రిక్షా తొక్కుతున్న బాలయ్య.. ఆ సన్నివేశాలు అద్భుతంగా.. ఫోటోలు వైరల్!
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడుగా, రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడుగా విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కృష్ణ జిల్లాలోని హంసల దీవిలో జరుగుతోంది.

రిక్షాపై బాలయ్య
తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి బాలయ్య ఫోటోలు లీక్ అయ్యాయి. రిక్షా తొక్కుతూ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాలయ్య అదరగొడుతున్నాడు. కీలక సన్నివేశల చిత్రీకరణలో భాగంగా బాలయ్య రిక్షా తొక్కుతున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అద్భుతమైన ఘట్టాలన్నిటిని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

ఆ సన్నివేశాలు అద్భుతంగా
70 వ దశకంలో కృష్ణ జిల్లాలో దివిసీమ ఉప్పెన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ సమయంలో వరద బాధితుల్ని ఆదుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ స్యయంగా రంగంలోకి దిగి విరాళాలు సేకరించారు. ఆ సన్నివేశాల్ని దర్శకుడు క్రిష్ అద్భుతంగా చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది.

ఏఎన్నార్ పాత్రలో సుమంత్
ఈ చిత్రంలో ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో సుమంత్ కూడా పాల్గొంటున్నాడు. రానా చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో తళుక్కున మెరవబోతోందట.

కొద్ది రోజుల వ్యవధిలోనే
కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ ప్రజానాయకుడు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరి 9 న మొదటి భాగాన్ని, జనవరి 24 న రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలోని అద్భుతమైన అంశాలన్నింటినీ బయోపిక్ లో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











