షాకింగ్: బ్రిటిష్ కోటని బూడిద చేస్తున్న సైరా.. ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ సినిమా తరహాలోనే!
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయమైన సినిమాలు, పాత్రలు చేశారు. కానీ ప్రస్తుతం నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రం చాలా ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. ఇది స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర. ఇలాంటి పాత్రలో మెగాస్టార్ ఇంతవరకు నటించలేదు. పైగా బడ్జెట్ పరంగా కూడా ఈ చిత్రం టాలీవుడ్ టాప్ చిత్రాలలో ఒకటిగా మారబోతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా లీకుల బెడద తప్పడం లేదు.

మొన్న ఎన్టీఆర్ సినిమా
పెద్ద చిత్రాల లీకుల పరంపర టాలీవడ్ లో కొనసాగుతోంది. భారీ అంచనాలతో రూపొందే స్టార్ హీరోల చిత్రాలు ఎదో ఒక రూపాల్లో లీకేజి బారీన పడడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలోని కీలక సన్నివేశానికి సంబందించిన ఫోటో ఒకటి లీకైన సంగతి తెలిసిందే. అదే తరహాలో మెగాస్టార్ సైరా చిత్రానికి షాక్ తగిలింది.

బ్రిటిష్ కోట దగ్ధం
గడచిన నెలరోజుల్లో సైరా చిత్రంలోని అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. బ్రిటిష్ కోటపై సైరా నరసింహా రెడ్డి దండెత్తే సన్నివేశం అది. బ్రిటిష్ కోట మంటల్లో కాలి బూడిదవుతోంది.

వైరల్
ఈ విషయం లీకైన వర్కింగ్ స్టిల్స్ ఆధారంగా బయట పడింది. సైరా చిత్ర టీం, ఫారెన్ టెక్నీషియన్స్ అంతా కలసి బ్రిటిష్ కోటని సైరా తగలబెట్టే సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఫొటోలో భారీ సెట్ కనిపిస్తోంది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

బ్రిటిష్ ఆర్మీ
అప్పటి బ్రిటిష్ ఆర్మీ, వారి వేషధారణకు సంబందించిన స్టిల్ కూడా లీక్ అయింది. భారీ ఫిరంగులు, ఆయుధాలు కలిగిన బ్రిటిష్ సైన్యంతో సైరా ఎలా తలపడ్డాడు అనే ఉత్కంఠని ఈ ఫోటోలు పెంచేస్తున్నారు.

ఆపకపోతే
లీకేజి వలన విడుదలకు ముందే ఆసక్తికర విషయాలు ఆడియన్స్ కు తెలిసిపోతాయి. ఇది సినిమాకు మంచిది కాదు. ఇక ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా నిర్మాత రాంచరణే చర్యలు తీసుకోవాలి.


Click it and Unblock the Notifications











