షూటింగ్ లో విజే సన్నీకి బుల్లెట్ గాయం.. కమెడియన్ సప్తగిరి చేసిన పొరపాటు కారణంగా ఘటన!

బిగ్ బాస్ ఫేం వీజే సన్నీకి షూటింగ్ లో గాయమైంది. ప్రస్తుతం సన్నీ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాకి అన్ స్టాపబుల్ అనే నామకరణం చేశారు. ఫుల్ కామెడీ ఎంటర్ ట్రైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా, ఈ సినిమా ప్రోమోని స్పెషల్ గా షూట్ చేయాలని అనుకున్నారు. ఈ ప్రోమో షూట్ లో వీజే సన్నీతో పాటు, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సప్తగిరి పాల్గొన్నారు. కాగా, ఈ షూట్ సమయంలో సన్నీకి గాయం అయ్యింది.

అన్ స్టాపబుల్ మూవీ ఎప్పుడు అనే ప్రశ్న అడుగుతూ సప్తగిరి రివాల్వర్ గురి పెట్టగా, పొరపాటున సన్నీకి బులెట్ తగిలింది. అది డమ్మీ బులెట్ అయినప్పటికీ, సన్నీ మెడ దగ్గర గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే సన్నీని సినిమా సిబ్బంది చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యకత్మౌతున్నాయి. సన్నీకి నిజంగా గాయం కాలేదని, ఇది కూడా మూవీ ప్రమోషన్ స్టంట్ అని కొందరు కామెంట్ చేశారు.

Bigg boss fame VJ Sunny injured after dummy bullet hits him during shoot

సన్నీ తన సినిమా కోసం గతంలో ఏటీఎం నుంచి డబ్బులు దొగిలించినట్లు స్టంట్ చేసినట్లే ఇది కూడా అలానే చేశాడు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సన్నీ గతంలో టీవీ సీరియల్స్ లో నటించేవాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లి పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5కి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత వరసగా సినిమా అవకాశాలు చేజిక్కించుకున్నాడు. కొన్ని సినిమాలు చేశాడు.

కానీ అవి పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ సినిమాలకు ఉపయోగపడుతుందని అనుకున్నాడు. కానీ బిగ్ బాస్ తర్వాత ఆ క్రేజ్ తగ్గిపోయింది. సినిమాలకు ఉపయోగడపలేదు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక అన్ స్టాపబుల్ మూవీలో వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. పోసాని, 30 ఇయర్స్ పృథ్వి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి... ఇలా టాలీవుడ్ కమెడియన్ గ్యాంగ్ మొత్తం నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రజిత్ రావ్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X