్వేగాలు కృత్రిమంగా రాకుండా సహజంగా ఉండాలని చెంపదెబ్బ కొట్టమని బాలయ్యను శ్రీలీలే కోరిందట. దీంతో బాలకృష్ణ కొట్టగానే.. అందరూ షాక్ తో మౌనంగా ఉండిపోయారట. అనిల్ రావిపూడి కూడా సైలెంట్ అయి సీన్ పూర్తయిన కట్ చెప్పలేదని టాక్. మరి దీంట్లో ఎంత నిజముందో తెలియదు గానీ ఈ న్యూస్ అయితే వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X